జీవితం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జీవితం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శిక్ష (న)

 





ఈరోజు నా మనస్సు ను చాలా బాధ పెట్టిన విషయం లో ఒక మంచి పాఠం మీకోసం….

 

నా కుమారుని క్రమశిక్షణ లో బాగంగా తాను ప్రతి రోజు చెయ్యవలసిన కొన్ని పనులు చెయ్యడం మానేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని తనకు అందులో ఉన్న తీవ్రత ను తెలపడం కోసం మోకాళ్ళు వెయ్యమని శిక్ష వేసాను. కొంచెం సేపు బాగానే వేసి ఉన్నాడు కానీ నా మనస్సు లో చాలా బాధగా ఉంది. అయ్యో కొడుకు ఇబ్బంది పడుతున్నాడని మనస్సు నొచ్చుకుంది. కానీ కటినంగా ఉండక పోతే కొన్ని విషయాలు పిల్లలకు నేర్పలేము. ఇంతలో నా కూతురు, బార్య, చెల్లి వచ్చి తనను వదిలేమని చెప్పారు. వాళ్లకు వాడిని నన్ను అడిగితే, మరల తప్పు చెయ్యను అని చెపితే వదిలేస్తాను అని చెప్పాను. వీళ్ళు వెళ్లి చెప్పారు. వాళ్ళు బాధపడుతున్నారు. నేను బాధ పడుతున్నాను. నా కొడుకు బాధ పడుతున్నాడు. వాడు అడుగుతాడు అని నా కొడుకు చుట్టూనే తిరుగుతున్నాను. కానీ వాడికి నన్ను అడగటానికి భయం, ఎలా అడగాలి అనె భయం. అడిగితే వదులుధమని నా ఆశ. ఈలోపు ఎప్పుడు కొట్టుకునే తన అక్క వాడి కోసం ఏడుస్తుంది. వాడికి అర్థం అయ్యింది, అక్కకు తను ఎంత ఇష్టమో, వాడికి బదులు తను మోకాళ్ళు వెయ్యడానికి సిద్ధం అయ్యింది. కొంచెం సేపటికి తను మెల్లగా డాడీ నీ మాట వింటాను అని చెప్పగానే నా కళ్ళల్లో నీళ్ళు, తనను కౌగలించుకున్నాను. అందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వాడికి ఇష్టమయిన వస్తువు వెంటనే అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను.

మన దేవుడు ఇంతకన్నా ప్రేమమయుడు, ఆయన మనలను శిక్షించి, మన పశ్చాతాపం తో చేసే ప్రార్ధన కోసం ఎదురు చూస్తుంటాడు. ( కీర్త 103:13 ) మనలను పాడు చెయ్యాలని కాదు గానీ మనలను బాగు చెయ్యాలని తన ఆశీర్వాదమునకు వారసులను చెయ్యాలని తన తపన. అందుకే ఒక పాపి తన పాపంలో మరనించుట తనకు ఇష్టం లేదు అని, ఒక పాపి రక్షింప బడితే పరలోకం లో దేవతలు ఆనందిస్తారని, ప్రభువు శిక్షించు నరుడు ధన్యుడు అని వాక్యం చెపుతుంది.  ( యెహే 18:30-32, లూకా 15:10, యోబు 5:17,18 )

 

మానవునికి ధాన్యపు గింజ నేర్పే బోధ

 

 


మన్నైన మానవ శరీరం మరల మట్టి కి మారుతుంది. మానవుడు మట్టి నుండి చెయ్యబడ్డాడు కాబట్టి మరల మన్నుకు మారుతున్నాడు. ఇది సత్యం. అయితే పుట్టిన నాటి నుండి మరణించే వరకు మానవునికి కొంత ఆయుష్షు దేవుడు ఇస్తున్నాడు. కొంత మందికి దీర్గ ఆయుష్షు, కొంత మందికి అల్ప అయుస్శును ఇస్తారు. కాని ప్రతి మనిషి ఈ భూమి మీద నిర్వర్తించవలసిన కర్తవ్యం ఒకటి ఉంటుంది. అది పూర్తి చేస్తున్నామా ? అసలు నీ జన్మకు సార్ధకత ఉందా?

 

రైతు పండించే ప్రతి ధాన్యపు గింజ మట్టినుండి పుట్టి మరల మట్టికే చేరుతుంది. కాని అది పుట్టిన నాటి నుండి మట్టికి చేరే లోపు రైతుకు ఆదాయం, ప్రతి మనిషికి ఆహారం, ఆరోగ్యం, వ్యాపార వేత్తకు లాబాన్ని, ఇలా చెప్పుకు పోతే అది మరల మన్నుకు చేరే సరికి ఎన్నో రూపాలలో సమస్త మానవాళికి ఉపయోగపడి తిరిగి మన్నుకు చేరుతుంది. ఆహారం గా మారిన ధాన్యం శరీరం లో ఆరోగ్యానికి అవసరమయిన రక్తాన్ని, ప్రోటిన్స్ ఇంకా అందించి కరిగి మలినమై మట్టికి చేరుతుంది. కొంత ధాన్యం మరల పురుత్పత్తి చేసి మరింత ధాన్యం కొరకు విత్తనం గా మారుతుంది. అల్ప ఆయుష్షు ఉన్న ధాన్యం పక్షులకు ఆహరం గా మారుతుంది, కొంత ధాన్యం చేలోనే రాలి మరల పెరిగి పశువులకు ఆహారం అవుతుంది.

 

అయితే మానవునిగా పుట్టిన నీవు మరనించే లోపు ఎంత మందికి ఉపయోగ కరంగా ఉన్నావు, నీ వలన దేవుని ఉద్దేశ్యం నెరవేరిందా? నీ ఆయుష్షు ఎంతో నీకు తెలియదు కదా మరి ఎందుకు సమయాన్ని పాడు చేస్తూ రేపు రేపు చేద్దాం అని వాయదాలు వేస్తావు. నీ జన్మ కు సార్ధకత చేసుకో....... సమయాన్ని వృద్ధా పరచకు.....

 

దేవుడు నిన్ను ప్రయోజన కరునిగా మార్చును గాక....

 

మీ సహోదరుడు

అపోస్తులు నెల్లి నాని బాబు