ఒక సహోదరుడు న్యూస్ పేపర్ వారికి ఒక లేఖ వ్రాసాడు. అందులో
తన ఆవేదనను వెళ్లగక్కుతూ " నేను 30 సంవత్సరాలుగా ఆరాధనకు
మందిరానికి వెళ్తున్నాను, 3 వేల ప్రసంగాలు వినివుంటాను,
కాని అందులో ఒక్క ప్రసంగం కూడా గుర్తు లేదు. నీను ఇప్పటివరకు
సమయమంతా వ్రుదాపరచుకున్నాను, పాస్టర్ గారు తన సమయాన్ని
కుడా ప్రసంగాలు సిద్ధపడటం లోను, ప్రసంగాలు చేయడానికి
సమయాన్ని వృధా పరచుకుంటున్నారు. అందువల్ల మందిరానికి వెళ్ళడం ప్రయోజన కరం
కాదు" అని వ్రాసాడు. దానికి పత్రిక సంపాదకుడు తిరిగి ఒక ఉత్తరం వ్రాసాడు.
నాకు వివాహం అయ్యి 30 సంవత్సరాలు అయ్యింది. నా భార్య నాకు
ఇప్పటివరకు ౩౦ వేల పర్యాయాలు వంట చేసి పెట్టింది. కాని అందులో ఏవొక్కటి కూడా నేను
ఇప్పుడు చెప్పలేను. కాని ఇరోజు నేను ఇలా ఆరోగ్యంగా, నా
పని ని నేను చేసుకే శక్తీ కలిగి ఉన్నాను అంటే తను నాకోసం చేసి
పెట్టిన ఆహారమే కారణం. ఆ ఆహారం లేక పోతే నేను ఇరోజు ఉండే వాడిని కాదు, శారీరకంగా మరణించి ఉండేవాడిని. అని వ్రాస్తు అలాగే నేను ప్రతి వారం వాక్యం వినక పోయిన యెడల నేను ఈరోజు ఆత్మీయంగా
మరణించి ఉండేవాడిని. నీవు కుడా... అని తిరిగి జాబు పంపాడట.
అందుకే పరిశుద్ధాత్ముడు మన కొరకు ఒక వాక్యాన్ని వ్రాయించి
ఉంచాడు. హెబ్రీ 10:24 కొందరు
మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినోకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట
మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ
చుపుటకును సత్కార్యములు చేయుటకును ఒకని నొకడు పురికోల్పవలేనని అలోచింతము. కొందరు
మానెయ్యడం వలన ఆత్మీయ ఆహారం లేక ఆత్మీయ మరణం పొందుతున్నారు, దేవునికి, దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నారు.
మీరైతే అలా కాక అన్నింటిలోను సంపుర్ణులు గా ఉండి, ఆత్మీయ
ఆహారమును భుజిస్తూ ఆత్మీయ శక్తీ మంతులు అగుదురు గాక!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి