విశ్వాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విశ్వాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

పరీక్ష గదిలో




ఈరోజు ఉదయాన్నే ప్రార్థనలో మన తండ్రి నాకు నా డిగ్రీ కాలేజ్ లో పరీక్ష వ్రాస్తున్న సమయాన్ని గుర్తు చేశారు. నాకు కొంచెం ఆలోచనలో పడ్డాను. తండ్రి ఎప్పుడు అనవసరంగా గుర్తు చెయ్యరు దిని వెనుక ఎదో ఒక విషయం ఉంది, దానిని చెప్పాలి అనుకుంటున్నారు అని ధ్యానించడం మొదలు పెట్టాను.

 

కొంచెం సేపు ఆలోచనల తరువాత నా మధి మా పరీక్ష గదిలో ఉన్న ఇన్విజిలేటర్ వైపు వెళ్ళింది. ఆయన చాలా కట్టినంగ వ్యవహరించే వారు. అసలు అతు ఇటు కధలనిచ్చే వారు కాదు. ఇంకొంచెం అలోసిస్తే ఆ ఇన్విజిలేటర్ మాకు తెలియని వారు కాదు, గడచిన సంవత్సరం అంతా మాకు బోధించిన సారే

 

ఆయన సంవత్సరం అంతా బోధించి, మమ్ములను ఎంతగానో ప్రేమించి, బరించి, అర్ధం కాకపోతే మరల మరల అర్ధం అయ్యేవరకు వరకు చెప్పిన అధ్యాపకుడు. కానీ ఇప్పుడు ఆయన వేరే స్థానం లో ఉన్నారు. మేము పరీక్షలు వ్రాసేటప్పుడు ఆయన చెప్పినవన్నీ మేమే వ్రాయాలి. ఆయన ఇప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదు.

 

అలాగే దేవుడు బోధించినప్పడు, నేర్పించినప్పుడు మనం నేర్చుకోవాలి, శ్రమలలో ఆ బోధలు మనకు సహాయంగా ఉంటాయి. ఆయన మనలను చూస్తూ ఉంటారు. మనం ఏవిధంగా నడుస్తున్నాము, ఏవిధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నామో, ఆయన చెప్పిన మార్గం లో నడుస్తున్నాము లేనిది పరీక్షిస్తారు. ఇవన్నీ ముందుగానే మనకు బోధించారు కదా….

మనకు బోధించిన అధ్యాపకుడు మనంపరిక్ష కాలంలో మౌనాన్ని వహించినట్టే ఇయన మౌనాన్ని వహించి మనలను పరిశీలిస్తారు

సూర్యుని నుండి పాఠం


మనకు సూర్యుని గురుంచి చాలా విషయాలు తెలుసు కానీ ఇంకా తెలియాల్సిన వి కూడా చాలా ఉన్నాయి.

 ఒకరోజు నేను ప్రార్ధన చేస్తుంటే నా దృష్టిని దేవుడు సూర్యుని మీదకు తిప్పారు. సూర్యుని గురుంచి చాలా విషయాలు అలోసించను, అయిన నాకుదేవుడు చెప్పదలసిన విషయం నాకు రావడం లేదు. చాలా విషయాలు చదివాను. ఒకొక్కసారి లోతైన విషయాలు కాకుండా చాలా సాధారణ విషయాలతో కూడా దేవుడు మనతో మాట్లాడతారు.

 నేను సూర్యుని గురుంచి ఎంత అలోసించిన నాకు లోటు గానే ఉంది. అప్పుడు సాధారణ విషయాలు అలోసించడం మొదలు పెట్టాను. అందులో ఒకటి సూర్యోదయం, సూర్యాస్తమయము. సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయించడం, కనిపించడం. భూమి సూర్యుని తట్టు ఉన్న బాగం మీద సూర్య కంటి పడుతుంది, కనపడుతుంది. మరో బాగం లో సూరీడు కనపించడు. అంటే సూర్యుడు లేడు అని కాదు కదా…. సూర్యుని వైపు మనం లేము గనుక మనకు చీకటి.

 అలాగే దేవుడు మనకు కనిపించ నంత మాత్రాన ఆయన లేరు అని కాదు. ఒకటి మనం ఆయనకు మన వెనుక చూపిస్తున్నాం కాబట్టి మనకు చీకటి కలుగుతుంది, అంటే శ్రమలు, కష్టాలు, వేదనలు, శోధనలు. అదే మనం ఆయన వైపు ఉంటే మనకు వెలుగు, అంటే ఆశీర్వాదం, సమయోచిత మయిన ఆలోచనలు, సందర్బాయోచిత మయిన సహాయం కలుగుతుంది. అంటే కానీ ఆయన లేనట్టు కాదు, మనలను విడచినట్టు కాదు.

రెండు, అధి దేవుడు పెట్టిన క్రమం. ఎలా అంటే మనకు చీకటి కలగడం అంటే శ్రమలు, వేదనలు కలగడం వలన మనం నిరీక్షణ ను, విశ్వాసాన్ని అల్వరచుకుంటాము. సూర్యుడు ఉదయించక పోతాడా అని.

 దేవుని వైపు మనం తిరుగుదాము, ఆయన మనవైపు ఎల్లప్పుడూ చేతులు చాపి ఎదురు చూస్తున్నారు.

 

దేవుడు మిమ్మును దీవించును గాక!

 

అపోస్తులు నెల్లి నాని బాబు

9908823196

పట్టుకున్న దానిని కూడా వదిలేయ్






వర్షా కాలం లో ఒక వ్యక్తి ఏటిగట్టున నడుకుంటూ వెళ్తుండగా కాలు జారి ఏటిగట్టుకు క్రిందన ఉన్న నేల నూతిలో పడిపోసాగాడు, ప్రాణబయంతో అక్కడ చేతికి అందిన ఒక మొక్కను పట్టుకున్నాడు. అయితే కురుస్తున్న వార్షానికి నెల మెత్తన పడి అది కుడా ఒకో వేరు ఒకో వేరు తెగిపోవడం మొదలు పెట్టింది. వేర్లు తెగుతున్న కొలది వాని ప్రాణాలు జారిపోతున్నాయి. ఎంత కేకలు పెట్టిన ఎవ్వరు రావడం లేదు. ఇక ప్రాణ భయంతో ఉండగా దేవుడు గుర్తుకు వచ్చారు, వెంటనే ప్రార్ధన చెయ్యడం మొదలు పెట్టాడు. కాపాడమని అడగడం మొదలు పెట్టాడు. అయితే అది అత్యవసర పరిస్థితి గనుక దేవుని ప్రత్యక్షత దొరికింది. ఏమికావాలని ప్రభువు అడగగా? నన్ను కాపాడు అన్నాడు. నేను నిన్ను కాపాడగలనని నమ్ముతున్నావా? అడిగారు ఆయన, నమ్ముతున్నాను అన్నాడు, నిజంగా నమ్ముతున్నావా? నీవు మాత్రమె కాపడగలవు అన్నాడు. అప్పుడు దేవుడు నా మీద అంత నమ్మకం ఉంటె నీవు పట్టుకున్న చెట్టు వద్దిలేయ్ అన్నారు......

 

నిజమయిన, ధృడ మయిన  నమ్మకం ఉంటె అప్పటివరకు పట్టు కున్నదాన్ని వదిలివేయ గలుగుతాడు? లేక పోతే దేవున్ని వదులుకోవలసి వస్తుంది.

ఈరోజుల్లో కుడా ప్రతి క్రైస్తవుడు కుడా దేవుని మీద నమ్మకం అంటారు కాని లోక సంప్రాదాయాలు( సంస్కృతి కాదు, అది వేరు ), కట్టు బాట్లు, ముహూర్తాలు, ఎదురులు, శకునాలు, తాయిత్తులు, మంత్రాలు, ఎలా చాలా ఉన్నాయి వాటిని వదలడం లేదు, వాళ్లకు తెలియకుండానే దేవున్ని వదులుకుంటున్నారు, కాని దేవునిలోనే ఉన్నాము అనుకుంటున్నారు. దేవుని శక్తి పరిపూర్ణంగా చూడాలి అంటే పరిపుర్ణమయిన నమ్మకం ఆయనమీద పెట్టగలగాలి.  

 

క్రియలు లేని విశ్వాసం మృతము యాకోబు 2: 26

 

మీ కొరకు ప్రార్ధించు

అపోస్తులు నాని బాబు నెల్లి

990882316