దేవుని దగ్గర కోరికల చిట్టా పెడుతున్నావా? ఒకసారి ఇది చదువు






సోదోమ గోమేర్ర ల పాపం అధికం కావడం వలన ఆ ప్రాంతాలను పాప శిక్షకు అప్పగించడానికి దాని స్థితిని చూసి రావడానికి దేవుడు తన దూతలను పంపగా వారిని లోతు చేర్చుకున్నాడు. ఆదిత్యం ఇవ్వడం అలవాటుగా అబ్రహాము నుండి నేర్చుకోవడం వలన దేవుని దుతలకు ఆదిత్యాన్ని ఇచ్చాడు లోతు. ఆ రాత్రి ఆ పట్టణపు వారు లోతు ఇంటికి వచ్చిన వారిని బయటకు పంపమని గొడవచేయగా దేవుని కోపం ఆ దేశం మీద రేగింది. ఆ దూతలు లోతును తన కుటుంబాన్ని రక్షించాలని ఆసపడగా లోతు యొక్క అల్లుళ్ళు, కుమారులు తన మాట వినలేదు, కుమార్తెలను భార్యను తీసుకుని బయటకు తీసుకురాగ భార్య వెనుక తిరిగి ఉప్పు స్థంభం అయ్యింది. అయితే దేవుడు లోతు పట్ల ఒక ఉద్దేశ్యం కలిగి ఉండి కనపడుచున్న పర్వతానికి వెళ్ళమని చెపితే తను మాత్రం దగ్గరగా ఉంది కదా అని సోయరు కు వెళ్తానని అడుగుతాడు, దానిని దేవుడు అంగీకరించాడు. మనం కూడా దేవుని అడుగుచున్నప్పుడు అయన కాదనలేక అంగీకరిస్తాడు, కాని మనం ఎన్నుకున్నది దేవుడు మన కోసం దానికి చాల వత్యాసం ఉంటుంది. కొన్ని రోజులు లోతు అక్కడ నివాసం చేసాక అక్కడ అతనికి భయం వెంబడించింది, సోయారు కూడా సోదోమతో నాశనం కావలసింది కాని లోతు వాళ్ళ దానిని కాల్చలేదు, లోతు అక్కడ ఉండలేదు. మరల అక్కడ నుండి ముందు దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెల్లవలసి వచ్చింది. కాని అప్పుడు అక్కడ తన కుమార్తెలు పాపం లో పడిపోయారు. తన సంతానం సపగ్రస్తులయ్యారు. దేవుడు వెల్లమన్నపుడు వెళ్తే దేవుడు తనకోసం అక్కడ ఏమి సిద్ధపరిచాడో కదా... పాప భుయిష్టమయిన ప్రజల మధ్య పవిత్రతను కాపాడుకునిన పిల్లలు ఆ ప్రాంతములో పాపములో పడిపోయారు. ఒక్కసారి అలోసించు దేవుడు నీకొరకు నీకంటే ఎక్కువగా అలోసిస్తున్నారు, నీ భవిష్యత్తు గురుంచి  నీకంటే ఎక్కువగా అల్లోసిస్తున్నారు అయన. అందుకే నీ చిట్టా అయన దగ్గర పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించు. ఆయన చిత్తానికి లోబడితే అంతా మేలే జరుగుతుంది కొంచెం ఆలస్యం అయిన. దేవుడు చేయమనిన పనిని చేయ్యమన్నప్పుడే చెయ్యి ఇప్పుడు వేరే ఆలోచనలు ఆయనకు చెప్పి తరువాత మరల అక్కడికే రావలసి వస్తే మిగిలేది శూన్యం.

ప్రభువు చిత్తము నీయెడల నెరవేరును గాక..
మీ సహోదరుడు
అపోస్తులు నాని బాబు నెల్లి

మందిరానికి వెళ్తే ఏమి దొరుకుతుంది.?



ప్రియ సహోదరి సహోదరుడ,
 
మానవుడు తృప్తి లేని జీవి. ఎంత చేసిన, ఎంత అనుభవించిన, ఎంత సంపాదించినా, ఎన్ని సాధించినా, ఇంకా ఏదో కవాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో సంపాదించాలి అని తాపత్రయ పడుతూ సమదానం లేకుండా, తృప్తి లేకుండా జీవితాన్ని కొనసిగించేస్తున్నాడు. తృప్తి లేకుండా సమాధానం ఉండదు, సమాధానం లేకుండా సంతోషం ఉండదు, సంతోషం లేకుండా ఎన్ని ఉంటె ఉపయోగమేంటి? ఎన్ని సాధిస్తే మాత్రం ఏంటి? తృప్తి అనేది మనసులోనుండి కలిగేది. ఆత్మలో కలిగేది. అందుకే సర్వశక్తి కలిగిన దేవుని ఆలయముని గూర్చి దావీదు
  ఎలా పాడుతున్నాడు నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత  మేము తృప్తిపొందెదముకీర్తనలు 65:4 Psalms .  అందుకే క్రైస్తవుడు ఏమి ఉన్న లేకున్నా సంతోషం గా, ఆనందం గా బ్రతుగ గలుగుతున్నాడు. సంఘముగా చేసే స్తుతి ఆరాధన, దైవ సేవకుడు అందించే దైవ ఉపిరి అయిన వాక్యం, ఒకరి కొరకు చేసుకునే ప్రార్ధనా ఇంకా ఆత్మీయ సహవాసం ధనం, హోదా, బంధువులు ఇవ్వలేని అనుభూతులను మిగులుస్తు నీకు ఒక కొత్త అనుభవం కలుగ చేస్తాయి.  బీద లాజారు భిక్షమెత్తుకునే టప్పుడు కుడా సంతోషం గా ఉన్నాడు..... ఈరోజు ఆరధాన దినం, సంఘముగా దేవుని ఆరాదించే రోజు, మందిరపు మేలులతో నింపబడే రోజు... ఒకవేళ నీవు తృప్తి లేని జీవితాన్ని అనుబవిస్తున్నట్టు నీకు అని పిస్తే ఇరోజు తప్పనిసరిగా మందిరానికి వెళ్ళు...... సమస్త మనసులను పరిసోధించ గలిగిన పరమ తండ్రి నీకు సంతృప్తి ని ఇచ్చి నీకు సంతోషము, సమాధానము అనుగ్రహించును గాకా?
 
షలోం.
మీ కొరకు ప్రార్ధించే
అపొస్తులు నాని బాబు నెల్లి
 

source

మందిరానికి వెళ్ళకుండా వేసే సాతాను తంత్రం




ప్రియా సహోదరి సహోదరుడా, నీ హృదయం లో సాతాను  ఒక చేదు విత్తనం వేసి ఉంటాడు. ఎక్కడైనా దేవుడు ఉంటాడు. ఇంట్లో కూర్చుని ప్రార్ధన చేసుకున్న దేవుడు వింటాడు అని.  ఆలా ఎందుకు నీకు వాడు చెప్పాడో తెలుసా నిన్ను అసలు విషయం లో నుండి బయటకు లాగడానికి.  ఇంట్లో కూర్చుని ప్రార్ధించిన కొన్నాళ్ళకు మరల నీ దగ్గరకు వచ్చి ఎంత ప్రార్ధన చేస్తున్నావు , ఎంత భక్తి చేస్తున్నావు మరి నీ ప్రార్ధన దేవుడు వింటున్నాడా ? ప్రతిఫలం దక్కిందా? నీవు కోరుకున్నది నీకు దొరికిందా? అంటాడు. అప్పుడు అని పిస్తుంది నిజమే ఎంత ప్రార్ధన చేసినా  మారడం లేదు, ఎందుకొచ్చిన దేవుడు అని చేసే ప్రార్థనకు కూడా దూరం అయిపోతావ్. ఆల నిన్ను మెల్లగా లోకం లోకి, లోక అసలలోకి, లాగి తన పంజాలో నిన్ను చిత్తుచేసి చిత్తూ కాంగీతం ల మార్చేస్తాడు. అసలు వాడు మొదటి ప్రయాతం ఎందుకు చేస్తాడో తెలుసా వాక్యం ఒక మాట ఉంది. అది నీవు చదివి ఉండవు. కానీ మన శత్రువు అది చదివి ధ్యానం చేసి ఆ వాగ్దానమునకు నిన్ను దూరం చేస్తున్నాడు. 
కీర్తనలు18:6 Ps నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్ధన చేసితిని , అయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్ధన నంగీకరించెను. ఈ వచనం రెండు మూడు సార్లు చదువు నీకే అర్ధం అవుతుంది. సాతాను ఎక్కడైనా దేవుడు ఉన్నాడు అని నీకు ఎందుకు చెప్పాడో.నీవు మందిరానికి వెళ్తే ప్రార్ధన ఆలకించే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడేమో, అది నీవు పొందుకుంటే బలపడిపోతావేమో అని నిన్ను వెళ్లనివ్వడం లేదు. చదవడానికి చిన్నపిల్లల స్టోరీ లా ఉన్న ఇది వాక్య సత్యం.   అర్ధం అయితే బయలు దేరు ఈరోజు పరిశుద్ధ ఆరాధన దినం. ప్రభువు నీ ప్రార్ధన తన ఆలయంలో విని ప్రతిఫలం ఇచ్చును గాక!

షలొమ్. 
 
మీ కొరకు ప్రార్ధించే
 
అపోస్తులు నెల్లి నాని బాబు

మందిరానికి ఎందుకేల్లాలి?





ఒక సహోదరుడు న్యూస్ పేపర్ వారికి ఒక లేఖ వ్రాసాడు. అందులో తన ఆవేదనను వెళ్లగక్కుతూ " నేను 30 సంవత్సరాలుగా ఆరాధనకు మందిరానికి వెళ్తున్నాను, 3 వేల ప్రసంగాలు వినివుంటాను, కాని అందులో ఒక్క ప్రసంగం కూడా గుర్తు లేదు. నీను ఇప్పటివరకు సమయమంతా వ్రుదాపరచుకున్నాను, పాస్టర్ గారు తన సమయాన్ని కుడా ప్రసంగాలు సిద్ధపడటం లోను, ప్రసంగాలు చేయడానికి సమయాన్ని వృధా పరచుకుంటున్నారు. అందువల్ల మందిరానికి వెళ్ళడం ప్రయోజన కరం కాదు" అని వ్రాసాడు.  దానికి పత్రిక సంపాదకుడు తిరిగి ఒక ఉత్తరం వ్రాసాడు. నాకు వివాహం అయ్యి 30 సంవత్సరాలు అయ్యింది. నా భార్య నాకు ఇప్పటివరకు ౩౦ వేల పర్యాయాలు వంట చేసి పెట్టింది. కాని అందులో ఏవొక్కటి కూడా నేను ఇప్పుడు చెప్పలేను. కాని ఇరోజు నేను ఇలా ఆరోగ్యంగా, నా పని ని నేను చేసుకే శక్తీ కలిగి  ఉన్నాను అంటే తను నాకోసం చేసి పెట్టిన ఆహారమే కారణం. ఆ ఆహారం లేక పోతే నేను ఇరోజు ఉండే వాడిని కాదు, శారీరకంగా మరణించి ఉండేవాడిని. అని వ్రాస్తు  అలాగే నేను ప్రతి వారం వాక్యం వినక పోయిన యెడల నేను ఈరోజు ఆత్మీయంగా మరణించి ఉండేవాడిని. నీవు కుడా... అని తిరిగి జాబు పంపాడట.
అందుకే పరిశుద్ధాత్ముడు మన కొరకు ఒక వాక్యాన్ని వ్రాయించి ఉంచాడు. హెబ్రీ 10:24 కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినోకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చుపుటకును సత్కార్యములు చేయుటకును ఒకని నొకడు పురికోల్పవలేనని అలోచింతము. కొందరు మానెయ్యడం వలన ఆత్మీయ ఆహారం లేక ఆత్మీయ మరణం పొందుతున్నారు, దేవునికి, దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నారు. మీరైతే అలా కాక అన్నింటిలోను సంపుర్ణులు గా ఉండి, ఆత్మీయ ఆహారమును భుజిస్తూ ఆత్మీయ శక్తీ మంతులు అగుదురు గాక!

షలోమ్

మీకోరకు ప్రార్ధించే           
అపోస్తులు నెల్లి  నాని బాబు 



మందిరానికి ఎలా వెళ్ళాలి?







ఈరోజు మందిరానికి వెళ్ళడానికి సిద్ధ పడుతున్నారా? చాల మంచి పని చేస్తున్నారు. అయితే మందిరానికి ఎలా వెళ్ళాలి అనే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుడు నిలిచి ఉండు స్థలమునకు మనం వెళ్తున్నాము. ఇశ్రాయేలియులు ఐగుప్తు నుండి కానా యాత్రలో సైన్యములకు అధిపతి యగు యెహోవా వారితో ఉండుటకు ఒక పర్ణశాల కట్టమని మోషే కు ప్రభువు వారు సుసించారు. అయితే పర్ణశాల చుట్టూ ప్రాకారము తెరలతో కట్టబడింది. దానికి తూర్పుగా ప్రవేశ ద్వారము ఉంచబడింది. లోపలి వెళ్ళే ప్రవేశ ద్వారము కూడా వ్రేలాడుతున్న తెరలతో ఉంది. అయితే ద్వారానికి ప్రత్యేక ఏర్పాట్లు ఏమీలేవు కాని వ్రేలాడుతున్న తెరల గుండానే లోపలి వెళ్ళాలి. అయితే అలా వెళ్ళాలి అంటే ప్రతివారు వ్రేలాడుతున్న తెరను వంగుని తెరను లేపి వంగి వెళ్ళవలసి ఉండేది. అదే విధానం అందరికి, చిన్న, పెద్ద, ధనిక, పేద, బేధం లేదు. ఈరోజు నీవు వెళ్ళేది అయన నిలఛి ఉండే స్థలానికే, నీవు ధనికుడవు అయివుండవచ్చు, బిద వాడవు అయివుండవచ్చు, ఉద్యోగస్తుడవు అయివుండవచ్చు, నీవు ఎవరివైన పర్ణశాలలో దేవుని కలచుటకు దేవుడు నిర్ణయించిన మాదిరి దీనత్వం కలిగి, నీవు నిలిచి ఉండే స్థలము సర్వసృష్టి కథ నిలిచి ఉండే స్థలమని, ఆయన నీన్ను సృజించిన వాడని, నీకంటే అధికుడని, బలవంతుడని గమనించి జీవిస్తే నీకు దివేనకరముగా ఉంటుంది. సోలోమోను అంటాడు " నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రతగా చూచుకొనుము ప్రసంగి 5:1 "  అయన తన  సన్నిధిలో దీనులను లేవనేత్తువాడు, గర్విష్టులను అనగ ద్రొక్కు వాడు. మోషే దినత్వాన్ని కలిగి సాత్వికుడై ఉన్నాడు గనుకనే దేవుని చూడగలిగాడు. నీవును అటువంటి మనసు కలిగి దీవింప బడుధువు గాక!


 షలోమ్
మీకోరకు ప్రార్ధించే               
అపోస్తులు నెల్లి  నాని బాబు 


పచ్చిమ బెంగాల్ లో ఆచారం



తిరిగి మిమ్ములను కలచుటకు దేవుడు చూపిన కృపను బట్టి ఆయనకే మహిమ. నేను, నా భార్య గతించిన వారం పశ్చిమ బెంగాల్ పరిచర్య నిమిత్తము వెళ్ళాము. అక్కడ నా తమ్ముడు సేవ చేయుచున్నాడు. అక్కడ నేను గమనించిన ఒక విషయం నన్ను బాగా ఆకర్షించింది. అక్క ఉన్న స్నేహితులు వారి  స్నేహితులకు ఎక్కువ బహుమానాలు ఇచ్చుకుంటూ ఉంటారు. సంధర్బం అవ్వని కానియి, స్నేహితుని ఇంట్లో ఏదైనా కొరత ఉంది అంటే ఎవరో ఒక స్నేహితుడు ఆ కొరత తిరిస్తూ ఉంటారు. అయితే తీసుకున్న వారు కుడా ఏదో ఒకటి వారికి బహామానం ఇస్తూ ఉంటారు. మాకు కూడా బహుమానాలు ఇచ్చారు. మేము కుడా వారికి వచేటప్పుడు ఇచ్చి వచ్చాము. ఇలాంటి  సందర్భములో ఒక ఉన్నత మయిన బహుమానాన్ని గుర్తు కు వచ్చింది... మన సృష్టి కర్త అయిన దేవుడు, ఎల్-షద్దాయి యోహాను3:16 లో ఒక విలువయిన బహుమానము ఇచ్చినట్లు ఉంది. అదేంటో తెలుసా? తన కుమారున్నే నా కొరకు నీ కొరకు భాహుమనంగా ఇచ్చేసారు.....  అయన మన కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు.... సిలువ వెయ బడ్డాడు.. నిన్ను నన్ను పరిశుద్దున్ని చేసారు... అయితే బహుమానమునకు ప్రతి బహుమానము మనము ఇవ్వాలి కదా,... ఆయనకు మనం ఇచ్చే బహుమానము మన హృదయము.... వెండి బంగారము అడగలేదు నీ హృదయము ను మాత్రమే అయన కోరుకుంటున్నాడు. ఇచ్చి పుచ్చుకోవడం లో ఉన్న ఆనదం మరి దేనిలో మనం పొందలేము. ఇక్కడ మనం పొందే ఆనందం రక్షనానంధం. అటువంటి రక్షణ ఆనందముతో ప్రభువు నిన్ను దీవించును గాక !

షలోమ్,

మీకొరకుప్రార్ధించే
అపోస్తులునెల్లినానిబాబు


ఎమీ వింటున్నావు?



ఒక రోజుఇద్దరు వృద్ధులు మాట్లాడుకుంటున్నారు. మందిరానికి వెళ్ళడం అనవసరం పాస్టర్ గారు అసలు వాక్యం సరిగా చెప్పడం లేదు, సమయమంత వృధ అవుతుంది అని ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. అయితే ఇంతలో మద్యలో వీరి మాటలు వింటున్న ఒక యోవనస్తుడు కలుగ చేసుకుని " అసలు మందిరానికి వెళ్లి దేవుని మాటలు వినడం మానేసి పాస్టర్ గారి మాటలు ఎందుకు వింటున్నారు" అన్నాడు అంట. మందిరం లో సేవకుడు మాట్లాడే మాట తనదిగా కాకుండా దేవుని నుండి వచ్చింది అని వింటే అందులో నీకు ఉపయోగకరమైన మాటలు, ఆత్మీయ అభివృద్ధికి శ్రేష్టమైన మాటలు, నీకు వినపడతాయి. సముయేలు, ఏలి మందిరంలో పడుకుని ఉన్నారు. సముయేలు దేవుని స్వరమును వినగాలిగాడు. మరి నీవు ఏలి స్వరమును కాదు దేవుని స్వరమును వినుటకు సిద్ధముగా ఉండు. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని స్వరమును నీవు విందువు గాక. అది నీకు జీవహరముగా ఉందును గాక.,,

షలోమ్

మీ కొరకు ప్రార్ధించే.
అపోస్తులు నాని బాబు నెల్లి


source

దేవునికి ఇచ్చి దివించబడిన కుటుంబం





ఒక సహోదరుడు తన కష్టార్జితాన్ని వ్యయపరచి మందిరం కొరకు ఒక జనరేటర్ కొన్నాడు. అది కొన్నప్ప్పుడు చాలా మంది వెనకకు లాగాలని ప్రయత్నించారు. కొంతమంది పాస్టర్ గారికే ఇస్తున్నవా? అది పాస్టర్ వాడుకుంటాడు అని చాల విధాలుగా నిధించడం, డబ్బులు చెల్లడం లేదా? అని తిట్టడం చేసారు. కాని ఆ  యోవనస్తుడు మాత్రం వెనకకు తిరగలేదు, నేను దేవునికి ఇవ్వాలనుకున్న, ఇస్తాను, దానిని క్రొత్త మందిరం దగ్గర పెట్టడానికి సరియయిన వసతులు లేక సేవకుని ఇంటిదగ్గర పాత మందిరం ఆఫీస్ దగ్గరే ఉంచి వాడుతున్నారు. అది సేవకుడు వాడుకున్న నాకు సంతోషమే, సేవకుడు దేవుని ప్రతినిధి అని సమర్దించుకుని విశ్వాసంతో ఉండేవాడు.  తను జెనరేటర్ కొన్న 628 రోజులకు దేవుడు తన జీవితంలో ఒక గొప్ప కార్యం చేసారు. తన కంటే ధనవంతులు, అధికులు పొటి పడినా, వారికి లేని ఒక గొప్ప అవకాసం ప్రభువు ఇచ్చారు. తాను సొంతంగా ఒక కొత్త క్రేన్ కొనుకోడానికి అందరికంటే ముందు దానిని పొందడానికి ప్రభువు మార్గాన్ని సుగమం చేసారు. తన స్నేహితులకంటే, బంధువుల కంటే, దేవునికి ఇచ్చేటప్పుడు హేళన చేసిన వారికంటే ఉన్నత స్థితిని ప్రభువు తనకు ఇచ్చారని ప్రభువును స్తుతించాడు సహోదరుడు. అపోస్తులుడు అయిన పౌలు తిమోతి తో అంటాడు, దేవుడు వెక్కిరింప బడడు, మషుడు ఏమివిత్తునో అదే పంట కోయును. సహోదరుడు విత్తిన విత్తనం మొలకెత్తి, ఫలించి తను పెట్టిన ఖర్చుకు 45 రెట్లు ప్రతిఫలాన్ని ప్రభువు ఇచ్చారు. ఈరోజు నేను కూడా అల దీవింప బడాలని ఆశా ఉంటె తనవలె దేవుని కోసరం, దేవుని పని కోసం సణుగుడు లేకుండా, బలవంతం కాకుండా విత్తడం నేర్చుకో, విత్తని వానికి పంట కోసే హక్కు లేదు. ప్రభువు నిన్ను దివించును గాక?  దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో సర్వసమృద్ధి గల వారై ఉత్తమమయిన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు; 2 కొరింది 9:7, 8

షలోమ్
మీకోరకు ప్రార్ధించే           
అపోస్తులు నెల్లి  నాని బాబు 

నీ భవిష్యత్తు శూన్యం అనుకుంటున్నావా ?






నీ జీవతం లో ఎదురయ్యే సమస్యలను చూసి భయపడుతున్నావా? రాబోయే ఆర్ధిక ఇబ్బందులను బట్టి చింతుస్తున్నావా? రాబోయే రోజుల్లో ఎలా బ్రతకాలి? ఎలా జీవనాన్ని కొనసాగించాలి? మారుతున్న సమాజంలో ఎలా పోటి పడగలము? ఆర్ధిక పరమైన సమస్యలు ఎలా ఎదుర్కొన గలము ? మనకు ఎవరు సహాయం చేస్తారు అని దిగులు పడుతుంటే ఈ వాక్య భాగం నీకోసమే. ఇశ్రాయేలు దేశంలో దేవుని ఉగ్రత వలన గొప్ప కరువు ఏర్పడింది. అయితే దేవుడు పిలచుకున్న దైవ జనుని కొరకు ప్రభువు కొంత కాలం కాకులతో భోజనం పంపించారు. తరువాత తనను పోచించడానికి ఒక వెధవరాలను ఎన్నుకుని తన యొద్దకు సేవకున్ని పంపుతారు  ప్రభువు. సారేపతు గ్రామంలోకి రాగానే ఆమె పుల్లలు ఏరుకుంటూ కనపడింది. ఆమెను నీళ్ళు అడిగి, తేవడానికి వెళ్ళిన ఆవిడతో తినడానికి రొట్టె ముక్కను తెమ్మని చెపుతాడు దైవ జనుడైన ఏలియ. ఆమె తనదగ్గర పట్టెడు పిండి, కొంచెం నునే మాత్రమె ఉన్నాయి, వాటిని తిని చనిపోదాము అనుకుంటున్నాము నేను నా బిడ్డ అంటూ తన బాధను, భవిష్యత్తు లేదు నాకు, అంటూ నిరాశతో, మరణానికి దగ్గరగా ఉన్నాము అని బాధగా నిట్టూర్పుతో చెప్పింది. అయితే ఎలియ రెండు అప్పాలు అయ్యేదానిని ౩ అప్పాలుగా చేసి మొదట రొట్టెను నాకు ఇవ్వు అన్నాడు. ఆమె దైవ సేవకునికి లోబడి మొదటి అప్పమును ఎలియకు ఇచ్చింది, ఇక ఆ ఇంటిలో పండుగ, సమృద్ధి, దీవెన, మొదలయ్యింది. ఆ తోట్టేలోని పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనే తరిగిపోలేదు మరల వర్షం వచ్చి, పంటలు పండేవరకు ఆ ఇంటివారు బంధువులు అందరు సమ్రుది గా తిని పోషింప బడ్డారు. ఈరోజు నా దగ్గర ఏమిఉంది అని అనుకోకు, నీ దగ్గర ఉన్న చిన్న వాటిలో కూడా నమ్మకముగా ఉండటం మొదలు పెట్టు.... దేవునికి ఇవ్వడం ప్రారంబించు, అది నీకు ఉన్నదానిలోనే దేవుని సన్నిధిలో విత్తడం ప్రారంబించు. అది రెట్టింపు అయ్యి, తగిన సమయం లో నీ ముందు నిలిచి ఉంటుంది. ఆ కుటుంభాన్ని పోషించడానికి కాదు దేవుడు సేవకున్ని అక్కడకు పంపింది, సేవకున్ని పోషించుట ద్వారా వారు పోషింప బడటానికి దేవుడు సేవకున్ని పంపించాడు. ఈరోజు సేవకుల మీద స్వార్ధపడే విశ్వాసులు, ప్రజలు ఎక్కువ గా కనపడుతున్నారు. సేవకున్ని పోషించడం మొదలు పెడితే నీవు నీ కుటుంభము ఉన్నత రీతోలో పోషింప బడతారు. మిగుల సంపదను నీకు అనుగ్రహిస్తాడు. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే రోమ 11:16,  మీ కుటుంబములకు ఆశీర్వాదము కులునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికియ్యవలెను. యెహేజ్కెలు 44: 31. సారేపతి లోని కుటుంభము వలె మీరును పోషింపబడుదురు గాక!  

 షలోమ్
మీకోరకు ప్రార్ధించే               
అపోస్తులు నెల్లి  నాని బాబు 



దేవుని కోసం ఏదైనా చెయ్యాలి అనిపిస్తుందా ? అయితే అదృష్ట వంతుడవు






దేవుడు నిన్ను ఏమైనా ఇమ్మన్నడా? అయితే అయితే ఆలస్యం చెయ్యకు ఎందుకో తెలుసా అందులో దేవుడు నీకు ఏదో మేలు దాచి పెట్టి ఉంటాడు. ఇమ్మన్న దేవుడు ఇచ్చుటకు శక్తీ ని ఇస్తాడు అయితే ఆ అవకాశాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తావా? నీ కోసం ఉపయోగించుకుంటావా?  ఉదాహరణకు అబ్రహమును జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన ఏకైక  కుమారున్ని , ముసలి తనంలో పుట్టిన కుమారున్ని ఆయనకు బలిగా ఇమ్మన్నాడు. అయితే అబ్రహాము ఏమి అలోసించలేదు . నేను ముసలివాడను నాకు మరల పిల్లలు పుడతారా? దేవునికి ఇచ్చేస్తే మరల నాకు పిల్లలు ఇస్తాడా దేవుడు? ఇలా ఏవిధమైన ఆలోచనలు చెయ్యలేదు వెంటనే కట్టెలు కొట్టుకున్నాడు, గాడిదలను సిద్ధ పరచుకున్నాడు, కుమారున్ని తీసుకుని బయలు దేరాడు. మోరియ పర్వతం ఎక్కారు, బలిపీఠం సిద్ధం చేసాడు, కుమారున్ని చేతులు కాళ్ళు కట్టాడు, బలిపీఠం మీద పరుండ బెట్టాడు, కత్తి తిసి పొడవబోయాడు..... అంతవరకు దేవుడు ఒక్క మాట మాట్లాడలేదు, అబ్రహాము బలి ఇవ్వడం తప్ప ఏవిధమైన ఆలోచన చెయ్యలేదు .  అబ్రహాము హృదయం విశ్వాసపు అలలతో నిండి పోయి ఉంటుంది. కత్తి ఎత్తిన అబ్రహాము చెయ్యిని ఆఖరి క్షణంలో పట్టుకున్నాడు...  నీకు నేనంటే భయం అని నాకు తెలిసింది. నీ కుమారున్ని తీసుకుని వెళ్లి వానిని గొప్ప జనముగా చేస్తాను అన్నాడు... కుదరదు అన్నాడు అబ్రహాము .... అప్పుడు దేవుడు అభ్రహము కన్నులను తెరవగా పొదలలో చిక్కుకున్న ఒక పొట్టేలు కనిపించింది. గమించండి అప్పటికే అ పోట్టేలును దేవుడు సిద్ధ పరచి ఉంచాడు. అయితే విశ్వాసాన్ని, భక్తిని పరీక్షించడానికి దానిని మరుగు పరచి ఉంచాడు... ఈరోజు నీకు కూడా ఏదో కనిపించని, మరుగైన ఆసిర్వాదాన్ని దాచి ఉంచాడు. మరి అబ్రహాము వాలే దేవునికి ఇవ్వడానికి ముందుకు రాగలవా? అబ్రాహము తనకిష్టమైన కుమారుడిని ఇచ్చాడు? మరి నివ్వు..... ఇచ్చుటలోనే దేవునిపై నీ భక్తి, భయం, ప్రేమా వ్యక్తమవుతాయి. ప్రభువు నీవు ఇచ్చిన కొలది నురింతలు దీవెనలు నీ కుటుంబంలో కుమ్మరించును గాకా!  వేదజల్లి అభివృధి పొందువారు గలరు,.... ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. సామెతలు 11: 24, 25; 


షలోమ్

మీకోరకు ప్రార్ధించే  

అపోస్తలు నాని బాబు నెల్లి 

source

అసలు బంగారం దేనికి ?





చాల మందికి ఒక ధర్మ సందేహం ఉంటుంది. అసలు బంగారు ఆబరణాలు ధరించవచ్చా లేదా అని. అసలు వాక్యం బంగారం గురుంచి ఏమి చెపుతుంది అనేది, ఒకసారి చూద్దాం. ఆదికాండము లో మొదటి ప్రస్తావన ఉంది. మొదటి నది ఫిషోను ప్రవహించు స్తలమంతటిలోబంగారము ఉంది అని వ్రాసారు. అంటే  అది భూమిలోపల ఉంది. భూమిని సృజించినప్పుడు దేవుడు సమస్త లోహాన్ని మానవునికి అవసరమైనంత ఉంచారు. బైబిలే లో బంగారం గురుంచి 417 పర్యాయాలు వ్రాయబడింది. బైబిల్ లో బంగారం ను మారక ద్రవ్యంగా మాత్రమే వాడారు. ప్రతి రోజు వెండితో మారకాలుచేసుకుంటే, బంగారం ను వెండి కంటే 20 రెట్లు ఎక్కువ విలువగా పరిగణించే వారు. ధనం అంటే బంగారం మరియు వెండి మాత్రమే. బంగారం, వెండి మారకానికే ఇవ్వబడింది కాని మరి దేనికాదు.  ధనం మన నియంత్రణలో ఉండాలి కాని మనం దాని నియంత్రణలోకి వెళ్ళకూడదు. 1 తిమోతి 6:10 లో చెప్పినట్లు ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. నేను నా పిల్లలతో బంగారాన్ని త్రోక్కిస్తాను కారణం వాళ్ళకు దానిమీద వ్యమోయం రాకుడదని. పరలోకం లో కాళ్ళకింద ఉండే బంగారం ఈరోజు మన శరీరాలు మీద ఉండటం హాస్యాస్పదం కాదా... gold is meant only for trading not for anything else. How silly it is, the pure gold will be under our feet in heaven, but now we are wearing as jewelry and posing.  

దేవుడు మిమ్మును విస్తారమైన బంగారముతోను, వెండితోను దివించును గాక!


అపోస్తులు నాని బాబు నెల్లి.



విడాకులు తీసుకున్న 99 సం| ల దంపతులు ?




నమ్మకత్వం 

ఈరోజుల్లో మానవుని లో బాగా కరువైపోతుంది నమ్మకత్వం. అదువల్లె ఏ చిన్న విషయానికైనా  నోట్ లు, కాల్ రికార్డింగ్ లు, వీడియో లు, ఇద్దరు ముగ్గురు సాక్షులు కావలసి వస్తుంది. ఇంకా ఆలోచిస్తే కుటుంబాలలో కూడా ఇది కరువైపోతుంది. ఒక విచిత్రమైన సంగటన మీకు చెపుతాను. మునిమనవల్లను ఎత్తుకుని కాలక్షేపంగా సమయాన్ని గడపాల్సిన 99, 96 సంవత్సరాల ఇటలి  వృద్ధ దంపతులు అంటోనియో సి., రోసా సి. కోర్టు మెట్లు ఎక్కారు. ఎందుకో తెలుసా? 1940 లో బార్య కలిగిన అక్రమసంబంధం గురుంచి తెలిసి పెళ్ళైన 77 సంవత్సారాల తరువాత విడాకులు తీసుకుని ప్రపంచం లోనే విడాకులుతీసుకున్న వృద్ధ దంపతులుగా నమోదయ్యారు. నమ్మకత్వం అనేది చాలవిలువైన లక్షణం, అది కొనలేము, పొందుకోవాలి, కాపాడుకోవాలి. ఒక్కసారి కోల్పోతే మరల దానిని పొందుకోవడం అసంభవం. నమ్మకాలు కోల్పోయిన బార్య భర్తల మధ్య ఉండేది ప్రేమ కాదు నటనా జీవితం. ప్రతి మాట, ప్రతి క్రియ ఒక నటనే.... ఒకసారి అలోసించండి, మీ జీవితాకాలం మీరిద్దరే కలసి బ్రతకాలి, ఒకే ఇంట్లో,ఒకే గదిలో, ఒకే బోజన గదిలో కలసి సచ్చేవరకు ఉండాలి, కలసి ప్రయాణాలు, కలసి నిర్ణయాలు తీసుకోవాలి, కుదురుతుందా ఇదంతా నటనతో?  నమ్మకత్వాన్ని కోల్పోయే ఏవిధమైన క్రియ అయిన దాయ బడదు ఒక రోజు నీముందు నిలబడుతుంది. లూకా 8:17 తేట పరచబడని రహస్యమేదియు లేదు; తెలియజేయబడకయు బయలు పడకయు నుండు మరుగైనదేదియు లేదు. అప్పుడు నీవు తల ఎత్తుకుని నిలబదగలవా? దానికి ప్రతిఫలం పొందే సమయం లో నీవు ఒర్వగలవా? అవమానము సహించగలవా? అందుకే వాక్యం చెపుతుంది. మరణము వరకు నమ్మకముగా ఉండుము. ప్రకటన 2:10.., నమ్మకమయిన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28:20. అయన వెక్కిరింప బడడు. ఆయనే నీకు ప్రతిఫలము ఇస్తారు. నిజమైన ప్రేమను పొందుకుని ఆనదంగా మీరు మీ కుటుంభం ఉండును గాక!


షలోమ్



మీకోరకు ప్రార్ధించే           
అపోస్తులు నెల్లి  నాని బాబు 


మరణం తరువాత మనతో ఏమీ వస్తుందో తెలుసా?






అందరం అనుకుంటూ ఉంటాం మనం ఎంత సంపాదించినా చనిపోయాక అన్నింటిని వదిలి వెళ్లిపోవాలి అని. అందుకు ఎందుకు సంపాదించుకోవడం అనుకుని నిరాశ పడుతుంటాం. కాని వాక్యం చెపుతున్నది ఏంటి అంటే. నిన్ను ఇలోకం లో ఉన్నవాటిని సంపాదించు కోవద్దు అని ఏనాడూ చెప్పలేదు. భాగ్యం సంపాదించు కొనుటకై మీకు సామార్ధ్యము కలుగ జేయువాడు ఆయనే ( ద్వితి 8:18 ) అని వాక్యం చెపుతుంది. ఇలోకం లో మనలను ధనవంతులుగా చూడాలని మన తండ్రి కోరిక. అయితే మరో మాటలో " మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు ( మత్తయి 6:24 ) " అని, ఇదియు గాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దురుట సులభమని మీతో చెప్పుచున్నాను ( మత్తయి 19:24 ) అని ధనముకు వ్యతిరేకముగా మాట్లాడినట్లు మనకు కనపడుతుంది. భాగ్యం ఇచ్చి పరలోకానికి దూరం చెయ్యడం దేవుని ప్రణాలికా? ఇక్కడ బాగా అర్ధం చేసుకోగలిగితే నీకు భాగ్యం యిస్తారు అయన కాని నీవు దానికి బానిసావు కాకుండా అదే నీకు భానిసగా ఉండాలి అని అయన ఉద్దేశ్యం. ఒకవేళ నీవే దానికి బానిసవు అయితే నీవు పరలోకానికి వెళ్ళలేవు అని అయన హెచ్చరిక. ఎలా? చనిపోయినప్పుడు ఇదేమి రాదు కాదా అనుకుంటున్నాము మనం. కాని దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం తో నీవు ఏమేమి చేసావో అవన్నీ, నీ క్రియలు నీ వెంట వస్తాయి అని వాక్యం చెప్పుతుంది.( ప్రకటన 14:13 ). ఉదాహరనకు ఫోన్ కొనుకోడానికి దేవుడు సమార్ధ్యాన్ని ఇచ్చారు, నీవు చని పోయాక ఫోన్ ఇక్కడే ఉండిపోతుంది, కాని ఫోన్ తో నీవేమి చేసావో అది వస్తుంది. అందుకే జాగ్రత్త నిధగ్గరకు ధనం వచ్చినప్పుడు దాన్ని నీ బానిసగా చేసుకో, అది చేయ్యమన్నట్టు నీవు చెయ్యకు.

ప్రభువు నీకు విస్తారమైన ధన సమృద్ధిని అనుగ్రహించును గాక!

మీ సహోదరుడు

అపోస్తులు నాని బాబు నెల్లి

మెలకువగా ఉండుడి అంటే ?


 మెలకువగా ఉండుడి అంటే ?




మత్తయి 26:41 లో యేసువారు " మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్ధన చేయుడి" అని హెచ్చరించారు. మనం శోధనలో. శ్రమలో పడకుండా చేసేది ప్రార్ధన, అయితే ఆ ప్రార్ధన మెలకువగా ఉండి చెయ్యాలని ప్రభువు హెచ్చరిస్తున్నారు. యేసువారు రాత్రంతా ప్రార్ధించే వారు, వేకవునే లేచి ప్రార్ధించే వారు. దావీదు కూడా ప్రార్దనపరుడే. ఇంకా చాలా మంది ప్రార్ధన పరులు బైబిల్ లో ఉన్నారు. అయితే ప్రార్ధించిన గాని చాల మంది శోధనలో పడిపోయారు. ఉదాహరణకు దావీదు. అల మనం శోధనలో ప్రవేశించ కూడదు అనే యేసు వారు మెలకువగా ఉండి ప్రార్ధించాలని ప్రభువు సూచిస్తున్నారు. మెలకువగా ఉండటం అంటే నిద్ర పోకుండా ఉండటం మాత్రం కాదు. మెలకువ అంటే - కొన్ని ప్రాంతాలలో నిద్ర పోతుంటే వారు తెలివి లోకి రాలేదు అంటుంటారు. మెలకువ అంటే తెలివిగా ఉండటము. సాతనుడు పన్నే పన్నాగాలను పసిగట్ట గలిగే తెలివిని కలిగి ఉండటం. అప్పుడు మాత్రమే శోధనను జయించగాలవు. అట్టి కృప ప్రభువు నీకు దయ చేయును గాక.

మీరు తెలివితో జీవించాలని ప్రార్ధిస్తూ,

మీ సహోదరుడు,
అపోస్తులు నాని బాబు.


జీవజల నది






యేహెజ్కేలు 47 వ అధ్యాయం లో ఒక నది ఉన్నది. ఆ నది ప్రవహించే చోటల్ల 4 విషయాలు జరుగుతున్నాయి. మొదటిది జీవం కలుగుతుంది, రెండవది ఆహారము మూడవది ఆరోగ్యము నాల్గవది ఆశీర్వాదం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవన్నీ అవసరమే కదా! అయితే ఆ నది ఎక్కడి నుండి ప్రవహిస్తుందో తెలుసా మొదటి వచనం లో చదివితే అది మందిరపు గవిని నుండి ప్రవహిస్తున్నట్లు తెలుస్తుంది. నీకు పై ఆసిర్వధాలు కావాలంటే మందిరమునుండి ప్రవహించే జీవ వాక్యమును నీ జీవితం లో ప్రవహించనివ్వాలి. సమరయ స్త్రీ ఆ నీటిని ఆస్వాదించింది కాబట్టి రోత జీవితం మారి  గొప్ప సాక్తిగా మారింది. మరి నీవు మందిరానికి వెళ్తావా? వెళ్లి దీవెనలు పొంధగాలవా? అయితే ఇంకెందుకు ఆలస్యం... ప్రభువు మందిరం లోని పైన ఉన్న దివేనలతో నింపును గాక! 

షలోమ్

మీకోరకు ప్రార్ధించే
              


source

మొదటి వారు కడపటి వారు




The Word Today 

మొదటి వారు కడపటి వారు

పరిశుద్ధ గ్రంధంలో దేవునికి అర్పణ ఇవ్వడం అంటూ మొదలు పెట్టినవాడు కయిను. తన సంపాదనలో బాగం దేవునికి ఇవ్వాలని  కయిను ను చూసి హేబెలు నేర్చుకున్నాడు. కాని హేబెలు దేవుని యెద్ద నుండి మొదట పొండుకున్నవాడు గా గుర్తింపు పొందుకున్నాడు. చాలా మంది కార్యక్రమాలు మొదలు పెడతారు కాని దాని అంతాన్ని చూడలేని వారుగా ఉంటారు. నిన్ను చూసి నేర్చు కున్నవారు నీ కంటే ఉన్నత స్థితిని పొందుకుట్టున్నారు. కారణం ఏమిటంటే చేసే పని పట్ల నిమగ్నత లేకపోవడం, అవగాహన లేకుండా చెయ్యడం. కయిను కూడా అలానే చేసాడు, కాని హేబెలు చేసే పని పట్ల శ్రద్ధ, అవగాహన తో చెయ్య గలిగాడు అందువల్ల దేవుని దృష్టిలో మంచి వానిగా గుర్తిపు పొంద గలిగాడు. నేను ముందుగా చేయాలి అనే తపన తో పాటు శ్రద్ధ, అవగాహన, ఆలోచన తో చెయ్యగలిగితే ఫలితం తప్పక దక్కుతుంది. ముందు వచ్చినప్పటికీ కయిను చివరి వాడు అయ్యాడు. వెనుక వచ్చినప్పటికీ హేబెలు మొదటి వాడు అయ్యాడు. మొదటి వానిగానే నీవు ఉండి మొదటి ఫలితం పొందాలని ఆశిస్తూ ...

మీ సహోదరుడు,
అపోస్తులు నాని బాబు నెల్లి.