మా సంగములొ చాలా మంది విస్వాసులు విదేశాలలో ఉన్నారు. వారి కొరకు అనుధినము ప్రార్ధన చేస్తూ ఉంటాము. అయితే వాళ్లు ఇక్కడ నుండి వెళ్లేటప్పుడు ప్రార్ధన సహకారం అడుగుతూ ఉంటారు, పాస్పోర్ట్ త్వరగా రావాలని, మెడికల్ లో పాస్ అవ్వాలని, ఇమిగ్రేషన్ అవ్వాలని, టికెట్ ధొరకాలని ఇలా... ఇవన్నీ ఎందుకు వేరే దేశం లోనికి ప్రవెసించడానికి కావలసిన అర్హతలు. పాస్పోర్ట్ తీసుకోవడానికి కేసులు ఉండకూడదు - అంటె మంచి స్వభావం ఉండాలి, రెండవది కనీస చదువు ఉండాలి, స్థిర నివాసం కలిగి ఉండాలి. ఎ లోపం లేని మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. ఒక రెండు సంవత్సరాలు ఉండే దానికే ఇంత జాగ్రత్త లు తీసుకుంటే చిరకాలం ఉండే పరలోకానికి అనుమతి ఇవ్వడానికి దేవుడు ఇంకెన్ని జాగ్రత లు తీసుకుంటారు. నీ శరీర ఆరోగ్యం ఆయన పట్టించుకోరు గాని, నీ స్వభావాన్ని, గుణాన్ని, నీ హృదయ స్థితి, విశ్వాసం లో స్థిరత్వమును కచ్చితంగా చూస్తారు.
2కోరింథీయులకు 5: 10
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.
మీ సహోదరుడు
అపొస్తులు నాని బాబు నెల్లి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి