మనకు సూర్యుని గురుంచి
చాలా విషయాలు తెలుసు కానీ ఇంకా తెలియాల్సిన వి కూడా చాలా ఉన్నాయి.
ఒకరోజు నేను ప్రార్ధన
చేస్తుంటే నా దృష్టిని దేవుడు సూర్యుని మీదకు తిప్పారు. సూర్యుని గురుంచి చాలా విషయాలు అలోసించను, అయిన నాకుదేవుడు చెప్పదలసిన విషయం నాకు రావడం లేదు. చాలా విషయాలు చదివాను. ఒకొక్కసారి లోతైన విషయాలు కాకుండా చాలా సాధారణ విషయాలతో
కూడా దేవుడు మనతో మాట్లాడతారు.
నేను సూర్యుని గురుంచి
ఎంత అలోసించిన నాకు లోటు గానే ఉంది. అప్పుడు సాధారణ విషయాలు అలోసించడం మొదలు పెట్టాను. అందులో ఒకటి సూర్యోదయం, సూర్యాస్తమయము. సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయించడం, కనిపించడం. భూమి సూర్యుని తట్టు ఉన్న బాగం మీద సూర్య కంటి పడుతుంది, కనపడుతుంది. మరో బాగం లో సూరీడు కనపించడు. అంటే సూర్యుడు లేడు అని కాదు కదా…. సూర్యుని వైపు మనం
లేము గనుక మనకు చీకటి.
అలాగే దేవుడు మనకు
కనిపించ నంత మాత్రాన ఆయన లేరు అని కాదు. ఒకటి మనం ఆయనకు మన
వెనుక చూపిస్తున్నాం కాబట్టి మనకు చీకటి కలుగుతుంది, అంటే శ్రమలు, కష్టాలు, వేదనలు, శోధనలు. అదే మనం ఆయన వైపు ఉంటే మనకు వెలుగు, అంటే ఆశీర్వాదం, సమయోచిత మయిన ఆలోచనలు, సందర్బాయోచిత మయిన సహాయం కలుగుతుంది. అంటే కానీ ఆయన లేనట్టు కాదు, మనలను విడచినట్టు కాదు.
రెండు, అధి దేవుడు పెట్టిన క్రమం. ఎలా అంటే మనకు చీకటి కలగడం అంటే శ్రమలు, వేదనలు కలగడం వలన మనం నిరీక్షణ ను, విశ్వాసాన్ని అల్వరచుకుంటాము. సూర్యుడు ఉదయించక పోతాడా అని.
దేవుని వైపు మనం తిరుగుదాము, ఆయన మనవైపు ఎల్లప్పుడూ చేతులు చాపి ఎదురు చూస్తున్నారు.
దేవుడు మిమ్మును దీవించును
గాక!
అపోస్తులు నెల్లి
నాని బాబు
9908823196
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి