అంతుచిక్కని రహస్యం 🤔


కొబ్బరికాయలు అంధరికి తెలుసు గాని కొబ్బరికాయలు లోనికి నీరు ఎలా వెల్తుందో ఎవరికీ తెలియదు, చివరికి శాస్త్రవేత్తల కు సహితం అంతుచిక్కని రహస్యం అది. అధి దైవ కార్యం మానవుని ఆలోచన కు అందదు. అలాంటివి సృష్టిలో, ఈ భూమి మీద మన చుట్టు వున్నాయి. 

అలాంటి వాటిలో ఒకటి, దేవుని యంధు సంపూర్ణ విశ్వాసంతో జీవించే వారి జీవితాలు, సేవకుల జీవితాలు. వీరు లోకుల కంటె, స్నేహితుల కంటె, శత్రువుల కంటె ధీనులుగా ఉండవచ్చు. కాని శ్రమల కాలంలో, ఆపద కాలంలో, కరువు సమయాలలో ఎలా పోషింప బడుతున్నారో, వారి అవసరాలు ఎలా తీర్చబడుతున్నాయో ఎవరికీ అంతుచిక్కని రహస్యం గా ఉంటుంది, చివరికి అనుభవించే వారికి కుడా ఆశ్చర్యం గానే మిగిలి పోతుంది. 

దేవుడు తన ప్రజలను ఆకలి గొననియ్యడు. ( సామెతలు 10:3), వారికి ఆశ్చర్య కరమయిన సహాయం అందిస్తారు ( 2 దిన 26:15 ), అధి మనుష్యుని అలోచన కు అందదు ( 1 కోరింది 2:9). 

ఎలియాకు కాకులు ఆహారం తేవడం ఎంటి? సారెపతు వెధవరాలి ఇంట్లో నునె, పిండి ప్రతిరోజు సిధ్ధం గా ఉండటం ఎంటి? సముద్రం లోనుండి పురెల్లు రావడం ఎంటి? ఆకాశం నుండి మన్నా రావడం ? 5రొట్టెలు 2 చిన్న చేపలు 5000 మంది తినడం? అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి... మన జీవితం లో కూడా కధా.. 
సదా మనలకు పోషణకర్త గా, యెహోవా యీరె గా ఉన్న ఆయనకే మహిమ కలుగును గాక

మీ సహోదరుడు
అపొస్తులు నాని బాబు నెల్లి
9908823196 

కామెంట్‌లు లేవు: