ప్రతి మనిషికి శత్రువు ఉంటాడు, కొంతమంది తెల్లవారితే బూతులు తిడుతూ ఉంటారు ఎదో ఒకదానిని వంక పెట్టుకుని, కొంతమంది బయటకు కనపడకుండా ప్రత్యర్థిని ఎలా దెబ్బ కొట్టాలా అని ప్రయత్నాలు చేస్తుంటారు. అవకాశం వచ్చినప్పుడు ఎదో రీతిగా ప్రత్యర్థిని పడగొట్టడానికి,మరికొంత మంది చంపడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు.ఒకొక్కసారి వాటిని ఎదుర్కోగల శక్తి ఉంటుంది, ఒకొక్కసారి ఎదుర్కోలేక పతనం కావలసి ఉంటుంది. అనుకోని సమయం లో మెరుపు దాడి చెయ్యొచ్చు, దానికి సిద్ధంగా ఇందాక పోవొచ్చు. ఒకవేళ నీవు అలాంటి శత్రువును కలిగి ఉంటే,నీకు ఒక జరుగుతున్న ఒక విషయాన్ని తెలియ జేస్తాను.
పాలస్తీనా కు ఇశ్రాయేల్ దేశాలకు చాలా భయంకర శతృత్వం ఉందిి. ఇజ్రాయిల్ దేశ శత్రువులు అనుకోని సమయం లలోవారి మీద బాంబులు వేస్తూ ఉండేవారు. కానీ అవి ఇశ్రాయేల్ దేశం మీద పడేవి కావు, కొన్ని సార్లు అవి ప్రయోగించిన వారి మీదే పడుతూ ఉండేవి. శతృవు కు అర్ధం అయ్యింది. ఇశ్రాయేలీయుల దేవుడు వారికి సహాయం చేస్తున్నడు అని. పైన అది వాళ్ళు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్. “ ఇశ్రాయేలీయుల దేవుడు మేము పంపించే రాకెట్ల దారిని మళ్లిస్తున్నారు”.
తన ప్రజలు నిద్రపోతుంటే, బలహీనుడు గా ఉంటే, మెరుపు దాడిలో,దొంగ చాటున, సిద్ధం గా లేని సమయాన శతృవు నుండి తానే కాపాడుకుంటున్నారు. అలాంటి దేవుడు మనకంటే ఎంత బాగుణ్ణు. ఆయన వాళ్లకు మాత్రమే దేవుడు కాదు, ఆయనను అంగీకరించిన ప్రతిఒక్కరికి సర్వసృష్టికి దేవుడే, నీవు అంగీకరిస్తే నీకును ఆయన తన కాపుధల ఇవ్వగలరు.
రండి ఆయన దగ్గరకు యేసు ఒక్కడే మార్గం. యేసును అంగీకరించి దీవించ బడుదుము.
ప్రభువు మిమ్మును దేవించును గాక.
కీర్తనలు 121, హబకుకు 2:9, అపోస్తులూ 10:34-36, ద్వితి 11:12