జీవ క్రైస్తవ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జీవ క్రైస్తవ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

లోక మాటలు క్రైస్తవునికి పట్టవు

 

లోక మాటలు క్రైస్తవునికి పట్టవు

చాల పర్యాయాలు స్నేహితులు, బంధువులు ఇచ్చిన సలహాలను మనం పాటించాము, వాటిని అనుసరించి నడవలేము. వారు కోపపడి మేము చెప్పేది అర్ధం కావడం లేదా? అని మనకు విసుకు పుట్టిస్తూ ఉంటారు. వాళ్లకు బయపడి క్రైస్తవులు లోక రీతిలో జీవిస్తుంటారు. అయితే దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చారు. ఒకసారి నేను కార్యక్రమమును నడిపిస్తుండగా కరెంటు పోయింది. మందిరం లో నేను కార్యక్రమమును నడిపిస్తుండగా బయట నుండి చీకటిలో యోవనస్తులు జెనరేటర్ ను సిద్ధం చేస్తూ సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్న యోవనస్తునికి ఏదో సంజ్ఞలు చేస్తున్నారు. కాని తనకు కనపడటం లేదు అందువలన అర్ధం కావడం లేదు. అప్పుడే దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చారు. దేవుడు మనలను వెలుగు సంబందులుగా చేసాడు. చీకటి లో ఉన్న వారి ఆలోచనలు, మాటలు, విషయాలు మనకు అర్ధం కావు. ఒకవేళ మనకు అర్ధం కావాలంటే వారు వెలుగు లోనికి రావలసి ఉంటుంది. దేవునిలోకి వచ్చిన మనలను లోక తలంపులు, లోక విధానాలు అర్ధం కావు, మనలను మార్చలేవు. మనం చికటి లోనికి పడిపోకుండా జాగ్రత్త పడుధము.

 

వెలుగై ఉన్న మన దేవుని కృప మీకు తోడై ఉండును గాక!

 

మీ సహోదరుడు

అపోస్తులు నెల్లి నాని బాబు 

ఇస్త్రీ చేసేటప్పుడు

  




ప్రతి రోజు నా బట్టలు నేను ఇస్త్రీ చేసుకోవడం నాకు అలవాటు. నిన్న సాయంత్రం బయటకు వెళ్ళాలి అని బట్టలు ఇస్త్రీ చేసుకునే బల్ల మీద వేసి, ఇస్త్రీ పెట్టి యొక్క ప్లగ్ పెట్టీ, వెడెక్కే లోపు మంచి నీళ్లు తాగి వద్దామని పక్కనే ఉన్న వంట గదిలోకి వెళ్ళాను. నీళ్ళు తాగి వచ్చి ఇస్త్రీ చేస్తుంటే చొక్కాయి ఇస్త్రీ అవ్వడం లేదు, ఎంటా అని చూస్తే ఇస్త్రీ పెట్టీ వెడెక్క లేదు. అయ్యో ఇస్త్రీ పెట్టీ పోయింది అని బాధపడుతూ, స్విచ్ వెయ్యలేదేమో అని అనుమానం వచ్చి స్విచ్ చూస్తే బాగానే ఉంది. చాలా సేపు బాధపడ్డాను, ఇస్త్రీ పెట్టీ పాడైపొయ్యింది, ఇప్పుడు బట్టలు ఇస్త్రీ ఎలా అని. ఎందుకో అసలు ప్లగ్ సరిగా పెట్టానో లేదో అని చూసాను అప్పుడు అర్ధం అయ్యింది. ప్లగ్ సరిగానే పెట్టాను, స్విచ్ వేసాను కానీ నిన్ను పెట్టిన ప్లగ్ ఇస్త్రీ పెట్టిధి కాదు ప్రక్కన ఉన్న వేరే వస్తువుది అని. మరి ఇలా అయితే ఇస్త్రీ పెట్టీ ఎందుకు, ఎలా పని చేస్తుంది?

క్రైస్తవుడు కూడా తన జీవితాన్ని లోకానికి, లోక నటనకు, లోక సంప్రదాయాలు, అలవాట్లకు అప్పగించి, దేవునికి దూరంగా ఉంటూ, దగ్గరగా ఉన్నాము అనే బ్రమలో ఉంటూ, నా జీవితం మారడం లేదు, దేవుడు నన్ను దీవించడం లేదు అని బాధ పడితే ప్రయోజనం ఏమిటి?. నీ జీవితం దేవునితో లేదు! నీ అలవాట్లు దేవునికి ఇష్ట మయినవి కాదు! నీ జీవితాన్ని దేవునికి అనుసంధానం చెయ్యి అప్పుడు నిజ దీవెన నీలో ఫలిస్తుంది.

ప్లగ్ ఒక దానిది పెట్టీ వేరొకటి పనిచేయలనీ కొరువడం ఎంత మూర్ఖత్వమే, నీ జీవితం దేవునికి ఇవ్వకుండా దేవుడు దీవించడం లేదని అనడం కూడా అంతే…


మత్తయి 15:6-10

ప్రభువు మిమ్మును మీ విశ్వాస జీవితాన్ని బట్టి దీవించి ఆశీర్వదించును గాక!

అపొస్తులలు నాని బాబు నెల్లి

9908823196


దీప స్తంభం

 




ఒక వేసవి కాలములో పిల్లలకు సెలవు రోజుల్లో, మేము మా పిల్లలతో అంతర్వేది బీచ్ కు వెళ్ళాము. అక్కడ ఒక లైట్ హౌస్ ఉంది. దానిని చూడటానికి వెళ్ళాము, పిల్లలు దాని గురించి చెప్పండి నాన్న అని అడిగారు. అప్పుడు దాని గురించి చెప్పడం మొదలు పెట్టాను. సముద్రం లో ప్రయాణం చేసే ఓడలుకి, చేపల వేటకు వెళ్లే మత్యకారులకు ఒడ్డుకు చేరడానికి ఒక దిక్షుచి అని చెప్పాను. ఎందుకలా వాళ్లకు తెలియదా? అన్నారు. సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు సముద్ర తీరం కణపడదు, అలాంటప్పుడు ఈ దీపం వెలుగు వారికి తీరం ఎటువైపు ఉందో చూపిస్తుంది అని చెప్పాను. నిజమే కదా, సువిశాలమైన సముద్రం లో ఓడలు, పడవలు, నావలు ఒడ్డుకు నడిపించే దీపం, వెలుగు తీరాన్ని ఉండాలి. అప్పుడే తీరానికి చెరగలరు.

అలాగే యేసు వారు మనకు దీపం, వెలుగై ఉండి, మనకంటే ముందుగా లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించి, తీరానికి చేరి మనకు మార్గాన్ని చూపిస్తున్నారు. ఈ జీవన సముద్రం లో మన జీవిత పడవ ప్రయాణం వెలుగై, దీప స్తంభం అయ్యి ఉన్న యేసు వైపు చూస్తూ నడిస్తే మనం కూడా యేసు వారి వలె పాపం, మరణం, లోకం జయించ గలము. నిత్య తీరమయిన పరముకు చెరగలం. మరణమును, నరకనును తప్పించు కొగలము.

ప్రభువు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక!


పెస్బుక్ లో ప్రెండ్ ని తొలగించుట? మనకు ఒక పాటం...


ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం సమాజం మీద చాలా ఉంది. సోషల్ మీడీయా అనగానే ఫేస్బుక్ గుర్తుకువస్తుంది. ఇందులో అకౌంట్ లేని వారు ఇంచుమించు ఉండరు. కాని దానిని వాడటం లో కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎధుర్కుంటారు. ధాని వల్ల కొంత మంది అకౌంట్స్ లో జంక్ ప్రెండ్స్ ఎక్కువ ఉంటారు. అంటే... ఒక వ్యక్తీ ఎక్కువ అకౌంట్స్ థిసుకుని మనకు రిక్వెస్ట్ పెట్టి ధానిని మనం అంగీకరించిన తరువాత మరల మరొ అకౌంట్ తిసుకుని మరల రిక్వెస్ట్  పెట్టడం అలా ఎక్కువ సార్లు చెయ్యడం వలన మన అకౌంట్ లో మనుగడలో లేని ఫ్రెండ్స్ అకౌంట్ లు ఎక్కువ గా ఉంటాయి. అయిథె నాకు ఒక అలావటు ఉంది. ప్రతి రోజు పుట్టిన రోజు ల నోటిఫికేషన్ వస్తుంధి. అప్పుడు ప్రతి ఒక్కరి అకౌంట్ లో ప్రొఫైల్ చూస్తాను. ఒకవేళ ఆ వ్యక్తి కొన్ని నెలలుగా ఆ అకౌంట్ లో ఆక్టివ్ గా లేక పోతే, అంటె ఎవిధయిన పోస్ట్ లేకపోతే ఆ వ్యక్తిని నా ప్రెండ్ లిస్ట్ నుండి తీసేస్తాను. చాల మంది కొన్ని సంవత్సరాలుగా ఒక్క పోస్ట్ కూడా పెట్టారు. అంటే అప్పుడప్పుడన్న ఒక పొస్ట్ పెడతా వుంటే ఆ వ్యక్తి ఆ అకౌంట్ ని వాడుతున్నట్టు. 

అలాగే మన దేవుడు మనం ఏదైన అడిగినప్పుడు, మనం ఏదైన ప్రభువు దగ్గర ఆశించినప్పుడు మన గతాన్ని చూస్తారు. అందులొ నీవు ఏదైన చేసినట్లు ఉంటె నీవు జివించుచున్న క్రైస్తవుడవు. ఒకవేళ ఆయన నీ గతాన్ని చూసినప్పుడు నీవు చలించుచున్నట్టు కనిపింఛక పోతే నిన్ను మృత క్రైస్తవ జాబితాలో వేస్తాడు. 

మరి దేవునికొరకు ఈ మధ్య కాలంలొ ఏదైన చెసావా... గుర్తు వచ్చినప్పుడు చెయ్యడం, గుర్తు వచినప్పుడు మందిరానికి వేల్లడం.... ఆపద వచ్చినప్పుడు మొర్ర పెట్టడం... జీవ క్రైస్ఠవ్యం కాదు.... ఎలాంటి పరిస్థితి అయిన క్రైస్తవ జీవితాన్ని, పరిశుద్ద జీవితాన్ని జీవించాలి. 

లూకా 13: 6 -9