మన దేశంలో దేవుని సింహాసనం! ఎలా?
స్తుతి ప్రార్ధన శక్తి నిరూపణ
ప్రియ దైవ జనులకు మీ జత పని వాడనైన క్రీస్తు దాసుడను, మరియు తోటి క్రైస్తవ సహోదరి సహోదరులకు అపోస్తుల పిలుపుతో దేవుని సేవను కొనసాగిస్తున్న నాని బాబు నెల్లి భారముతో, హృదయ పూర్వక వందనములతో వ్రాయునది.
ఒక యదార్ధ విషయాన్ని మీకు తెలియ జేయాలని ఆశ పడుతున్నాను. ఎస్తేరు ప్రాజెక్ట్ వారు ప్రచురించిన లెక్కల ప్రకారం 2016 లో 361 సఘంపై దాడులు నమోదు చేయ బడ్డాయి, 2016 నుండి సంఘం మీదకు శ్రమలు ఇంతకు ముందు కంటే 20% పెరిగాయి, మరియు ప్రతి 40 గంటలకు ఒక సంఘ వ్యతిరేక సంఘటన జరుగుతుంది. CBN NEWS ప్రకారం 2017 లో అర్ధ సంవత్సరనికే జరిగిన సంఘటనలు 2016 లో మొత్తం జరిగిన సంఘటనలు తో సమానం. మరియు ఓపెన్ డోర్ వారి 2018 వాచ్ లిస్టు నందు ప్రపంచంలో 50 అతిగా క్రైస్తవ సమాజం హింసింప దేశాల జాబిత లో మన దేశం 11 వ స్థానం లో ఉంది. ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగ చెప్పబడుచున్న మన దేశం లో ఇలా సంఘ వ్యతిరేక దాడులు జరగడం చాల అవమానకరం. మన దేశంలోని పరిస్థుతులు ఇలా క్రైస్తవ సమాజానికి సంఘానికి సేవకు విరుధం గా మారుతున్నాయి. రాబోయే కాలం లో ఈలాంటి పరిస్థితి కొనసాగితే దేవుని సేవ చేయుటకు, ప్రభువును భాహిరంగంగా స్తుతించడానికి అవకాశాలు ఉండక పోవొచ్చు.
మరో మంచి ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. 2011 నుంది ఉతర కొరియా ను పాలించిన కిమ్ జోంగ్ ఉన్ ఎంతటి నియంతో, ఆ దేశాన్ని ఎల పాలించాడో, ప్రపంచ పోలీస్ గా, శక్తీ వంత మయిన దేశం అమెరికా మీదకు ఎలా కాలు దువ్వాడో మనకు తెలిసిందే కాని మనకు తెలియని ఒక విషయం, అక్కడ క్రైస్తవ సమజాన్ని అతడు చిత్ర హింసలకు గురి చేసాడు. అనేక మంది వారి విశ్వాసం కోసం ప్రాణాలు బలి పెట్టారు, అక్కడ సంఘం కటిన హింసలు అనుభవించారు, తాగడానికి నీళ్ళు లేక, సరియయిన వైద్య అందక జైల్లో చిత్ర హింసలకు గురి అయ్యారు. అయితే అద్బుత మయిన విషయం ఏమిటి అంటే హింస కాలం లోనే అక్కడ సంఘం 5 రెట్లు వృద్ది అయ్యింది. జూన్ 12 న జరిగిన అమెరికా ఉతర కొరియా ల ఒప్పందం వలన మరల సంఘానికి స్వేచ్చ కలిగింది. దానికి వారు చేసిన పనేంటో తెలుసా ప్రార్ధన.
ప్రార్ధనా వారికి కరడు గట్టిన నియంత నుండి స్వేచ్చ ను తీసుకు రాగలిగింది. ప్రార్ధనా అమెరికా పాలకులలో శాంతి భావాన్ని కలిగించి తిరుగు బాటు చేసినా శాంతిగా ఒప్పందం కుదుర్చుకునే టట్టు చేయగలిగింది. కిమ్ జోంగ్ ఉన్ మనస్సును మార్చగలిగింది. దేవుని సహాయాన్ని పొందుకునే టట్టు చేసింది. ఎక్కడైతే ప్రార్ధాన, స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు ఆశినుడు అవుతాడు.
ఆశినుడు అంటే కూర్చోవడం, వాక్యం లో చెప్పినట్టు మన స్తుతులే ఆయన కూర్చోడానికి సింహాసనం ( కీర్త 22 :3 ) . అయన అసినుడు అయిన చోట అయన కాళ్ళ క్రింద ఒక పాద పీటం ఉంటుంది. అదేంటో తెలుసా అయన శత్రువులు (కీర్త 110 ). అయన కు మనం సింహాసనం వెయ్య గలిగితే అయన శత్రువు, సంఘ వ్యతిరేకులును అయన పాద పీటం గ చేసుకుంటాడు. ఆయనను సేవించు వారిని తన ప్రక్కన కూర్చుండ బెట్టుకుంటాడు. అంతే కాదు మన శత్రువులను మను పాద పీటము గా చెయ్య గలడు. అయితే మనం ఆయనకు ఒక సింహాసనం వెయ్యాలి.
పరలోకం లో ఆయనకు ఒక సింహాసనం ఉంది. ఆయనను మనం భూమి మీదకు తీసుకుని రాగలిగిన ఒకే ఒక్క మార్గం అది పరలోక మాదిరి స్తుతి, ఆరాధన. ఆదే ఆయనకు ఒక సింహసనం. ప్రభువు తన వాక్యం లో నేను సియోను వాసిని అన్నారు. అంటే అయన సియోనులో సింహసనసినుడు అయ్యారు. ఎందుకంటే సియోనులో దావీదు ఒక గుడారాన్ని కట్టి అక్కడ పరలోక మాదిరి నిత్య స్తుతి ఆరాధన క్రమాన్ని స్థాపించాడు.
ఈరోజు మనం కూడా అలాంటి ఎడతెగని స్తుతి ఆరాధన స్థాపించ గలిగితే అయనకు మన దేశం లో, మన రాష్ట్రం లో, మన జిల్లాలో ఒక సింహాసనాన్ని వెయ గళం. ఆ సింహాసనాన్ని సిధపరచ డానికె ఇండియా ప్రేయర్ లీగ్ స్థాపించా బడింది. ఇప్పటికే 64 సంఘాలు తూర్పు, పచ్చిమ గోదావరి, గుంటూరు జిల్లా ల నుండి, 20 సంఘాలు కలకత్తా, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుండి ఇందులో పాలి భాగస్తులై ఉన్నారు. మీరును కూడా ఇందులో పాలి భాగస్తులై భారత దేశ క్షేమం కొరకు మన దేవునికి ఒక సింహాసనాన్ని సిద్ధపరుచుధాం . అందుకు మీరు చేయాల్సినది నెలలో సంఘముగా అయితే ఒక రోజు లేక వ్యక్తి గతం గా అయితే ఒక గంట / అర గంట సమయం కేటాయించాడం. మీరు కేటాయించిన సమయానికి మీరు ఉన్న స్థలములో ఉండి ప్రార్ధనలో ఉంటె చాలు. అవ్విధముగా నెలలోని 30 దినములు, 72౦ గంటలు ఎడతెగని స్తుతి ఆరాధనా జరుగుతుంది.
ఇప్పటికే అనేకులు స్తుస్తితూ ప్రార్ధిస్తున్నారు. మీ ఫోన్ నుండి ఒక మిసిడ్ కాల్ గాని, మీరు ప్రార్ధించే సమయం మెసేజ్ గాని చేయుట ద్వార మాకు మీ అంగికారని తెలియ జేయండి. కలసి దేవుని సన్నిధిని అనుభవిద్దాము, అలగే మీ ప్రార్ధనా అవసరతలు ఉంటె మాకు తెలియ జేయండి మనతో కలసి ప్రార్ధించే వారికి మీ అవసరత తెలియ పరుస్తాము. ప్రతి గంటకు మీ నిమిత్తం ప్రార్ధనాలో దేవుని ఎదుట ప్రస్తావించ బడుతుంది.
ప్రభువు సేవలో,
అపొస్తులు నాని బాబు నెల్లి,
స్థాపితులు,
ఇండియా ప్రేయర్ లీగ్,
దీప స్తంభం
ఒక వేసవి కాలములో పిల్లలకు సెలవు రోజుల్లో, మేము మా పిల్లలతో అంతర్వేది బీచ్ కు వెళ్ళాము. అక్కడ ఒక లైట్ హౌస్ ఉంది. దానిని చూడటానికి వెళ్ళాము, పిల్లలు దాని గురించి చెప్పండి నాన్న అని అడిగారు. అప్పుడు దాని గురించి చెప్పడం మొదలు పెట్టాను. సముద్రం లో ప్రయాణం చేసే ఓడలుకి, చేపల వేటకు వెళ్లే మత్యకారులకు ఒడ్డుకు చేరడానికి ఒక దిక్షుచి అని చెప్పాను. ఎందుకలా వాళ్లకు తెలియదా? అన్నారు. సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు సముద్ర తీరం కణపడదు, అలాంటప్పుడు ఈ దీపం వెలుగు వారికి తీరం ఎటువైపు ఉందో చూపిస్తుంది అని చెప్పాను. నిజమే కదా, సువిశాలమైన సముద్రం లో ఓడలు, పడవలు, నావలు ఒడ్డుకు నడిపించే దీపం, వెలుగు తీరాన్ని ఉండాలి. అప్పుడే తీరానికి చెరగలరు.
అలాగే యేసు వారు మనకు దీపం, వెలుగై ఉండి, మనకంటే ముందుగా లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించి, తీరానికి చేరి మనకు మార్గాన్ని చూపిస్తున్నారు. ఈ జీవన సముద్రం లో మన జీవిత పడవ ప్రయాణం వెలుగై, దీప స్తంభం అయ్యి ఉన్న యేసు వైపు చూస్తూ నడిస్తే మనం కూడా యేసు వారి వలె పాపం, మరణం, లోకం జయించ గలము. నిత్య తీరమయిన పరముకు చెరగలం. మరణమును, నరకనును తప్పించు కొగలము.
ప్రభువు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక!
దేవుని అద్భుతం
ఒకసారి ఒక వృద్ధుడు
దేవుడు తనకు ఇచ్చిన పిలుపు, బారాన్ని బట్టి రైలు లో సువార్త ప్రకటిస్తున్నారు. ప్రతి కంపార్ట్మెంట్ లోకి వెళ్లి నిలువబడి “ యేసు రక్షకుడు, మన పాపముల కొరకు చనిపోయి, తిరిగి లేచారు, ఆయన మరల వస్తున్నారు, మారుమనస్సు పొందండి” అంటూ గట్టిగ అరుస్తూ చెపుతున్నాడు. ఇంతలో అక్కడ ఉన ఒకావిడ అతని మీద కేకలు వేస్తూ, నోరుమూయి, నీ చెప్పే యేసు అసలు లేరు అని గట్టిగ అరిచింది. ఆ ముసలాయన ఏమి చెయ్యలేని పరిస్థితిలో, భయపడి కూర్చుండి పోయాడు.
గానీ దేవుడు తనను
బలవంతం చేస్తున్నారు, సువార్త ప్రకటించడం
అపవద్దు అని. దేవునికి భయపడి, లోబడి మరల నిలువబడి వాక్యం ప్రకటించడం మొదలు పెట్టాడు. మరల ఆ స్త్రీ తనమీద కోపం తో విరుచుకు పడి, దాడి చెయ్యడం మొదలు పెట్టింది. ఇంతలో తనకుడ కూడా వచ్చిన తన కుమారుడు గట్టిగా “ అమ్మ, తనను ఏమీ చెయ్యొద్దు, అతను దేవుని చేత పంపబడిన వాడు” అని చెప్పాడు అంట.
వెంటనే ఆ స్త్రీ మోకాళ్ళ
మీద పడి ఏడ్వడం మొదలు పెట్టింది. రొమ్ము కొట్టుకుంటూ
ఏడుస్తూ, తన పాపాలను ఒప్పుకుంటూ, యేసు ను అంగీకరించడం మొదలు పెట్టింది.
ఆ వృద్ధుడు ఏమైదీ
అని అడిగితే, “ నా కుమారుడు పుట్టి మూగవాడు” అని ఏడ్చింది.
ప్రభువు మిమ్మును
దీవించి, అంగీకరించును గాక!
రేమిడిసివర్ ఇంజక్షన్
ప్రస్తుతం బాగా
వినపడుతున్న మాట రిమిడిసేవిర్. కొవిడ్ వచ్చిన వారికి
ఇచ్చే ఇంజక్షన్. ఇధి ఒకోసారి లక్షలలో
పలుకుతుంది. ఎందుకంటే అది లోపల ఉన్న వైరస్
పెరగకుండా ఆపుతుంది. అయితే కొన్ని కేసులలో
ఆ ఇంజిక్షన్ ఇచ్చినా చనిపోతున్నారు. కారణం ఏమిటి అంటే వైరస్ వంటి నిండా వ్యాప్తి చెందిన
తరువాత దానిని వాడుతున్నారు. దానిని వైరస్ సోకిన
వెంటనే ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దాని పని సక్రమంగా
చెయ్యగలిగుతుంది.
శత్రువుల బయమా?
బెతనియలో క్రైస్త్వవ్యం మార్కు 14 : 3 -10
బెతనియ లో క్రైస్తవ్యం?
బెతనియలోని సిమోను?
విలువయిన అత్తరు ఎలా ఇవ్వగలిగింది?
దేవుని దృష్టిలో ఆమె తెచ్చిన అత్తరు ఎలా కనిపించింది?
6డిసెంబర్ 2020 ఆదివారం ఆరాధనలో అందించిన వాక్యం లైవ్ ...
పట్టుకున్న దానిని కూడా వదిలేయ్
వర్షా
కాలం లో ఒక వ్యక్తి ఏటిగట్టున నడుకుంటూ వెళ్తుండగా కాలు జారి ఏటిగట్టుకు క్రిందన
ఉన్న నేల నూతిలో పడిపోసాగాడు, ప్రాణబయంతో అక్కడ చేతికి అందిన ఒక మొక్కను
పట్టుకున్నాడు. అయితే కురుస్తున్న వార్షానికి నెల మెత్తన పడి అది కుడా ఒకో వేరు
ఒకో వేరు తెగిపోవడం మొదలు పెట్టింది. వేర్లు తెగుతున్న కొలది వాని ప్రాణాలు
జారిపోతున్నాయి. ఎంత కేకలు పెట్టిన ఎవ్వరు రావడం లేదు. ఇక ప్రాణ భయంతో ఉండగా దేవుడు
గుర్తుకు వచ్చారు, వెంటనే ప్రార్ధన చెయ్యడం మొదలు పెట్టాడు. కాపాడమని అడగడం మొదలు
పెట్టాడు. అయితే అది అత్యవసర పరిస్థితి గనుక దేవుని ప్రత్యక్షత దొరికింది.
ఏమికావాలని ప్రభువు అడగగా? నన్ను కాపాడు అన్నాడు. నేను నిన్ను కాపాడగలనని నమ్ముతున్నావా?
అడిగారు ఆయన, నమ్ముతున్నాను అన్నాడు, నిజంగా నమ్ముతున్నావా? నీవు మాత్రమె కాపడగలవు
అన్నాడు. అప్పుడు దేవుడు నా మీద అంత నమ్మకం ఉంటె నీవు పట్టుకున్న చెట్టు వద్దిలేయ్
అన్నారు......
నిజమయిన,
ధృడ మయిన నమ్మకం ఉంటె అప్పటివరకు పట్టు
కున్నదాన్ని వదిలివేయ గలుగుతాడు? లేక పోతే దేవున్ని వదులుకోవలసి వస్తుంది.
ఈరోజుల్లో
కుడా ప్రతి క్రైస్తవుడు కుడా దేవుని మీద నమ్మకం అంటారు కాని లోక సంప్రాదాయాలు(
సంస్కృతి కాదు, అది వేరు ), కట్టు బాట్లు, ముహూర్తాలు, ఎదురులు, శకునాలు,
తాయిత్తులు, మంత్రాలు, ఎలా చాలా ఉన్నాయి వాటిని వదలడం లేదు, వాళ్లకు తెలియకుండానే
దేవున్ని వదులుకుంటున్నారు, కాని దేవునిలోనే ఉన్నాము అనుకుంటున్నారు. దేవుని శక్తి
పరిపూర్ణంగా చూడాలి అంటే పరిపుర్ణమయిన నమ్మకం ఆయనమీద పెట్టగలగాలి.
క్రియలు
లేని విశ్వాసం మృతము యాకోబు 2: 26
మీ
కొరకు ప్రార్ధించు
అపోస్తులు
నాని బాబు నెల్లి
990882316
క్రమ శిక్షణ
దేవుడు
నాకు ఇద్దరు బిడ్డలను ఇచ్చారు. వారు దేవునిలో ఎదుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళు
అప్పుడప్పుడు నేను వాడే కంప్యుటర్ వాడుతుంటారు. నేను నా లాప్టాప్ కి బ్లుటూత్ కీ
బోర్డ్, మౌస్ వాడుతున్నాను. రెండు సంవత్సరాల క్రితం వాళ్లకు ఒక మాట చెప్పాను.
ఏంటంటే ఎప్పుడైనా మీరు కంప్యుటర్ వాడటం అయిపోయాక కీ బోర్డ్ మౌస్ స్విచ్ లు ఆఫ్ చెయ్యండి అని
చెప్పాను. నేను అయిన అప్పుడప్పుడు మరచి పోతాను. నేను కంప్యుటర్ ఆన్ చేసి మౌస్, కీ
బోర్డ్ పని చెయ్యడం లేదు ఏంటి అనుకుంటాను. కాని అంతకు ముందు నా పిల్లలు వాడి అఫ్
చేసి ఉంటారు. వాళ్ళు కంప్యూటర్ వాడినప్పుడు నాకు తెలిసి పోతుంది. అదే వాక్యం కుడా
చెపుతుంది. బాలుడు నడువవలసిన మార్గం వాడికి నేర్పు అని. మనం మరి ఏమి చేస్తున్నాము.
దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చారు అది ఒక మంచి పౌరిడిని, ఒక మంచి అన్నను, తమ్ముడిని,
అక్కను, అమ్మను, చెల్లిని, స్నేహితురాలును, ఒక మంచి బర్తను, బార్యను తయారు చేయాల్సిన
బాధ్యత. నీవు చిన్న నాటి నుండి వారిని ఎలా పెంచావో అలానే వారు పెద్ద వారు అయ్యాక
ఉంటారు. వాళ్ళు ఎవరి మాట వినరు నీ మాట తప్ప. అలాంటిది నీవు ఏమి నేర్పిస్తున్నావు.
రేపటికి, బవిష్యత్ కు ఆలోసించి వారిని సిద్ధం చెయ్యి.
సామెతలు
22:6; 23:13; 29:15; ఎపేసి 6:1 ; తప్పక చదవండి
ప్రభువు
మిమ్మును మీ పిల్లలను దీవించును గాక.
మీ సహోదరుడు,
అపోస్తులు నాని బాబు నెల్లి
విదేశీ ప్రయాణం - పరమ ప్రయాణం
మా సంగములొ చాలా మంది విస్వాసులు విదేశాలలో ఉన్నారు. వారి కొరకు అనుధినము ప్రార్ధన చేస్తూ ఉంటాము. అయితే వాళ్లు ఇక్కడ నుండి వెళ్లేటప్పుడు ప్రార్ధన సహకారం అడుగుతూ ఉంటారు, పాస్పోర్ట్ త్వరగా రావాలని, మెడికల్ లో పాస్ అవ్వాలని, ఇమిగ్రేషన్ అవ్వాలని, టికెట్ ధొరకాలని ఇలా... ఇవన్నీ ఎందుకు వేరే దేశం లోనికి ప్రవెసించడానికి కావలసిన అర్హతలు. పాస్పోర్ట్ తీసుకోవడానికి కేసులు ఉండకూడదు - అంటె మంచి స్వభావం ఉండాలి, రెండవది కనీస చదువు ఉండాలి, స్థిర నివాసం కలిగి ఉండాలి. ఎ లోపం లేని మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. ఒక రెండు సంవత్సరాలు ఉండే దానికే ఇంత జాగ్రత్త లు తీసుకుంటే చిరకాలం ఉండే పరలోకానికి అనుమతి ఇవ్వడానికి దేవుడు ఇంకెన్ని జాగ్రత లు తీసుకుంటారు. నీ శరీర ఆరోగ్యం ఆయన పట్టించుకోరు గాని, నీ స్వభావాన్ని, గుణాన్ని, నీ హృదయ స్థితి, విశ్వాసం లో స్థిరత్వమును కచ్చితంగా చూస్తారు.
2కోరింథీయులకు 5: 10
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.
మీ సహోదరుడు
అపొస్తులు నాని బాబు నెల్లి




