ఒక సహోదరుడు తన కష్టార్జితాన్ని వ్యయపరచి మందిరం కొరకు ఒక జనరేటర్
కొన్నాడు. అది కొన్నప్ప్పుడు చాలా మంది వెనకకు లాగాలని ప్రయత్నించారు. కొంతమంది
పాస్టర్ గారికే ఇస్తున్నవా? అది పాస్టర్ వాడుకుంటాడు అని చాల విధాలుగా నిధించడం,
డబ్బులు చెల్లడం లేదా? అని తిట్టడం
చేసారు. కాని ఆ యోవనస్తుడు మాత్రం వెనకకు
తిరగలేదు, నేను దేవునికి ఇవ్వాలనుకున్న, ఇస్తాను, దానిని క్రొత్త మందిరం దగ్గర పెట్టడానికి సరియయిన
వసతులు లేక సేవకుని ఇంటిదగ్గర పాత మందిరం ఆఫీస్ దగ్గరే ఉంచి వాడుతున్నారు. అది
సేవకుడు వాడుకున్న నాకు సంతోషమే, సేవకుడు దేవుని ప్రతినిధి అని సమర్దించుకుని విశ్వాసంతో
ఉండేవాడు. తను జెనరేటర్ కొన్న 628 రోజులకు దేవుడు తన జీవితంలో ఒక
గొప్ప కార్యం చేసారు. తన కంటే ధనవంతులు, అధికులు పొటి పడినా, వారికి లేని ఒక గొప్ప అవకాసం ప్రభువు ఇచ్చారు. తాను సొంతంగా ఒక కొత్త
క్రేన్ కొనుకోడానికి అందరికంటే ముందు దానిని పొందడానికి ప్రభువు మార్గాన్ని సుగమం
చేసారు. తన స్నేహితులకంటే, బంధువుల కంటే, దేవునికి ఇచ్చేటప్పుడు హేళన చేసిన వారికంటే ఉన్నత స్థితిని ప్రభువు
తనకు ఇచ్చారని ప్రభువును స్తుతించాడు సహోదరుడు. అపోస్తులుడు అయిన పౌలు తిమోతి తో
అంటాడు, దేవుడు వెక్కిరింప బడడు, మషుడు ఏమివిత్తునో అదే పంట కోయును. సహోదరుడు విత్తిన విత్తనం మొలకెత్తి,
ఫలించి తను పెట్టిన ఖర్చుకు 45 రెట్లు
ప్రతిఫలాన్ని ప్రభువు ఇచ్చారు. ఈరోజు నేను కూడా అల దీవింప బడాలని ఆశా ఉంటె తనవలె
దేవుని కోసరం, దేవుని పని కోసం సణుగుడు లేకుండా, బలవంతం కాకుండా విత్తడం నేర్చుకో, విత్తని
వానికి పంట కోసే హక్కు లేదు. ప్రభువు నిన్ను దివించును గాక? దేవుడు ఉత్సాహముగా
ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో సర్వసమృద్ధి గల
వారై ఉత్తమమయిన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను
విస్తరింప చేయగలడు; 2 కొరింది 9:7, 8
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు