క్రమ శిక్షణ


 

దేవుడు నాకు ఇద్దరు బిడ్డలను ఇచ్చారు. వారు దేవునిలో ఎదుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళు అప్పుడప్పుడు నేను వాడే కంప్యుటర్ వాడుతుంటారు. నేను నా లాప్టాప్ కి బ్లుటూత్ కీ బోర్డ్, మౌస్ వాడుతున్నాను. రెండు సంవత్సరాల క్రితం వాళ్లకు ఒక మాట చెప్పాను. ఏంటంటే ఎప్పుడైనా మీరు కంప్యుటర్ వాడటం అయిపోయాక  కీ బోర్డ్ మౌస్ స్విచ్ లు ఆఫ్ చెయ్యండి అని చెప్పాను. నేను అయిన అప్పుడప్పుడు మరచి పోతాను. నేను కంప్యుటర్ ఆన్ చేసి మౌస్, కీ బోర్డ్ పని చెయ్యడం లేదు ఏంటి అనుకుంటాను. కాని అంతకు ముందు నా పిల్లలు వాడి అఫ్ చేసి ఉంటారు. వాళ్ళు కంప్యూటర్ వాడినప్పుడు నాకు తెలిసి పోతుంది. అదే వాక్యం కుడా చెపుతుంది. బాలుడు నడువవలసిన మార్గం వాడికి నేర్పు అని. మనం మరి ఏమి చేస్తున్నాము. దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చారు అది ఒక మంచి పౌరిడిని, ఒక మంచి అన్నను, తమ్ముడిని, అక్కను, అమ్మను, చెల్లిని, స్నేహితురాలును, ఒక మంచి బర్తను, బార్యను తయారు చేయాల్సిన బాధ్యత. నీవు చిన్న నాటి నుండి వారిని ఎలా పెంచావో అలానే వారు పెద్ద వారు అయ్యాక ఉంటారు. వాళ్ళు ఎవరి మాట వినరు నీ మాట తప్ప. అలాంటిది నీవు ఏమి నేర్పిస్తున్నావు. రేపటికి, బవిష్యత్ కు ఆలోసించి వారిని సిద్ధం చెయ్యి.

 

సామెతలు 22:6; 23:13; 29:15; ఎపేసి 6:1 ; తప్పక చదవండి

 

ప్రభువు మిమ్మును మీ పిల్లలను దీవించును గాక.

 

మీ సహోదరుడు,

అపోస్తులు నాని బాబు నెల్లి 

కామెంట్‌లు లేవు: