ప్రతి వ్యక్తి లో ప్రత్యేకమయిన తలంతు ఉంటుంది.
ప్రత్యేక మయిన తలంతులు కలిగి ఉండటం అనేది దేవుని చిత్తము. ఒక మొదటి వ్యక్తి లో ఒక
ప్రత్యేక మయిన తలంతు తన చుట్టూ వలయంగా మనం చూడగలిగితే అతను 0 మాదిరి
కనిపిస్తున్నాడు. ఆదే విధమయిన తలంతులు ఆలోచనలు, క్రియలు కలిగిన వారు ఎంతమంది ఉన్న అది 0 గానే ఉంటుంది. అదే మరో ప్రత్యేకమయిన తలంతు, ఆలోచనలు,
క్రియలు కలిగిన వ్యక్తి తనకు తోడైతే 8
అవుతుంది. అంటే వారి ఐక్యత అనేక రెట్లు అవుతుంది. ఇద్దరి వేరు వేరు సామార్ధ్యాలు
ఒక గొప్ప పనిని చెయ్య గలుగుతాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక ప్రోడక్ట్ తయారు
చెయ్యగలడు, మరొక వ్యక్తి దానిని ప్రజలకు తెలివిగా అమ్మగలడు. వారిద్దరు ఒకటైతే ఒక మంచి లాబాలతో కూడిన ఒక కంపెనీ తయారు
అవుతుంది. కస్టపడి సంపాదించ గలిగే బర్త, తెలివిగా కుటుంబాన్ని నడపగల భార్య కలిస్తే
ఒక విలువైన కుటుంబం. అయితే వారి మధ్య
ఐక్యత ముక్యం.. అది లేకపోతే మరల వారు 0 లాగానే మిగిలి పోతారు. అది కుటుంబం అయిన
సరే, అన్నదమ్ములు అయిన సరే, సంఘం అయిన సరే, ఒక వ్యాపారం అయిన సరే..... అందుకే
వాక్యం చెపుతుంది సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరం ( కీర్తనలు
133 ).
ప్రబువు మీకు అట్టి ఆసీర్వాదం అనుగ్రహించును
గాక....
మీ సహోదరుడు ,
అపోస్తులు నాని బాబు నెల్లి