పరీక్ష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పరీక్ష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

పరీక్ష గదిలో




ఈరోజు ఉదయాన్నే ప్రార్థనలో మన తండ్రి నాకు నా డిగ్రీ కాలేజ్ లో పరీక్ష వ్రాస్తున్న సమయాన్ని గుర్తు చేశారు. నాకు కొంచెం ఆలోచనలో పడ్డాను. తండ్రి ఎప్పుడు అనవసరంగా గుర్తు చెయ్యరు దిని వెనుక ఎదో ఒక విషయం ఉంది, దానిని చెప్పాలి అనుకుంటున్నారు అని ధ్యానించడం మొదలు పెట్టాను.

 

కొంచెం సేపు ఆలోచనల తరువాత నా మధి మా పరీక్ష గదిలో ఉన్న ఇన్విజిలేటర్ వైపు వెళ్ళింది. ఆయన చాలా కట్టినంగ వ్యవహరించే వారు. అసలు అతు ఇటు కధలనిచ్చే వారు కాదు. ఇంకొంచెం అలోసిస్తే ఆ ఇన్విజిలేటర్ మాకు తెలియని వారు కాదు, గడచిన సంవత్సరం అంతా మాకు బోధించిన సారే

 

ఆయన సంవత్సరం అంతా బోధించి, మమ్ములను ఎంతగానో ప్రేమించి, బరించి, అర్ధం కాకపోతే మరల మరల అర్ధం అయ్యేవరకు వరకు చెప్పిన అధ్యాపకుడు. కానీ ఇప్పుడు ఆయన వేరే స్థానం లో ఉన్నారు. మేము పరీక్షలు వ్రాసేటప్పుడు ఆయన చెప్పినవన్నీ మేమే వ్రాయాలి. ఆయన ఇప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదు.

 

అలాగే దేవుడు బోధించినప్పడు, నేర్పించినప్పుడు మనం నేర్చుకోవాలి, శ్రమలలో ఆ బోధలు మనకు సహాయంగా ఉంటాయి. ఆయన మనలను చూస్తూ ఉంటారు. మనం ఏవిధంగా నడుస్తున్నాము, ఏవిధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నామో, ఆయన చెప్పిన మార్గం లో నడుస్తున్నాము లేనిది పరీక్షిస్తారు. ఇవన్నీ ముందుగానే మనకు బోధించారు కదా….

మనకు బోధించిన అధ్యాపకుడు మనంపరిక్ష కాలంలో మౌనాన్ని వహించినట్టే ఇయన మౌనాన్ని వహించి మనలను పరిశీలిస్తారు