కోపం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కోపం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

దేవుని అద్భుతం

 



ఒకసారి ఒక వృద్ధుడు దేవుడు తనకు ఇచ్చిన పిలుపు, బారాన్ని బట్టి రైలు లో సువార్త ప్రకటిస్తున్నారు. ప్రతి కంపార్ట్మెంట్ లోకి వెళ్లి నిలువబడి యేసు రక్షకుడు, మన పాపముల కొరకు చనిపోయి, తిరిగి లేచారు, ఆయన మరల వస్తున్నారు, మారుమనస్సు పొందండిఅంటూ గట్టిగ అరుస్తూ చెపుతున్నాడు. ఇంతలో అక్కడ ఉన ఒకావిడ అతని మీద కేకలు వేస్తూ, నోరుమూయి, నీ చెప్పే యేసు అసలు లేరు అని గట్టిగ అరిచింది. ఆ ముసలాయన ఏమి చెయ్యలేని పరిస్థితిలో, భయపడి కూర్చుండి పోయాడు.

 

గానీ దేవుడు తనను బలవంతం చేస్తున్నారు, సువార్త ప్రకటించడం అపవద్దు అని. దేవునికి భయపడి, లోబడి మరల నిలువబడి వాక్యం ప్రకటించడం మొదలు పెట్టాడు. మరల ఆ స్త్రీ తనమీద కోపం తో విరుచుకు పడి, దాడి చెయ్యడం మొదలు పెట్టింది. ఇంతలో తనకుడ కూడా వచ్చిన తన కుమారుడు గట్టిగా అమ్మ, తనను ఏమీ చెయ్యొద్దు, అతను దేవుని చేత పంపబడిన వాడుఅని చెప్పాడు అంట.

వెంటనే ఆ స్త్రీ మోకాళ్ళ మీద పడి ఏడ్వడం మొదలు పెట్టింది. రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ, తన పాపాలను ఒప్పుకుంటూ, యేసు ను అంగీకరించడం మొదలు పెట్టింది.

ఆ వృద్ధుడు ఏమైదీ  అని అడిగితే, “ నా కుమారుడు పుట్టి మూగవాడుఅని ఏడ్చింది.

 

 ప్రియ చదువరి, యేసు నీ జీవితం లో అనేక అద్భుతాలు చేస్తూనే ఉన్నారు గానీ నీ మనసును ప్రభువుకు ఇవ్వలేక పోతున్నావు. ఆయన మరల రాబోతున్నారు, మారుమనస్సు పొంది రక్షణ పొందు. సమయం వుండగానే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు.

ప్రభువు మిమ్మును దీవించి, అంగీకరించును గాక!

 


అన్నీ పట్టించుకోకండి



క్రోధం మనిషిని అవివేకి గా మార్చివేస్తుంది

అన్నీ పట్టించుకోకండి

ఒక పాము వడ్రంగి దుకాణంలో లోకి దూరి, అక్కడ వున్న రంపం పై నుండి ప్రాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది. వెంటనే పాము కోపముతో రంపమును గట్టిగా కరిచింది. ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది. పాముకు అసలేమి జరుగుతుందో తెలియక, రంపం తనపై ఎదురు దాడి చేస్తోందనుకుని వెంటనే రంపమును గట్టిగా చుట్టుకుని, తన బలమంతా వుపయోగించి, రంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపివేయాలని నిర్ణయించుకొని, చివరికి తన ప్రాణం మీదకే తెచ్చుకొంది మనము కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా, ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై యిలానే స్పందించి, చివరకు మనమే ఆపదలకు గురి అవుతాము. అవతలి వ్యక్తికి అసలు జరిగినదానికి సంబంధం లేదని తెలుసుకొనే లోపు, జరగవలసిన నష్టం జరుగుతుంది. జీవితంలో ప్రశాంతంగా వుండలంటే కొన్నిసార్లు అనవసరమైన కొన్ని పరిస్థితుల్ని మనుషులను, వారి ప్రవర్తనను, వారి మాటలు అసూయలను మరియు ద్వేషాలను పట్టించుకోకుండా చేయవలసి వుంటుంది. కొన్నిసార్లు అసలు ప్రతిస్పందించకపోవడమే మంచిది..

సామెతలు 14: 17
త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. 


సామెతలు 16: 18
నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును

సామెతలు 17: 14
కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు

సామెతలు 11: 27
మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడుచేయ గోరువానికి కీడే మూడును.