పరిక్ష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పరిక్ష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శిక్ష (న)

 





ఈరోజు నా మనస్సు ను చాలా బాధ పెట్టిన విషయం లో ఒక మంచి పాఠం మీకోసం….

 

నా కుమారుని క్రమశిక్షణ లో బాగంగా తాను ప్రతి రోజు చెయ్యవలసిన కొన్ని పనులు చెయ్యడం మానేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని తనకు అందులో ఉన్న తీవ్రత ను తెలపడం కోసం మోకాళ్ళు వెయ్యమని శిక్ష వేసాను. కొంచెం సేపు బాగానే వేసి ఉన్నాడు కానీ నా మనస్సు లో చాలా బాధగా ఉంది. అయ్యో కొడుకు ఇబ్బంది పడుతున్నాడని మనస్సు నొచ్చుకుంది. కానీ కటినంగా ఉండక పోతే కొన్ని విషయాలు పిల్లలకు నేర్పలేము. ఇంతలో నా కూతురు, బార్య, చెల్లి వచ్చి తనను వదిలేమని చెప్పారు. వాళ్లకు వాడిని నన్ను అడిగితే, మరల తప్పు చెయ్యను అని చెపితే వదిలేస్తాను అని చెప్పాను. వీళ్ళు వెళ్లి చెప్పారు. వాళ్ళు బాధపడుతున్నారు. నేను బాధ పడుతున్నాను. నా కొడుకు బాధ పడుతున్నాడు. వాడు అడుగుతాడు అని నా కొడుకు చుట్టూనే తిరుగుతున్నాను. కానీ వాడికి నన్ను అడగటానికి భయం, ఎలా అడగాలి అనె భయం. అడిగితే వదులుధమని నా ఆశ. ఈలోపు ఎప్పుడు కొట్టుకునే తన అక్క వాడి కోసం ఏడుస్తుంది. వాడికి అర్థం అయ్యింది, అక్కకు తను ఎంత ఇష్టమో, వాడికి బదులు తను మోకాళ్ళు వెయ్యడానికి సిద్ధం అయ్యింది. కొంచెం సేపటికి తను మెల్లగా డాడీ నీ మాట వింటాను అని చెప్పగానే నా కళ్ళల్లో నీళ్ళు, తనను కౌగలించుకున్నాను. అందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వాడికి ఇష్టమయిన వస్తువు వెంటనే అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను.

మన దేవుడు ఇంతకన్నా ప్రేమమయుడు, ఆయన మనలను శిక్షించి, మన పశ్చాతాపం తో చేసే ప్రార్ధన కోసం ఎదురు చూస్తుంటాడు. ( కీర్త 103:13 ) మనలను పాడు చెయ్యాలని కాదు గానీ మనలను బాగు చెయ్యాలని తన ఆశీర్వాదమునకు వారసులను చెయ్యాలని తన తపన. అందుకే ఒక పాపి తన పాపంలో మరనించుట తనకు ఇష్టం లేదు అని, ఒక పాపి రక్షింప బడితే పరలోకం లో దేవతలు ఆనందిస్తారని, ప్రభువు శిక్షించు నరుడు ధన్యుడు అని వాక్యం చెపుతుంది.  ( యెహే 18:30-32, లూకా 15:10, యోబు 5:17,18 )

 

క్రొత్త పరీక్షా విధానం..


జులై 1, 2020 నుండి డిల్లీ యూనివర్సిటీ వాళ్లు నుతన పరీక్షా విధానం ప్రవేశపెట్టారు. అదే ఓపెన్ బుక్ ఎక్సామినేషన్ అంటే పుస్తకాలు చూసి  పరిక్ష వ్రాయడం. ప్రశ్న లు వాళ్లే వేసి దానిని వ్రాసుకొడానికి వాళ్లే పుస్తకాలు అనుమతిస్తారు. అయితే ఇవ్వబడిన  అవకాశంలో వారి ప్రతిభ ప్రశ్నకు సమాధానం కనుగొనె ప్రతిభను బట్టి మార్కులు ఇవ్వబడథాయి. ఇది చదివినప్పుడు నాకు బైబిల్ ఒక సందర్భం గుర్తుకు వచ్చింది. 

అప్పుడే అర్దం అయ్యింది ధీని నిర్మానికుడు మన దేవుడే అని. విస్వాసికి శ్రమల ద్వారా పరీక్షించు వాడు ఆయనే, ఆ శ్రమలలొ తప్పించుకొను మార్గమును సిధ్ధ పరచువాడు ఆయనే అట. అంటె మన శ్రమలలొ మన గెలవడం అంటె అయన మనకు సిధ్ధపరచిన మార్గమును కనిపెట్టడమె మన విధి. దాని ద్వారానే మన ఫలితం ఆధారపడి ఉంటుంది. మరి శ్రమలు కలిగినప్పుడు దేవుడు ఎర్పరచిన మార్గాన్ని కనుగుంటున్నవా? లేకా సొంత మార్గములొ నడచి దేవుని దృష్టిలో విఫల విస్వాసిగా మిగిలిపొథున్నవా? దేవుని మార్గం తెలుసుకోడానికి విశ్వాసం, ప్రార్ధన అవసరం. 

1కోరింథీయులకు 10: 13


https://www.google.com/amp/s/m.timesofindia.com/home/education/news/open-book-examination-what-does-it-mean/amp_articleshow/76112795.cms