వర్షా
కాలం లో ఒక వ్యక్తి ఏటిగట్టున నడుకుంటూ వెళ్తుండగా కాలు జారి ఏటిగట్టుకు క్రిందన
ఉన్న నేల నూతిలో పడిపోసాగాడు, ప్రాణబయంతో అక్కడ చేతికి అందిన ఒక మొక్కను
పట్టుకున్నాడు. అయితే కురుస్తున్న వార్షానికి నెల మెత్తన పడి అది కుడా ఒకో వేరు
ఒకో వేరు తెగిపోవడం మొదలు పెట్టింది. వేర్లు తెగుతున్న కొలది వాని ప్రాణాలు
జారిపోతున్నాయి. ఎంత కేకలు పెట్టిన ఎవ్వరు రావడం లేదు. ఇక ప్రాణ భయంతో ఉండగా దేవుడు
గుర్తుకు వచ్చారు, వెంటనే ప్రార్ధన చెయ్యడం మొదలు పెట్టాడు. కాపాడమని అడగడం మొదలు
పెట్టాడు. అయితే అది అత్యవసర పరిస్థితి గనుక దేవుని ప్రత్యక్షత దొరికింది.
ఏమికావాలని ప్రభువు అడగగా? నన్ను కాపాడు అన్నాడు. నేను నిన్ను కాపాడగలనని నమ్ముతున్నావా?
అడిగారు ఆయన, నమ్ముతున్నాను అన్నాడు, నిజంగా నమ్ముతున్నావా? నీవు మాత్రమె కాపడగలవు
అన్నాడు. అప్పుడు దేవుడు నా మీద అంత నమ్మకం ఉంటె నీవు పట్టుకున్న చెట్టు వద్దిలేయ్
అన్నారు......
నిజమయిన,
ధృడ మయిన నమ్మకం ఉంటె అప్పటివరకు పట్టు
కున్నదాన్ని వదిలివేయ గలుగుతాడు? లేక పోతే దేవున్ని వదులుకోవలసి వస్తుంది.
ఈరోజుల్లో
కుడా ప్రతి క్రైస్తవుడు కుడా దేవుని మీద నమ్మకం అంటారు కాని లోక సంప్రాదాయాలు(
సంస్కృతి కాదు, అది వేరు ), కట్టు బాట్లు, ముహూర్తాలు, ఎదురులు, శకునాలు,
తాయిత్తులు, మంత్రాలు, ఎలా చాలా ఉన్నాయి వాటిని వదలడం లేదు, వాళ్లకు తెలియకుండానే
దేవున్ని వదులుకుంటున్నారు, కాని దేవునిలోనే ఉన్నాము అనుకుంటున్నారు. దేవుని శక్తి
పరిపూర్ణంగా చూడాలి అంటే పరిపుర్ణమయిన నమ్మకం ఆయనమీద పెట్టగలగాలి.
క్రియలు
లేని విశ్వాసం మృతము యాకోబు 2: 26
మీ
కొరకు ప్రార్ధించు
అపోస్తులు
నాని బాబు నెల్లి
990882316