రాజ్య సువార్త లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రాజ్య సువార్త లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

యేసు వారు ఎందుకు స్వస్థత లు ప్రకటింప వద్దు అన్నారు?



యేసు వారు ఎప్పుడు ఎవరిని శ్వస్త పరచిన వారికి ఖండితంగా చెప్పే వారు " ఎవనికి చెప్ప వద్దు " అని. ఆయన ఎందుకు చెప్ప వద్దు అనేవారు?

యేసు వారు ఇలోకానికి రాజ్య సువార్త ప్రకటించడానికి వచ్చారు. అందులో ఒక బాగమే శ్వస్తత, అద్భుత కార్యాలు గానీ అదియే సువార్త కాదు. మానవుడు మనసు నిలుపవలసింది రాజ్య సువార్త మీద గానీ లోక సంబంధ మయిన వాటి మీద కాదు. ఆత్మ విడుదల, ఆత్మీయ శ్వస్తత ముఖ్య మయ్యింది కానీ క్షయమయిపోయే శారీరక విషయాలు కాదు. మానవ నైజం వలన వీటినే మనసున పెట్టీ అసలు యేసు వారి రాకకు అసలు కారణం ను పేడ చెవిన పెడతారని ఆయన వాటిని ప్రకటించ వద్దు అన్నారు. స్వస్థ పొందిన వారు వెళ్ళీ ప్రకటించుట వలన అనేకులు యేసును వెంబడించారు, అనేకులకు యేసు వారి గురుంచి తెలిసింది కానీ అసలు యేసు వారి రాజ్య సువార్త ను గ్రహించింది 120 మంది మాత్రమే. మిగిలిన వారు భౌతిక స్వస్థత, విడుదల, అద్భుతాలు జరుగుతాయి అని వచ్చిన వారే. 

ఈరోజు జనాన్ని పోగు చేసుకోవడం కోసం స్వస్థత లు అద్భుతాలు జరుగుతాయి అని ప్రకటించడం జరుగుతుంది అని ఉద్దేసం. అందులో గుంపులు గుంపులు గా జనం ప్రోగు పడుతున్నారు. కానీ నిజముగా దేవుని రాజ్య సువార్త ను గ్రహించే వారు ఎంత మంది. ఒక సేవకుని గా నీ పిలుపు ఏమైపోతుందో, మన తండ్రి మీ మీద పెట్టుకున్న ఆశలు నడి ఆశలు గానే మిగిలి పోతున్నాయి. 

ఒక విశ్వాసి గా నీవు దేని మీద మనసు పెడుతున్నవు? దేవుని రాజ్యం మీద ఉంచాలి ఆయన కోరుతున్నారు. అందుకే ఆయన ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వేదకమని చెప్పారు. అప్పుడు అవన్నియు మీకు దేరుకుతాయి అన్నారు. 

ప్రభువు మిమ్మును దీవుంచును గాక! 

ఆపొస్తులు నాని బాబు నెల్లి.