అంత్య తీర్పు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అంత్య తీర్పు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఎరైజర్ నుండి పాఠం

 



నిన్నటి దినాన నా కుమార్తె బొమ్మలు గీస్తూ ఉంది. అయితే తనకు నేను కొత్త ఎరైజర్ కొని ఇచ్చాను కానీ ఇప్పుడు చాలా చిన్నగా అయిపోయింది. మామూలు విషయమే కదా అని వదిలేసాను. కానీ దేవుడు అదే విషయాన్ని పదే పదె గుర్తు చేస్తూ వచ్చారు. ఇరోజటికి దేవుడు ఎదో చెప్ప బోతున్నారు అని గ్రహించి, ధ్యానించడం, ఆలోసించడం , ప్రార్థన చెయ్యడం మొదలు పెట్టాను.

అప్పుడు తండ్రి నా మనస్సు లో ఒక సాదృష్యాన్ని దానికి అన్వహించమన్నరు.

 

ఏరైజర్ ( పెన్సిల్ వ్రాతలను చేరుపునది ) ఎపుడెప్పుడు వాడతారు? ముఖ్యంగా పిల్లలు తప్పులు వ్రాసినప్పుడు వాటిని చెరిపి మరల ప్రయతించ డానికి ఉపయోగిస్తారు. వాళ్ళు తప్పులు చెరపడానికి ఉపయోగించిన ప్రతిసారీ ఎరైజర్ రా తప్పును చేరుపుతు అరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులకు అంది పూర్తిగా అరిగిపోతుంది.

 

ఇక్కడ నమ్మకం ఒక ఎరైజర్ అయితే నీవు చేసే తప్పులు క్షమించేటప్పుడు అధి అరిగిపోతుంది. కొంత కాలానికి నీ తప్పులు సరిదిద్దు కోవడానికి ఎదుటవానిలోని నమ్మకం పూర్తిగా కోలిపోతావు.

నమ్మకం ఉంచుతున్నారు కదా అని కావాలని పొరపాట్లు చెయ్యకు, ఒకరోజు అనాధగా మిగిలిపోతారు.

 

యేసు వారు నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చెయ్యబడి, తిరిగి లేచి మనలను క్షమించి దేవుని రాజ్యానికి వారసుడని చేశారు. మరలా తిరిగి పాపం చెయ్యకు, మరణమే గతి.

 

( హెబ్రి 10: 26,27 )

 

ప్రభువు మిమ్మును మీ విశ్వాసమును బట్టి దీవించును గాక!

 

అపొస్తులు నాని బాబు నెల్లి,

రేమిడిసివర్ ఇంజక్షన్



ప్రస్తుతం బాగా వినపడుతున్న మాట రిమిడిసేవిర్. కొవిడ్ వచ్చిన వారికి ఇచ్చే ఇంజక్షన్. ఇధి ఒకోసారి లక్షలలో పలుకుతుంది. ఎందుకంటే అది లోపల ఉన్న వైరస్ పెరగకుండా ఆపుతుంది. అయితే కొన్ని కేసులలో ఆ ఇంజిక్షన్ ఇచ్చినా చనిపోతున్నారు. కారణం ఏమిటి అంటే వైరస్ వంటి నిండా వ్యాప్తి చెందిన తరువాత దానిని వాడుతున్నారు. దానిని వైరస్ సోకిన వెంటనే ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దాని పని సక్రమంగా చెయ్యగలిగుతుంది.

అలాగే, చాలా మంది చనిపోయిన వారి పేరున దాన ధర్మాలు చేస్తారు. మనిషి చనిపోయిన తరువాత ఆ వ్యక్తి పేరున ఏమి చేసినా తనకు ప్రతిఫలం దక్కదు. కానీ అది చేసే వ్యక్తి అకౌంట్ లో ఉంటాయి. ఒకటి అలోసించండి,  ప్రతి మనిషి చనిపోతాడు, చనిపోయిన తరువాత పరలోకం వెళ్తాడు, తీర్పు ఉంటుంది. అక్కడ దేవుడు బహుమానాలు ఇస్తారు. కానీ అవి ఎవరికి, ఎలా ఇస్తారు, భూమి మీద ఒక మనిషి చేసిన క్రియలను ఆధారం చేసుకుని ఇస్తారు. అంటే మనం రేమిడిసిర్ ఇంజక్షన్ వాడినట్లే. కాబట్టి బ్రతికి వుండగానే నీవు సంపాదించిన దాంట్లో కొంత అయిన అవసరతలో ఉన్నవాడికి దానం చెయ్యండి.   నీవు చనిపోయాక నీ కొడుకు ఎంత దానం చేసిన నీకు ప్రయోజనం ఉండదు. నీవు చేసి నీ జాబితాలో వేసుకో…. ఇక్కడ ధనాన్ని పరలోక ధనం గా మార్చుకోడానికి ఇదే మంచి సమయం. వదులుకోకుండా వాడుకో….

2కోరింథీయులకు 5: 10
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.

విదేశీ ప్రయాణం - పరమ ప్రయాణం

 




మా సంగములొ చాలా మంది విస్వాసులు విదేశాలలో ఉన్నారు. వారి కొరకు అనుధినము ప్రార్ధన చేస్తూ ఉంటాము. అయితే వాళ్లు ఇక్కడ నుండి వెళ్లేటప్పుడు ప్రార్ధన సహకారం అడుగుతూ ఉంటారు, పాస్పోర్ట్ త్వరగా రావాలని, మెడికల్ లో పాస్ అవ్వాలని, ఇమిగ్రేషన్ అవ్వాలని, టికెట్ ధొరకాలని ఇలా... ఇవన్నీ ఎందుకు వేరే దేశం లోనికి ప్రవెసించడానికి కావలసిన అర్హతలు. పాస్పోర్ట్ తీసుకోవడానికి కేసులు ఉండకూడదు - అంటె మంచి స్వభావం ఉండాలి, రెండవది కనీస చదువు ఉండాలి, స్థిర నివాసం కలిగి ఉండాలి. ఎ లోపం లేని మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి.   ఒక రెండు సంవత్సరాలు ఉండే దానికే ఇంత జాగ్రత్త లు తీసుకుంటే చిరకాలం ఉండే పరలోకానికి అనుమతి ఇవ్వడానికి దేవుడు ఇంకెన్ని జాగ్రత లు తీసుకుంటారు. నీ శరీర ఆరోగ్యం ఆయన పట్టించుకోరు గాని, నీ స్వభావాన్ని, గుణాన్ని, నీ హృదయ స్థితి, విశ్వాసం లో స్థిరత్వమును కచ్చితంగా చూస్తారు. 

2కోరింథీయులకు 5: 10

ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.


మీ సహోదరుడు 

అపొస్తులు నాని బాబు నెల్లి


మరణం తరువాత మనతో ఏమీ వస్తుందో తెలుసా?






అందరం అనుకుంటూ ఉంటాం మనం ఎంత సంపాదించినా చనిపోయాక అన్నింటిని వదిలి వెళ్లిపోవాలి అని. అందుకు ఎందుకు సంపాదించుకోవడం అనుకుని నిరాశ పడుతుంటాం. కాని వాక్యం చెపుతున్నది ఏంటి అంటే. నిన్ను ఇలోకం లో ఉన్నవాటిని సంపాదించు కోవద్దు అని ఏనాడూ చెప్పలేదు. భాగ్యం సంపాదించు కొనుటకై మీకు సామార్ధ్యము కలుగ జేయువాడు ఆయనే ( ద్వితి 8:18 ) అని వాక్యం చెపుతుంది. ఇలోకం లో మనలను ధనవంతులుగా చూడాలని మన తండ్రి కోరిక. అయితే మరో మాటలో " మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు ( మత్తయి 6:24 ) " అని, ఇదియు గాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దురుట సులభమని మీతో చెప్పుచున్నాను ( మత్తయి 19:24 ) అని ధనముకు వ్యతిరేకముగా మాట్లాడినట్లు మనకు కనపడుతుంది. భాగ్యం ఇచ్చి పరలోకానికి దూరం చెయ్యడం దేవుని ప్రణాలికా? ఇక్కడ బాగా అర్ధం చేసుకోగలిగితే నీకు భాగ్యం యిస్తారు అయన కాని నీవు దానికి బానిసావు కాకుండా అదే నీకు భానిసగా ఉండాలి అని అయన ఉద్దేశ్యం. ఒకవేళ నీవే దానికి బానిసవు అయితే నీవు పరలోకానికి వెళ్ళలేవు అని అయన హెచ్చరిక. ఎలా? చనిపోయినప్పుడు ఇదేమి రాదు కాదా అనుకుంటున్నాము మనం. కాని దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం తో నీవు ఏమేమి చేసావో అవన్నీ, నీ క్రియలు నీ వెంట వస్తాయి అని వాక్యం చెప్పుతుంది.( ప్రకటన 14:13 ). ఉదాహరనకు ఫోన్ కొనుకోడానికి దేవుడు సమార్ధ్యాన్ని ఇచ్చారు, నీవు చని పోయాక ఫోన్ ఇక్కడే ఉండిపోతుంది, కాని ఫోన్ తో నీవేమి చేసావో అది వస్తుంది. అందుకే జాగ్రత్త నిధగ్గరకు ధనం వచ్చినప్పుడు దాన్ని నీ బానిసగా చేసుకో, అది చేయ్యమన్నట్టు నీవు చెయ్యకు.

ప్రభువు నీకు విస్తారమైన ధన సమృద్ధిని అనుగ్రహించును గాక!

మీ సహోదరుడు

అపోస్తులు నాని బాబు నెల్లి