ప్రార్ధన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రార్ధన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మన దేశంలో దేవుని సింహాసనం! ఎలా?


భూత,వర్తమాన,భవిష్యత్ కాలములలో ఉన్న ఎల్ - రోయి, ఎల్ - షద్ధయీ దేవునికే మహిమ,

ప్రభువు నామమున మీకు శుభాలు,

ప్రతి ఒక్కరికీ తెలుసు ప్రార్ధన శక్తి వంతమయింది అని, కొంత మందికి తెలుసు గొలుసు ప్రార్ధన మరింత శక్తివంతమైనది అని. గొలుసు ప్రార్ధన వలన జరగని కార్యం అంటూ లేదు. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసిన విధానం. ఇధి కొంతమంది తెలియక పోవచ్చు. ఎలా అంటారా? యెషయా 6:1-3, ప్రకటన 4:8;5:9-14; 8: 1 లోని వాక్యాల ఆధారంగా, పరలోకం లో దేవుని సింహాసనం ఎదుట నిలచున్న దేవుని దూతలు, సెరాపులు, కేరాపులు నిత్యం ప్రభువుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉంటారు. అంటే పరలోకంలో నిత్య స్తుతి జరుగుతుంది.

 అదే నిత్య స్తుతి భూమి మీద రాజైన దావీదు సీయోను పర్వతం మీద, దేవుని ప్రత్యక్ష గుడారం నందు ఏర్పాటు చేశాడు.(  1దిన 16 ). అందుకోసమే దేవుడు అప్పటివరకు ఏ ప్రాంతాన్ని కూడా నా నివసస్థలం అని చెప్పలేదు, గానీ సీయోను తన నివాసముగా, అయన సీయోను వాసిగా చెప్పుకున్నారు. యెషయా 8:18, కీర్తనలు 74:2. అందుకోసమే దావీదును నా హృదయ అనుసారుడు అని సాక్ష్యం, బిరుదు ఇచ్చారు. అప్పుడు మొదలైనది నిత్య ఆరాధన, ప్రార్ధన భూమిమీద. అది కాస్త మార్పు చెందుతూ ఇప్పుడు గొలుసు ప్రార్ధన గా పిలువబడుతుంది. 

అంటే భూమి మీద ఎక్కడైతే నిత్య స్తుతి ఆరాధన ఉంటుందో అక్కడ ఆయన నివాసముంటారు. దానిని తన నివాస స్థలము గా చేసుకుంటారు. ఆ స్థలం నుండి తన పరిపాలన చేస్తారు. 


వాక్యం లో ఆయన నివాసం ఉన్న చోట స్తుతులు ఆయన సింహాసనం ( కీర్తనలు 22:3 ) అయితే ఆయన పాద పీఠం తన శత్రువులు ( కీర్తనలు 110:1 ) అని ఉంది. తన బిడ్డలం అయిన మన శత్రువు తన శత్రువు ( రోమా 12:19 ) ఇప్పుడు మనను బాధించు వారు, మనను శ్రమ పెట్టువారు, నిందించు వారు, మనలను బాధించు రోగములు, శాపములు, తెగులు దేవుని పాదముల క్రింద ఉంటే మనకు విడుదల, విజయం, సమాధానం, రక్షణ. 

అయితే ఆయనకు మనం సింహాసనం వెయ్యాలి కదా.... అలా ఆయనకు మన దేశం లో సింహాసనం వెయ్యడానికి దీర్ఘకాల, నిత్య గొలుసు ప్రార్థన చెయ్యాలని దర్శనం తో మా పరిచర్య జరుగుతుంది. 

ఇప్పటికే 70+ సేవకులు, మరికొంత మంది విశ్వాసులు కలసి ప్రతి నెల 1 వ తారీకు నుండి 5 వ తారీకు వరకు గొలుసు ప్రార్ధన జరుగుతుంది. మా ప్రాణాలిక దర్శనం ప్రాకారం ఈ ప్రార్ధన 30 రోజులు ఆగకుండా జరగాలి. 

అయితే మిమ్ములను కూడా ఇందులో పాలి బాగాస్తులు గా ఉండుటకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. సంఘ, సిద్ధాంతం, ప్రాంతం, మిషన్ బేధం లేదు, పెంతుకొస్తు నుండి రోమన్ కేథలిక్, బిషప్ లనుండి సువార్తికుని వరకు అందరు రండి మనం అందరం కలసి మన సర్వలోక నిర్మానకుడు, ఆదిసంబుతుడు, సర్వశక్తుడు అయిన దేవునికి ఒక బలమైన సింహాసనం మన దేశం లో వెద్ధం..... 

ఈ సహవాసం లో  నెలకు ఒకరు  ఒక గంట, సంఘ ముగా ఒక రోజు గొలుసు ప్రార్ధన లో ఏకీభవించ గలిగితే చాలు... 



మరిన్ని సహవాస వివరాలు, కోసం
మీ వివరాలు, ఇష్టత  మాతో పంచుకోండి..... 

𝐈𝐍𝐃𝐈𝐀 𝐏𝐑𝐀𝐘𝐄𝐑 𝐋𝐄𝐀𝐆𝐔𝐄,

9908823196



మన గ్రూప్ లి జాయిన్ అవ్వండి. వాటిపై క్లిక్ చెయ్యండి.




స్తుతి ప్రార్ధన శక్తి నిరూపణ

ప్రియ దైవ జనులకు మీ జత పని వాడనైన క్రీస్తు దాసుడను, మరియు తోటి క్రైస్తవ సహోదరి సహోదరులకు అపోస్తుల పిలుపుతో దేవుని సేవను కొనసాగిస్తున్న నాని బాబు నెల్లి భారముతో, హృదయ పూర్వక వందనములతో వ్రాయునది.

ఒక యదార్ధ విషయాన్ని  మీకు తెలియ జేయాలని ఆశ పడుతున్నాను. ఎస్తేరు ప్రాజెక్ట్ వారు ప్రచురించిన లెక్కల ప్రకారం 2016 లో 361 సఘంపై దాడులు నమోదు చేయ బడ్డాయి, 2016 నుండి సంఘం మీదకు శ్రమలు ఇంతకు ముందు కంటే  20%  పెరిగాయి, మరియు ప్రతి 40 గంటలకు ఒక సంఘ వ్యతిరేక సంఘటన జరుగుతుంది.  CBN NEWS ప్రకారం  2017  లో అర్ధ సంవత్సరనికే జరిగిన సంఘటనలు  2016  లో మొత్తం  జరిగిన సంఘటనలు తో సమానం. మరియు ఓపెన్ డోర్ వారి 2018 వాచ్ లిస్టు నందు ప్రపంచంలో 50 అతిగా క్రైస్తవ సమాజం హింసింప దేశాల జాబిత లో మన దేశం 11 వ స్థానం లో ఉంది.  ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగ చెప్పబడుచున్న మన దేశం లో ఇలా సంఘ వ్యతిరేక దాడులు జరగడం చాల అవమానకరం. మన దేశంలోని పరిస్థుతులు  ఇలా క్రైస్తవ సమాజానికి సంఘానికి సేవకు విరుధం గా మారుతున్నాయి. రాబోయే కాలం లో ఈలాంటి పరిస్థితి కొనసాగితే దేవుని సేవ చేయుటకు, ప్రభువును భాహిరంగంగా స్తుతించడానికి అవకాశాలు ఉండక పోవొచ్చు.

మరో మంచి ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. 2011 నుంది ఉతర కొరియా ను పాలించిన కిమ్ జోంగ్ ఉన్  ఎంతటి నియంతో, ఆ దేశాన్ని ఎల పాలించాడో,  ప్రపంచ పోలీస్ గా, శక్తీ వంత మయిన దేశం అమెరికా మీదకు ఎలా కాలు దువ్వాడో మనకు తెలిసిందే కాని మనకు తెలియని ఒక విషయం, అక్కడ క్రైస్తవ సమజాన్ని అతడు చిత్ర హింసలకు గురి చేసాడు. అనేక మంది వారి విశ్వాసం కోసం ప్రాణాలు బలి పెట్టారు, అక్కడ సంఘం కటిన  హింసలు అనుభవించారు, తాగడానికి నీళ్ళు లేక, సరియయిన వైద్య అందక జైల్లో చిత్ర హింసలకు గురి అయ్యారు. అయితే అద్బుత మయిన విషయం ఏమిటి అంటే హింస కాలం లోనే అక్కడ సంఘం 5 రెట్లు వృద్ది అయ్యింది. జూన్ 12 న జరిగిన అమెరికా ఉతర కొరియా ల ఒప్పందం వలన మరల సంఘానికి స్వేచ్చ కలిగింది. దానికి వారు చేసిన పనేంటో తెలుసా ప్రార్ధన.

ప్రార్ధనా వారికి కరడు గట్టిన నియంత నుండి స్వేచ్చ ను తీసుకు రాగలిగింది. ప్రార్ధనా అమెరికా పాలకులలో శాంతి భావాన్ని కలిగించి తిరుగు బాటు చేసినా శాంతిగా ఒప్పందం కుదుర్చుకునే టట్టు చేయగలిగింది. కిమ్ జోంగ్ ఉన్ మనస్సును మార్చగలిగింది. దేవుని సహాయాన్ని పొందుకునే టట్టు చేసింది. ఎక్కడైతే ప్రార్ధాన, స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు ఆశినుడు అవుతాడు.
ఆశినుడు అంటే కూర్చోవడం, వాక్యం లో చెప్పినట్టు మన స్తుతులే ఆయన కూర్చోడానికి సింహాసనం ( కీర్త 22 :3 ) . అయన అసినుడు అయిన చోట అయన కాళ్ళ క్రింద ఒక పాద పీటం ఉంటుంది. అదేంటో తెలుసా అయన శత్రువులు (కీర్త 110 ). అయన కు మనం సింహాసనం వెయ్య గలిగితే అయన శత్రువు, సంఘ వ్యతిరేకులును అయన పాద పీటం గ చేసుకుంటాడు. ఆయనను సేవించు వారిని తన ప్రక్కన కూర్చుండ బెట్టుకుంటాడు. అంతే కాదు మన శత్రువులను మను పాద పీటము గా చెయ్య గలడు. అయితే మనం ఆయనకు ఒక సింహాసనం వెయ్యాలి.

పరలోకం లో ఆయనకు ఒక సింహాసనం  ఉంది. ఆయనను మనం భూమి మీదకు తీసుకుని రాగలిగిన ఒకే ఒక్క మార్గం అది పరలోక మాదిరి  స్తుతి, ఆరాధన. ఆదే ఆయనకు ఒక సింహసనం. ప్రభువు తన వాక్యం లో నేను సియోను వాసిని అన్నారు. అంటే అయన సియోనులో సింహసనసినుడు అయ్యారు. ఎందుకంటే సియోనులో దావీదు ఒక గుడారాన్ని కట్టి అక్కడ పరలోక మాదిరి  నిత్య స్తుతి ఆరాధన క్రమాన్ని స్థాపించాడు.

ఈరోజు మనం కూడా అలాంటి ఎడతెగని స్తుతి ఆరాధన స్థాపించ గలిగితే అయనకు  మన దేశం లో, మన రాష్ట్రం లో, మన జిల్లాలో ఒక సింహాసనాన్ని వెయ గళం. ఆ సింహాసనాన్ని సిధపరచ డానికె  ఇండియా ప్రేయర్ లీగ్ స్థాపించా బడింది. ఇప్పటికే 64 సంఘాలు తూర్పు, పచ్చిమ గోదావరి, గుంటూరు  జిల్లా ల నుండి, 20 సంఘాలు కలకత్తా, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుండి  ఇందులో పాలి భాగస్తులై ఉన్నారు. మీరును కూడా ఇందులో పాలి భాగస్తులై భారత దేశ క్షేమం కొరకు మన దేవునికి ఒక సింహాసనాన్ని సిద్ధపరుచుధాం . అందుకు మీరు చేయాల్సినది నెలలో సంఘముగా అయితే  ఒక రోజు లేక  వ్యక్తి గతం గా అయితే  ఒక గంట / అర గంట  సమయం కేటాయించాడం. మీరు కేటాయించిన సమయానికి మీరు ఉన్న స్థలములో ఉండి ప్రార్ధనలో ఉంటె చాలు. అవ్విధముగా నెలలోని 30 దినములు, 72౦ గంటలు ఎడతెగని స్తుతి ఆరాధనా జరుగుతుంది.

ఇప్పటికే అనేకులు స్తుస్తితూ ప్రార్ధిస్తున్నారు. మీ ఫోన్ నుండి ఒక మిసిడ్ కాల్ గాని, మీరు ప్రార్ధించే సమయం మెసేజ్ గాని చేయుట ద్వార మాకు మీ అంగికారని తెలియ జేయండి. కలసి దేవుని సన్నిధిని అనుభవిద్దాము, అలగే మీ ప్రార్ధనా అవసరతలు ఉంటె మాకు తెలియ జేయండి మనతో కలసి ప్రార్ధించే వారికి మీ అవసరత తెలియ పరుస్తాము. ప్రతి గంటకు మీ నిమిత్తం ప్రార్ధనాలో దేవుని ఎదుట ప్రస్తావించ బడుతుంది.

ప్రభువు సేవలో,
అపొస్తులు నాని బాబు నెల్లి,
స్థాపితులు,

ఇండియా ప్రేయర్ లీగ్,




క్రొత్త పరీక్షా విధానం..


జులై 1, 2020 నుండి డిల్లీ యూనివర్సిటీ వాళ్లు నుతన పరీక్షా విధానం ప్రవేశపెట్టారు. అదే ఓపెన్ బుక్ ఎక్సామినేషన్ అంటే పుస్తకాలు చూసి  పరిక్ష వ్రాయడం. ప్రశ్న లు వాళ్లే వేసి దానిని వ్రాసుకొడానికి వాళ్లే పుస్తకాలు అనుమతిస్తారు. అయితే ఇవ్వబడిన  అవకాశంలో వారి ప్రతిభ ప్రశ్నకు సమాధానం కనుగొనె ప్రతిభను బట్టి మార్కులు ఇవ్వబడథాయి. ఇది చదివినప్పుడు నాకు బైబిల్ ఒక సందర్భం గుర్తుకు వచ్చింది. 

అప్పుడే అర్దం అయ్యింది ధీని నిర్మానికుడు మన దేవుడే అని. విస్వాసికి శ్రమల ద్వారా పరీక్షించు వాడు ఆయనే, ఆ శ్రమలలొ తప్పించుకొను మార్గమును సిధ్ధ పరచువాడు ఆయనే అట. అంటె మన శ్రమలలొ మన గెలవడం అంటె అయన మనకు సిధ్ధపరచిన మార్గమును కనిపెట్టడమె మన విధి. దాని ద్వారానే మన ఫలితం ఆధారపడి ఉంటుంది. మరి శ్రమలు కలిగినప్పుడు దేవుడు ఎర్పరచిన మార్గాన్ని కనుగుంటున్నవా? లేకా సొంత మార్గములొ నడచి దేవుని దృష్టిలో విఫల విస్వాసిగా మిగిలిపొథున్నవా? దేవుని మార్గం తెలుసుకోడానికి విశ్వాసం, ప్రార్ధన అవసరం. 

1కోరింథీయులకు 10: 13


https://www.google.com/amp/s/m.timesofindia.com/home/education/news/open-book-examination-what-does-it-mean/amp_articleshow/76112795.cms


దేవుని దగ్గర కోరికల చిట్టా పెడుతున్నావా? ఒకసారి ఇది చదువు






సోదోమ గోమేర్ర ల పాపం అధికం కావడం వలన ఆ ప్రాంతాలను పాప శిక్షకు అప్పగించడానికి దాని స్థితిని చూసి రావడానికి దేవుడు తన దూతలను పంపగా వారిని లోతు చేర్చుకున్నాడు. ఆదిత్యం ఇవ్వడం అలవాటుగా అబ్రహాము నుండి నేర్చుకోవడం వలన దేవుని దుతలకు ఆదిత్యాన్ని ఇచ్చాడు లోతు. ఆ రాత్రి ఆ పట్టణపు వారు లోతు ఇంటికి వచ్చిన వారిని బయటకు పంపమని గొడవచేయగా దేవుని కోపం ఆ దేశం మీద రేగింది. ఆ దూతలు లోతును తన కుటుంబాన్ని రక్షించాలని ఆసపడగా లోతు యొక్క అల్లుళ్ళు, కుమారులు తన మాట వినలేదు, కుమార్తెలను భార్యను తీసుకుని బయటకు తీసుకురాగ భార్య వెనుక తిరిగి ఉప్పు స్థంభం అయ్యింది. అయితే దేవుడు లోతు పట్ల ఒక ఉద్దేశ్యం కలిగి ఉండి కనపడుచున్న పర్వతానికి వెళ్ళమని చెపితే తను మాత్రం దగ్గరగా ఉంది కదా అని సోయరు కు వెళ్తానని అడుగుతాడు, దానిని దేవుడు అంగీకరించాడు. మనం కూడా దేవుని అడుగుచున్నప్పుడు అయన కాదనలేక అంగీకరిస్తాడు, కాని మనం ఎన్నుకున్నది దేవుడు మన కోసం దానికి చాల వత్యాసం ఉంటుంది. కొన్ని రోజులు లోతు అక్కడ నివాసం చేసాక అక్కడ అతనికి భయం వెంబడించింది, సోయారు కూడా సోదోమతో నాశనం కావలసింది కాని లోతు వాళ్ళ దానిని కాల్చలేదు, లోతు అక్కడ ఉండలేదు. మరల అక్కడ నుండి ముందు దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెల్లవలసి వచ్చింది. కాని అప్పుడు అక్కడ తన కుమార్తెలు పాపం లో పడిపోయారు. తన సంతానం సపగ్రస్తులయ్యారు. దేవుడు వెల్లమన్నపుడు వెళ్తే దేవుడు తనకోసం అక్కడ ఏమి సిద్ధపరిచాడో కదా... పాప భుయిష్టమయిన ప్రజల మధ్య పవిత్రతను కాపాడుకునిన పిల్లలు ఆ ప్రాంతములో పాపములో పడిపోయారు. ఒక్కసారి అలోసించు దేవుడు నీకొరకు నీకంటే ఎక్కువగా అలోసిస్తున్నారు, నీ భవిష్యత్తు గురుంచి  నీకంటే ఎక్కువగా అల్లోసిస్తున్నారు అయన. అందుకే నీ చిట్టా అయన దగ్గర పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించు. ఆయన చిత్తానికి లోబడితే అంతా మేలే జరుగుతుంది కొంచెం ఆలస్యం అయిన. దేవుడు చేయమనిన పనిని చేయ్యమన్నప్పుడే చెయ్యి ఇప్పుడు వేరే ఆలోచనలు ఆయనకు చెప్పి తరువాత మరల అక్కడికే రావలసి వస్తే మిగిలేది శూన్యం.

ప్రభువు చిత్తము నీయెడల నెరవేరును గాక..
మీ సహోదరుడు
అపోస్తులు నాని బాబు నెల్లి

మెలకువగా ఉండుడి అంటే ?


 మెలకువగా ఉండుడి అంటే ?




మత్తయి 26:41 లో యేసువారు " మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్ధన చేయుడి" అని హెచ్చరించారు. మనం శోధనలో. శ్రమలో పడకుండా చేసేది ప్రార్ధన, అయితే ఆ ప్రార్ధన మెలకువగా ఉండి చెయ్యాలని ప్రభువు హెచ్చరిస్తున్నారు. యేసువారు రాత్రంతా ప్రార్ధించే వారు, వేకవునే లేచి ప్రార్ధించే వారు. దావీదు కూడా ప్రార్దనపరుడే. ఇంకా చాలా మంది ప్రార్ధన పరులు బైబిల్ లో ఉన్నారు. అయితే ప్రార్ధించిన గాని చాల మంది శోధనలో పడిపోయారు. ఉదాహరణకు దావీదు. అల మనం శోధనలో ప్రవేశించ కూడదు అనే యేసు వారు మెలకువగా ఉండి ప్రార్ధించాలని ప్రభువు సూచిస్తున్నారు. మెలకువగా ఉండటం అంటే నిద్ర పోకుండా ఉండటం మాత్రం కాదు. మెలకువ అంటే - కొన్ని ప్రాంతాలలో నిద్ర పోతుంటే వారు తెలివి లోకి రాలేదు అంటుంటారు. మెలకువ అంటే తెలివిగా ఉండటము. సాతనుడు పన్నే పన్నాగాలను పసిగట్ట గలిగే తెలివిని కలిగి ఉండటం. అప్పుడు మాత్రమే శోధనను జయించగాలవు. అట్టి కృప ప్రభువు నీకు దయ చేయును గాక.

మీరు తెలివితో జీవించాలని ప్రార్ధిస్తూ,

మీ సహోదరుడు,
అపోస్తులు నాని బాబు.