ప్రియా సహోదరి సహోదరుడా, నీ హృదయం లో సాతాను ఒక చేదు విత్తనం వేసి
ఉంటాడు. ఎక్కడైనా దేవుడు ఉంటాడు. ఇంట్లో కూర్చుని ప్రార్ధన చేసుకున్న దేవుడు
వింటాడు అని. ఆలా ఎందుకు నీకు వాడు చెప్పాడో తెలుసా నిన్ను అసలు
విషయం లో నుండి బయటకు లాగడానికి. ఇంట్లో కూర్చుని ప్రార్ధించిన కొన్నాళ్ళకు మరల నీ
దగ్గరకు వచ్చి ఎంత ప్రార్ధన చేస్తున్నావు , ఎంత భక్తి చేస్తున్నావు మరి నీ
ప్రార్ధన దేవుడు వింటున్నాడా ? ప్రతిఫలం దక్కిందా?
నీవు కోరుకున్నది నీకు దొరికిందా? అంటాడు.
అప్పుడు అని పిస్తుంది నిజమే ఎంత ప్రార్ధన చేసినా మారడం లేదు, ఎందుకొచ్చిన దేవుడు అని చేసే
ప్రార్థనకు కూడా దూరం అయిపోతావ్. ఆల నిన్ను మెల్లగా లోకం లోకి, లోక అసలలోకి, లాగి తన పంజాలో నిన్ను
చిత్తుచేసి చిత్తూ కాంగీతం ల మార్చేస్తాడు. అసలు వాడు మొదటి ప్రయాతం ఎందుకు
చేస్తాడో తెలుసా వాక్యం ఒక మాట ఉంది. అది నీవు చదివి ఉండవు. కానీ మన శత్రువు అది
చదివి ధ్యానం చేసి ఆ వాగ్దానమునకు నిన్ను దూరం చేస్తున్నాడు.
కీర్తనలు18:6 Ps నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్ధన చేసితిని , అయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్ధన నంగీకరించెను. ఈ వచనం రెండు మూడు సార్లు చదువు నీకే అర్ధం
అవుతుంది. సాతాను ఎక్కడైనా దేవుడు ఉన్నాడు అని నీకు ఎందుకు చెప్పాడో.నీవు
మందిరానికి వెళ్తే ప్రార్ధన ఆలకించే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడేమో, అది నీవు పొందుకుంటే
బలపడిపోతావేమో అని నిన్ను వెళ్లనివ్వడం లేదు. చదవడానికి చిన్నపిల్లల స్టోరీ లా
ఉన్న ఇది వాక్య సత్యం. అర్ధం అయితే బయలు దేరు ఈరోజు పరిశుద్ధ ఆరాధన దినం.
ప్రభువు నీ ప్రార్ధన తన ఆలయంలో విని ప్రతిఫలం ఇచ్చును గాక!
షలొమ్.
మీ కొరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి