మన్నైన మానవ శరీరం మరల మట్టి కి మారుతుంది. మానవుడు మట్టి నుండి చెయ్యబడ్డాడు కాబట్టి మరల మన్నుకు మారుతున్నాడు. ఇది సత్యం. అయితే పుట్టిన నాటి నుండి మరణించే వరకు మానవునికి కొంత ఆయుష్షు దేవుడు ఇస్తున్నాడు. కొంత మందికి దీర్గ ఆయుష్షు, కొంత మందికి అల్ప అయుస్శును ఇస్తారు. కాని ప్రతి మనిషి ఈ భూమి మీద నిర్వర్తించవలసిన కర్తవ్యం ఒకటి ఉంటుంది. అది పూర్తి చేస్తున్నామా ? అసలు నీ జన్మకు సార్ధకత ఉందా?
రైతు పండించే ప్రతి ధాన్యపు గింజ మట్టినుండి పుట్టి మరల మట్టికే చేరుతుంది. కాని అది పుట్టిన నాటి నుండి మట్టికి చేరే లోపు రైతుకు ఆదాయం, ప్రతి మనిషికి ఆహారం, ఆరోగ్యం, వ్యాపార వేత్తకు లాబాన్ని, ఇలా చెప్పుకు పోతే అది మరల మన్నుకు చేరే సరికి ఎన్నో రూపాలలో సమస్త మానవాళికి ఉపయోగపడి తిరిగి మన్నుకు చేరుతుంది. ఆహారం గా మారిన ధాన్యం శరీరం లో ఆరోగ్యానికి అవసరమయిన రక్తాన్ని, ప్రోటిన్స్ ఇంకా అందించి కరిగి మలినమై మట్టికి చేరుతుంది. కొంత ధాన్యం మరల పురుత్పత్తి చేసి మరింత ధాన్యం కొరకు విత్తనం గా మారుతుంది. అల్ప ఆయుష్షు ఉన్న ధాన్యం పక్షులకు ఆహరం గా మారుతుంది, కొంత ధాన్యం చేలోనే రాలి మరల పెరిగి పశువులకు ఆహారం అవుతుంది.
అయితే మానవునిగా పుట్టిన నీవు మరనించే లోపు ఎంత మందికి ఉపయోగ కరంగా ఉన్నావు, నీ వలన దేవుని ఉద్దేశ్యం నెరవేరిందా? నీ ఆయుష్షు ఎంతో నీకు తెలియదు కదా మరి ఎందుకు సమయాన్ని పాడు చేస్తూ రేపు రేపు చేద్దాం అని వాయదాలు వేస్తావు. నీ జన్మ కు సార్ధకత చేసుకో....... సమయాన్ని వృద్ధా పరచకు.....
దేవుడు నిన్ను ప్రయోజన కరునిగా మార్చును గాక....
మీ సహోదరుడు
అపోస్తులు నెల్లి నాని బాబు