నీ జీవతం లో ఎదురయ్యే సమస్యలను చూసి భయపడుతున్నావా? రాబోయే ఆర్ధిక ఇబ్బందులను
బట్టి చింతుస్తున్నావా? రాబోయే రోజుల్లో ఎలా బ్రతకాలి?
ఎలా జీవనాన్ని కొనసాగించాలి? మారుతున్న
సమాజంలో ఎలా పోటి పడగలము? ఆర్ధిక పరమైన సమస్యలు ఎలా
ఎదుర్కొన గలము ? మనకు ఎవరు సహాయం చేస్తారు అని దిగులు
పడుతుంటే ఈ వాక్య భాగం నీకోసమే. ఇశ్రాయేలు దేశంలో దేవుని ఉగ్రత వలన గొప్ప కరువు
ఏర్పడింది. అయితే దేవుడు పిలచుకున్న దైవ జనుని కొరకు ప్రభువు కొంత కాలం కాకులతో
భోజనం పంపించారు. తరువాత తనను పోచించడానికి ఒక వెధవరాలను ఎన్నుకుని తన యొద్దకు
సేవకున్ని పంపుతారు ప్రభువు. సారేపతు గ్రామంలోకి రాగానే ఆమె పుల్లలు
ఏరుకుంటూ కనపడింది. ఆమెను నీళ్ళు అడిగి, తేవడానికి వెళ్ళిన ఆవిడతో
తినడానికి రొట్టె ముక్కను తెమ్మని చెపుతాడు దైవ జనుడైన ఏలియ. ఆమె తనదగ్గర పట్టెడు
పిండి, కొంచెం నునే మాత్రమె ఉన్నాయి, వాటిని తిని చనిపోదాము అనుకుంటున్నాము నేను నా బిడ్డ అంటూ తన బాధను,
భవిష్యత్తు లేదు నాకు, అంటూ నిరాశతో,
మరణానికి దగ్గరగా ఉన్నాము అని బాధగా నిట్టూర్పుతో చెప్పింది.
అయితే ఎలియ రెండు అప్పాలు అయ్యేదానిని ౩ అప్పాలుగా చేసి మొదట రొట్టెను నాకు ఇవ్వు
అన్నాడు. ఆమె దైవ సేవకునికి లోబడి మొదటి అప్పమును ఎలియకు ఇచ్చింది, ఇక ఆ ఇంటిలో పండుగ, సమృద్ధి, దీవెన, మొదలయ్యింది. ఆ తోట్టేలోని పిండి
అయిపోలేదు, బుడ్డిలో నూనే తరిగిపోలేదు మరల వర్షం వచ్చి,
పంటలు పండేవరకు ఆ ఇంటివారు బంధువులు అందరు సమ్రుది గా తిని
పోషింప బడ్డారు. ఈరోజు నా దగ్గర ఏమిఉంది అని అనుకోకు, నీ
దగ్గర ఉన్న చిన్న వాటిలో కూడా నమ్మకముగా ఉండటం మొదలు పెట్టు.... దేవునికి ఇవ్వడం
ప్రారంబించు, అది నీకు ఉన్నదానిలోనే దేవుని సన్నిధిలో
విత్తడం ప్రారంబించు. అది రెట్టింపు అయ్యి, తగిన సమయం లో
నీ ముందు నిలిచి ఉంటుంది. ఆ కుటుంభాన్ని పోషించడానికి కాదు దేవుడు సేవకున్ని
అక్కడకు పంపింది, సేవకున్ని పోషించుట ద్వారా వారు పోషింప
బడటానికి దేవుడు సేవకున్ని పంపించాడు. ఈరోజు సేవకుల మీద స్వార్ధపడే విశ్వాసులు,
ప్రజలు ఎక్కువ గా కనపడుతున్నారు. సేవకున్ని పోషించడం మొదలు
పెడితే నీవు నీ కుటుంభము ఉన్నత రీతోలో పోషింప బడతారు. మిగుల సంపదను నీకు
అనుగ్రహిస్తాడు. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతయు
పరిశుద్ధమే రోమ 11:16, మీ కుటుంబములకు ఆశీర్వాదము కులునట్లు మీరు ముందుగా
పిసికిన పిండి ముద్దను యాజకునికియ్యవలెను. యెహేజ్కెలు 44: 31. సారేపతి లోని కుటుంభము వలె మీరును పోషింపబడుదురు
గాక!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు