దేవుడు నిన్ను ఏమైనా ఇమ్మన్నడా? అయితే అయితే ఆలస్యం చెయ్యకు
ఎందుకో తెలుసా అందులో దేవుడు నీకు ఏదో మేలు దాచి పెట్టి ఉంటాడు. ఇమ్మన్న దేవుడు
ఇచ్చుటకు శక్తీ ని ఇస్తాడు అయితే ఆ అవకాశాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తావా? నీ కోసం ఉపయోగించుకుంటావా? ఉదాహరణకు అబ్రహమును జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన
ఏకైక కుమారున్ని , ముసలి తనంలో పుట్టిన
కుమారున్ని ఆయనకు బలిగా ఇమ్మన్నాడు. అయితే అబ్రహాము ఏమి అలోసించలేదు . నేను
ముసలివాడను నాకు మరల పిల్లలు పుడతారా? దేవునికి ఇచ్చేస్తే
మరల నాకు పిల్లలు ఇస్తాడా దేవుడు? ఇలా ఏవిధమైన ఆలోచనలు
చెయ్యలేదు వెంటనే కట్టెలు కొట్టుకున్నాడు, గాడిదలను సిద్ధ
పరచుకున్నాడు, కుమారున్ని తీసుకుని బయలు దేరాడు. మోరియ
పర్వతం ఎక్కారు, బలిపీఠం సిద్ధం చేసాడు, కుమారున్ని చేతులు కాళ్ళు కట్టాడు, బలిపీఠం
మీద పరుండ బెట్టాడు, కత్తి తిసి పొడవబోయాడు..... అంతవరకు
దేవుడు ఒక్క మాట మాట్లాడలేదు, అబ్రహాము బలి ఇవ్వడం తప్ప
ఏవిధమైన ఆలోచన చెయ్యలేదు . అబ్రహాము హృదయం విశ్వాసపు అలలతో నిండి పోయి
ఉంటుంది. కత్తి ఎత్తిన అబ్రహాము చెయ్యిని ఆఖరి క్షణంలో పట్టుకున్నాడు... నీకు నేనంటే భయం అని నాకు
తెలిసింది. నీ కుమారున్ని తీసుకుని వెళ్లి వానిని గొప్ప జనముగా చేస్తాను
అన్నాడు... కుదరదు అన్నాడు అబ్రహాము .... అప్పుడు దేవుడు అభ్రహము కన్నులను తెరవగా
పొదలలో చిక్కుకున్న ఒక పొట్టేలు కనిపించింది. గమించండి అప్పటికే అ పోట్టేలును
దేవుడు సిద్ధ పరచి ఉంచాడు. అయితే విశ్వాసాన్ని, భక్తిని
పరీక్షించడానికి దానిని మరుగు పరచి ఉంచాడు... ఈరోజు నీకు కూడా ఏదో కనిపించని,
మరుగైన ఆసిర్వాదాన్ని దాచి ఉంచాడు. మరి అబ్రహాము వాలే దేవునికి
ఇవ్వడానికి ముందుకు రాగలవా? అబ్రాహము తనకిష్టమైన
కుమారుడిని ఇచ్చాడు? మరి నివ్వు..... ఇచ్చుటలోనే దేవునిపై
నీ భక్తి, భయం, ప్రేమా
వ్యక్తమవుతాయి. ప్రభువు నీవు ఇచ్చిన కొలది నురింతలు దీవెనలు నీ కుటుంబంలో
కుమ్మరించును గాకా! వేదజల్లి అభివృధి పొందువారు గలరు,.... ఔదార్యము గలవారు పుష్టి
నొందుదురు. సామెతలు 11: 24, 25;
షలోమ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి