రేమిడిసివర్ ఇంజక్షన్



ప్రస్తుతం బాగా వినపడుతున్న మాట రిమిడిసేవిర్. కొవిడ్ వచ్చిన వారికి ఇచ్చే ఇంజక్షన్. ఇధి ఒకోసారి లక్షలలో పలుకుతుంది. ఎందుకంటే అది లోపల ఉన్న వైరస్ పెరగకుండా ఆపుతుంది. అయితే కొన్ని కేసులలో ఆ ఇంజిక్షన్ ఇచ్చినా చనిపోతున్నారు. కారణం ఏమిటి అంటే వైరస్ వంటి నిండా వ్యాప్తి చెందిన తరువాత దానిని వాడుతున్నారు. దానిని వైరస్ సోకిన వెంటనే ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దాని పని సక్రమంగా చెయ్యగలిగుతుంది.

అలాగే, చాలా మంది చనిపోయిన వారి పేరున దాన ధర్మాలు చేస్తారు. మనిషి చనిపోయిన తరువాత ఆ వ్యక్తి పేరున ఏమి చేసినా తనకు ప్రతిఫలం దక్కదు. కానీ అది చేసే వ్యక్తి అకౌంట్ లో ఉంటాయి. ఒకటి అలోసించండి,  ప్రతి మనిషి చనిపోతాడు, చనిపోయిన తరువాత పరలోకం వెళ్తాడు, తీర్పు ఉంటుంది. అక్కడ దేవుడు బహుమానాలు ఇస్తారు. కానీ అవి ఎవరికి, ఎలా ఇస్తారు, భూమి మీద ఒక మనిషి చేసిన క్రియలను ఆధారం చేసుకుని ఇస్తారు. అంటే మనం రేమిడిసిర్ ఇంజక్షన్ వాడినట్లే. కాబట్టి బ్రతికి వుండగానే నీవు సంపాదించిన దాంట్లో కొంత అయిన అవసరతలో ఉన్నవాడికి దానం చెయ్యండి.   నీవు చనిపోయాక నీ కొడుకు ఎంత దానం చేసిన నీకు ప్రయోజనం ఉండదు. నీవు చేసి నీ జాబితాలో వేసుకో…. ఇక్కడ ధనాన్ని పరలోక ధనం గా మార్చుకోడానికి ఇదే మంచి సమయం. వదులుకోకుండా వాడుకో….

2కోరింథీయులకు 5: 10
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.

కామెంట్‌లు లేవు: