ఈరోజు మందిరానికి వెళ్ళడానికి సిద్ధ పడుతున్నారా? చాల మంచి పని చేస్తున్నారు. అయితే మందిరానికి ఎలా వెళ్ళాలి అనే ఒక
విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుడు నిలిచి ఉండు స్థలమునకు మనం వెళ్తున్నాము.
ఇశ్రాయేలియులు ఐగుప్తు నుండి కానా యాత్రలో సైన్యములకు అధిపతి యగు యెహోవా వారితో
ఉండుటకు ఒక పర్ణశాల కట్టమని మోషే కు ప్రభువు వారు సుసించారు. అయితే పర్ణశాల చుట్టూ
ప్రాకారము తెరలతో కట్టబడింది. దానికి తూర్పుగా ప్రవేశ ద్వారము ఉంచబడింది. లోపలి
వెళ్ళే ప్రవేశ ద్వారము కూడా వ్రేలాడుతున్న తెరలతో ఉంది. అయితే ద్వారానికి ప్రత్యేక
ఏర్పాట్లు ఏమీలేవు కాని వ్రేలాడుతున్న తెరల గుండానే లోపలి వెళ్ళాలి. అయితే అలా
వెళ్ళాలి అంటే ప్రతివారు వ్రేలాడుతున్న తెరను వంగుని తెరను లేపి వంగి వెళ్ళవలసి
ఉండేది. అదే విధానం అందరికి, చిన్న, పెద్ద, ధనిక, పేద,
బేధం లేదు. ఈరోజు నీవు వెళ్ళేది అయన నిలఛి ఉండే స్థలానికే,
నీవు ధనికుడవు అయివుండవచ్చు, బిద వాడవు
అయివుండవచ్చు, ఉద్యోగస్తుడవు అయివుండవచ్చు, నీవు ఎవరివైన పర్ణశాలలో దేవుని కలచుటకు దేవుడు నిర్ణయించిన మాదిరి
దీనత్వం కలిగి, నీవు నిలిచి ఉండే స్థలము సర్వసృష్టి కథ
నిలిచి ఉండే స్థలమని, ఆయన నీన్ను సృజించిన వాడని, నీకంటే అధికుడని, బలవంతుడని గమనించి జీవిస్తే
నీకు దివేనకరముగా ఉంటుంది. సోలోమోను అంటాడు " నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రతగా చూచుకొనుము
ప్రసంగి 5:1 " అయన తన సన్నిధిలో
దీనులను లేవనేత్తువాడు, గర్విష్టులను అనగ ద్రొక్కు వాడు. మోషే
దినత్వాన్ని కలిగి సాత్వికుడై ఉన్నాడు గనుకనే దేవుని చూడగలిగాడు. నీవును అటువంటి
మనసు కలిగి దీవింప బడుధువు గాక!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని
బాబు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి