ప్రబువు మీకు అట్టి ఆసీర్వాదం అనుగ్రహించును
గాక....
మీ సహోదరుడు ,
అపోస్తులు నాని బాబు నెల్లి
ప్రబువు మీకు అట్టి ఆసీర్వాదం అనుగ్రహించును
గాక....
మీ సహోదరుడు ,
అపోస్తులు నాని బాబు నెల్లి
ఈరోజు నా మనస్సు ను
చాలా బాధ పెట్టిన విషయం లో ఒక మంచి పాఠం మీకోసం….
నా కుమారుని క్రమశిక్షణ
లో బాగంగా తాను ప్రతి రోజు చెయ్యవలసిన కొన్ని పనులు చెయ్యడం మానేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని తనకు అందులో ఉన్న తీవ్రత ను తెలపడం
కోసం మోకాళ్ళు వెయ్యమని శిక్ష వేసాను. కొంచెం సేపు బాగానే
వేసి ఉన్నాడు కానీ నా మనస్సు లో చాలా బాధగా ఉంది. అయ్యో కొడుకు ఇబ్బంది పడుతున్నాడని మనస్సు నొచ్చుకుంది. కానీ కటినంగా ఉండక పోతే కొన్ని విషయాలు పిల్లలకు
నేర్పలేము. ఇంతలో నా కూతురు, బార్య, చెల్లి వచ్చి తనను
వదిలేమని చెప్పారు. వాళ్లకు వాడిని నన్ను
అడిగితే, మరల తప్పు చెయ్యను అని చెపితే
వదిలేస్తాను అని చెప్పాను. వీళ్ళు వెళ్లి చెప్పారు. వాళ్ళు బాధపడుతున్నారు. నేను బాధ పడుతున్నాను. నా కొడుకు బాధ పడుతున్నాడు. వాడు అడుగుతాడు అని నా కొడుకు చుట్టూనే తిరుగుతున్నాను. కానీ వాడికి నన్ను అడగటానికి భయం, ఎలా అడగాలి అనె భయం. అడిగితే వదులుధమని నా ఆశ. ఈలోపు ఎప్పుడు కొట్టుకునే తన అక్క వాడి కోసం ఏడుస్తుంది. వాడికి అర్థం అయ్యింది, అక్కకు తను ఎంత ఇష్టమో, వాడికి బదులు తను మోకాళ్ళు వెయ్యడానికి సిద్ధం అయ్యింది. కొంచెం సేపటికి తను మెల్లగా డాడీ నీ మాట వింటాను అని చెప్పగానే నా కళ్ళల్లో నీళ్ళు, తనను కౌగలించుకున్నాను. అందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వాడికి ఇష్టమయిన వస్తువు వెంటనే అమెజాన్ లో ఆర్డర్
పెట్టాను.
మన దేవుడు ఇంతకన్నా
ప్రేమమయుడు, ఆయన మనలను శిక్షించి, మన పశ్చాతాపం తో చేసే ప్రార్ధన కోసం ఎదురు చూస్తుంటాడు. ( కీర్త 103:13 ) మనలను పాడు చెయ్యాలని కాదు గానీ మనలను బాగు చెయ్యాలని తన ఆశీర్వాదమునకు వారసులను
చెయ్యాలని తన తపన. అందుకే ఒక పాపి తన
పాపంలో మరనించుట తనకు ఇష్టం లేదు అని, ఒక పాపి రక్షింప బడితే
పరలోకం లో దేవతలు ఆనందిస్తారని, ప్రభువు శిక్షించు
నరుడు ధన్యుడు అని వాక్యం చెపుతుంది. ( యెహే 18:30-32, లూకా 15:10, యోబు 5:17,18 )
చాల పర్యాయాలు మనం దేవుని మీద కోపగించుకుని నాకు దేవుడు
ఏమి చేసారు అని మాట్లాడుతూ ఉంటాము. అలాగే వాక్యములో చాలా వాగ్దానాలు ఉన్నాయి కదా
ఏది నా జీవితం లో జరగడం లేదు అని విశ్వాసం లో దిగజారిపోతు ఉంటాము. ఒకసారి ఇది చదవండి....
ఒకసారి అవసరం ఉండి 13 దినాల కొరకు ఒక కారు
మాట్లాడుకున్నాను. అయితే అన్ని విషయాలు ముందుగానే మాట్లాడుకున్నాము. నాతో పాటు మా
బంధువు కుడా ఉన్నారు. 13 రోజులు పూర్తి
అయిన తరువాత మేము మాట్లాడుకున్నట్టు లెక్కలు కట్టి మొత్తం సొమ్ము కారు యజమానునికి
ఇచ్చాను. అయితే అతను వేరే లెక్క కట్టి ఇంకా డబ్బులు వస్తాయి అని గొడవ పెట్టాడు.
అప్పుడు గుర్తు వచ్చి మాట్లాడిన రోజున నాతో ఉన్న మా బండువుకు పోన్ చేసాను, తను
నాకు ఒక వాయిస్ రికార్డింగ్ పంపించారు. అది కారు యజమానితో మేము మాట్లాడినది. అది ఆ
యజమానునికి వినిపించగా అతడు ఏమి మాట్లాడలేక పోయాడు. ఆనాటి నుండి నేను ఏదైనా ఇలాంటి
విషయాలు ఉంటె కచ్చితంగా వ్రాయించి ఇద్దరం సంతకాలు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను.
అది నన్ను చాల నష్టాల నుండి కాపాడింది.
ఇదంతా మాకెందుకు అనుకుంటున్నారా? ఇలాంటి విషయాల
పట్టిక ఈ పరిశుద్ధ గ్రంధం. ఇందులో ఉన్న వాగ్దానాలు అన్ని నిబంధనలు మాత్రామే. మనం
దేవుని మీద తిరుగుబాటు చేస్తామనే దేవుడు ముందుగా ఈ నిబంధనలన్నీ వ్రాయించి
పెట్టాడు. నిబంధన ఆయన తప్పార? నీవే నిబంధన మీరవా? ఒకసారి గుర్తుకు తెచ్చుకో....
ఒకసారి కీర్తనలు 115:5 చదవండి.
దేవుడు మీ పట్ల తన నిబందను గుర్తుకు తెచ్చుకోనును
గాక !
మీ సహోదరుడు
అపోస్తులు నెల్లి నాని బాబు
990 882 3196
మన్నైన మానవ శరీరం మరల మట్టి కి మారుతుంది. మానవుడు మట్టి నుండి చెయ్యబడ్డాడు కాబట్టి మరల మన్నుకు మారుతున్నాడు. ఇది సత్యం. అయితే పుట్టిన నాటి నుండి మరణించే వరకు మానవునికి కొంత ఆయుష్షు దేవుడు ఇస్తున్నాడు. కొంత మందికి దీర్గ ఆయుష్షు, కొంత మందికి అల్ప అయుస్శును ఇస్తారు. కాని ప్రతి మనిషి ఈ భూమి మీద నిర్వర్తించవలసిన కర్తవ్యం ఒకటి ఉంటుంది. అది పూర్తి చేస్తున్నామా ? అసలు నీ జన్మకు సార్ధకత ఉందా?
రైతు పండించే ప్రతి ధాన్యపు గింజ మట్టినుండి పుట్టి మరల మట్టికే చేరుతుంది. కాని అది పుట్టిన నాటి నుండి మట్టికి చేరే లోపు రైతుకు ఆదాయం, ప్రతి మనిషికి ఆహారం, ఆరోగ్యం, వ్యాపార వేత్తకు లాబాన్ని, ఇలా చెప్పుకు పోతే అది మరల మన్నుకు చేరే సరికి ఎన్నో రూపాలలో సమస్త మానవాళికి ఉపయోగపడి తిరిగి మన్నుకు చేరుతుంది. ఆహారం గా మారిన ధాన్యం శరీరం లో ఆరోగ్యానికి అవసరమయిన రక్తాన్ని, ప్రోటిన్స్ ఇంకా అందించి కరిగి మలినమై మట్టికి చేరుతుంది. కొంత ధాన్యం మరల పురుత్పత్తి చేసి మరింత ధాన్యం కొరకు విత్తనం గా మారుతుంది. అల్ప ఆయుష్షు ఉన్న ధాన్యం పక్షులకు ఆహరం గా మారుతుంది, కొంత ధాన్యం చేలోనే రాలి మరల పెరిగి పశువులకు ఆహారం అవుతుంది.
అయితే మానవునిగా పుట్టిన నీవు మరనించే లోపు ఎంత మందికి ఉపయోగ కరంగా ఉన్నావు, నీ వలన దేవుని ఉద్దేశ్యం నెరవేరిందా? నీ ఆయుష్షు ఎంతో నీకు తెలియదు కదా మరి ఎందుకు సమయాన్ని పాడు చేస్తూ రేపు రేపు చేద్దాం అని వాయదాలు వేస్తావు. నీ జన్మ కు సార్ధకత చేసుకో....... సమయాన్ని వృద్ధా పరచకు.....
దేవుడు నిన్ను ప్రయోజన కరునిగా మార్చును గాక....
మీ సహోదరుడు
అపోస్తులు నెల్లి నాని బాబు
ఒకరోజు నేను రోడ్డు నిర్మాణం పనులు జరిగే స్థలం మీదుగా వెళ్ళవలసి వచ్చింది. ప్రభువు నన్ను ఒక్క నిముషం ఇక్కడ ఆగి చూడు అన్నారు. ఏమి చూడాలి? సరే అని ఆగి రోడ్డు నిర్మాణం కొరకు వాడే మెటీరియల్ ని చూడటం మొదలు పెట్టాను. అక్కడ ఉన్న వన్ని రాళ్ళు, కానీ అవి ఒకొట్టి ఒకో పరిమాణం లో ఉన్నాయి. బాగా పెద్ద రాళ్ళు మొదట వేసి తరువాత చిన్న రాళ్ళు తరువాత బాగా చిన్న రాళ్ళు, మధ్యలో మట్టి, ఇసుక, లాంటివి వాడతారు. ఒకవేళ అవే రాళ్ళను తారు మారుగా వాడితే పరిస్థితి ఏమిటి? సాపిగా రావాల్సిన రోడ్డు ప్రయాణానికి అనువుగాని రోడ్డు గా ఉంటుంది. క్రింద వెయ్యవలసిన పెద్ద రాళ్ళు పైన వేసి పైన వేయ వలసిన చిన్న చిన్న రాళ్ళు క్రింద వేస్తే ?
అప్పుడు దేవుడు మనం జీవితం లో ఇవ్వవలసిన ప్రాధాన్యత లను గురుంచి నాతో మాట్లాడటం మొదలు పెట్టారు. చాలా మంది మొదట ఇవ్వ వలసిన వాటికి చివ్వరిలో, చివర ఇవ్వవలసిన వాటికి మొదటిలో ప్రాధాన్యత లను ఇస్తూ ఉంటారు.
మనం మొదట దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వ గలిగితే అధి మన జీవితం లో బలమయిన పునాదిగా, స్థిరత్వం కొరకు మూల రాయిగా ఉంటుంది.
కయీను, హెబెలు ల అర్పన లలో దేవుడు హేబెలు అర్పనను లక్ష్య పెట్టడానికి గల కారణం ఇదే. తను తోలుచులిలో, కొవ్విన వాటిని దేవుని యొద్ధకు తెచ్చాడు. అక్కడ దేవునికి ఇచ్చే ప్రాధాన్యత, విలువ, స్థానం కనపడుతున్నాయి.
మీ జీవితం లో దేవునికి ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నారు.
ప్రభువు మిమ్మును దీవించు ను గాక!
అపొస్తులు నాని బాబు నెల్లి
9908823196
నీవు ఏమి కలిగి ఉండవు , కాని సంతోషంగా ఉంటావు - ప్రపంచ ఎకానమీక్ ఫోరం, “ ది గ్రేట్ రీసెట్ “
ప్రస్తుత బయనిక తెగులు దేశాన్ని, ప్రపంచాన్ని
కుదిపేస్తుంది, అనేక మరణాలు, అనేక మంది అనాదులుగా, విధవరాండ్రు గా
మిగిలిపోతున్నారు. అనేక మంది తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం జీవితాంతం కస్టపడి
సంపాదించిన ఆస్తినంత హాస్పటల్ లో అప్పగించి పిల్లలకు అప్పులు మిగిల్చి వెళ్ళిపోతున్నారు.
మనం అంత బయనక స్థితి లో ఉన్నాము. ఎప్పుడు ఎవరికీ ఏమి అవుతుందో అని ప్రాణాలను
గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు ప్రజలు. అయితే ఇ భయాన్ని తెగులును అవకాశంగా
వాడుకుని ప్రజలను తప్పు త్రోవలో దేవునికి ఇష్టం లేని మార్గం లో నడిపించడానికి
మరోపక్క ప్రపంచ దేశాల నాయకులు కుట్రలు పన్నుతున్నారు.
“ ది గ్రేట్ రీసెట్ “
“ THE GREAT RESET” అనే నినాదం తో ప్రపంచ ఎకనామిక్ ఫోరం ఒకటి ఏర్పడింది.
దిని ప్రధాన ఉద్దేశ్యాలు, ప్రపంచ ఆర్ధిక పని తీరును మార్చుట, ప్రజలకు ఆరోగ్యం,
వసతి, విద్య అందించడం. అయితే ఇది కనిపించడానికి చేసే ప్రతిజ్ఞలు, కాని వారి
ఉద్దేశ్యాలు పెత్తందారి వ్యవస్థను, అంటే క్యాప్టలిసం మరియు మార్క్స్ వ్రాసిన
కమ్మునిసం ను ప్రపంచమంతా అమలు చేసేలా ఉంది అని చాల మంది తెలియ జేస్తున్నారు.
ప్రపంచ ధనవంతులు వారి గుర్తింపును కోల్పోవడం వలన తిరిగి ఇ
కోవిడ్ ను అడ్డం పెట్టుకుని మరల ఆర్ధిక వ్యవష్టలో ఉన్నత శిఖరాలు ఎక్కడం వారి
ఉద్దేశ్యం. ప్రపంచ ఎకానమీ ఫోరం యొక్క ఉద్దేశ్యం ప్రకారం 2030 నాటికి “ ది గ్రేట్ రీసెట్ “ అమలుకావడం. దానిలో ప్రముక్యంగా వినిపించే మాట “నీవు ఏమి కలిగి ఉండవు అయితే నీవు సంతోషంగా
ఉంటావు”. మన ఆస్తులు, వనరులు, ఏమి మన
సొంతం కాదు కాని మనం సంతోషం గా ఉంటాము అనేది వారి నినాదం. మన ఏమీ కలిగి ఉండనప్పుడు
మనము ఎలా సంతోషం గా ఉంటాము. అంటే మనకు కావలసినదంత వాళ్ళే ఇస్తారు. అంటే మనం ఏమి
తినాలి, ఏమి కలిగి ఉండాలి, ఏ బట్టలు ధరించాలి, అంతా వాళ్ళే నిర్ణయిస్తారు, వాళ్ళే నియంత్రిస్తారు.
మనం అంత వాళ్ళ స్వాధీనం లోనే ఉంటాము. మనం
ఆ దనం ఆస్తి కలిగిఉండక పోతే మరి ఎవరు కలిగి ఉంటారు. అంటే నాయకులు, వ్యాపార వేత్తలు కలిగి ఉంటారు.
అంతేకాదు దేవుని వ్యతిరేక ఆలోచనలను అందులో ఉన్నాయి. స్త్రీ స్త్రీ వివాహాలు, పురుష
పురుష వివాహాలు, ప్రజల మనోభిస్తానికి స్వేచ్చగా వదిలేయడం వంటివి. ప్రపంచ దనం, అధికారం అంతా వారి చేతిలోకి తీసుకోవడం, వాళ్ళే
దేవుళ్ళుగా ఉండిపోవాలని ఆశ. ఎప్పుడైతే ఇది
ఏర్పడిందో ప్రజలలో కట్లు తెగిన జంతువుల వాలే ప్రవర్తించే అవకాసం ఎంతో ఎక్కువగా
ఉంది. ఒక రకంగా సోదోమ గోమేర్ర వంటి దేశాల వాలే దేవుని కోపాన్ని ఉగ్రతను కొని
తెచ్చుకున్న వారివలె ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వాక్సిన్ పాస్ పోర్ట్ అనేది అందులోని
బాగామనే కొంతమంది ఆలోచన.
ఒకవేళ ఇది గాక ఏర్పడితే దేశంలోని ప్రతి జాతి అనేక కస్టాలు
బరించక తప్పదు. ఇప్పటికే ౩౦౦౦ మందికి పైగా
అందులో బాగాస్తులై ఉన్నారు. దేశాల ప్రధానులు కుడా అటువైపు మొగ్గు చూపిస్తున్నారు. చైనా ప్రధానితో
పాటు మన దేశ ప్రధాని మోడీ గారు కుడా అందులో కనిపంచడం దురదృష్టకరం.
మనం కుడా రాబోయే రోజుల్లో మరల మన పూర్వికుల వలే కొత్త రకంగా
మరల ధాస్యత్వం లోకి వెళ్లి పోయే ప్రమాదం పొంచి ఉంది.
దిని విషయంలో మనం ప్రార్ధన చెయ్యాల్సిన వారమై ఉన్నాము.
కీర్తనలు 17:1. హగ్గాయి 1:3-10.
హగ్గాయి 2:4-7 లో ఆయన ఇచ్చిన వాగ్ధానము ను ఎత్తి బట్టి
ప్రార్ధన చేదం. ( కీర్తనలు 9:15-16 , యేహేజ్కేల్ 17:19-20., కీర్తనలు 35:1- 18, ద్వితి 8:18, సామెతలు
13:22.
ఇవన్ని అయన రాకడకు ముంగుర్తులు కాగా అనేక ఆత్మల రక్షణ కలిగి
దేవుని రాజ్యం కట్టబడునట్లు ప్రార్ధన చెద్దము.....
అపోస్తులు నాని బాబు నెల్లి,
ఇండియా ప్రార్ధన కూటమి
నిన్నటి దినాన నా
కుమార్తె బొమ్మలు గీస్తూ ఉంది. అయితే తనకు నేను కొత్త ఎరైజర్ కొని ఇచ్చాను కానీ ఇప్పుడు చాలా చిన్నగా అయిపోయింది. మామూలు విషయమే కదా అని వదిలేసాను. కానీ దేవుడు అదే విషయాన్ని పదే పదె గుర్తు చేస్తూ
వచ్చారు. ఇరోజటికి దేవుడు ఎదో చెప్ప
బోతున్నారు అని గ్రహించి, ధ్యానించడం, ఆలోసించడం , ప్రార్థన చెయ్యడం మొదలు పెట్టాను.
అప్పుడు తండ్రి నా
మనస్సు లో ఒక సాదృష్యాన్ని దానికి అన్వహించమన్నరు.
ఏరైజర్ ( పెన్సిల్ వ్రాతలను చేరుపునది ) ఎపుడెప్పుడు వాడతారు? ముఖ్యంగా పిల్లలు తప్పులు వ్రాసినప్పుడు వాటిని
చెరిపి మరల ప్రయతించ డానికి ఉపయోగిస్తారు. వాళ్ళు తప్పులు చెరపడానికి ఉపయోగించిన ప్రతిసారీ
ఎరైజర్ రా తప్పును చేరుపుతు అరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులకు అంది పూర్తిగా అరిగిపోతుంది.
ఇక్కడ నమ్మకం ఒక ఎరైజర్
అయితే నీవు చేసే తప్పులు క్షమించేటప్పుడు అధి అరిగిపోతుంది. కొంత కాలానికి నీ తప్పులు సరిదిద్దు కోవడానికి ఎదుటవానిలోని
నమ్మకం పూర్తిగా కోలిపోతావు.
నమ్మకం ఉంచుతున్నారు
కదా అని కావాలని పొరపాట్లు చెయ్యకు, ఒకరోజు అనాధగా మిగిలిపోతారు.
యేసు వారు నీ కొరకు
నా కొరకు మరణించి సమాధి చెయ్యబడి, తిరిగి లేచి మనలను
క్షమించి దేవుని రాజ్యానికి వారసుడని చేశారు. మరలా తిరిగి పాపం చెయ్యకు, మరణమే గతి.
( హెబ్రి 10: 26,27 )
ప్రభువు మిమ్మును
మీ విశ్వాసమును బట్టి దీవించును గాక!
అపొస్తులు నాని బాబు
నెల్లి,
ప్రతి రోజు నా బట్టలు నేను ఇస్త్రీ చేసుకోవడం నాకు అలవాటు. నిన్న సాయంత్రం బయటకు వెళ్ళాలి అని బట్టలు ఇస్త్రీ చేసుకునే బల్ల మీద వేసి, ఇస్త్రీ పెట్టి యొక్క ప్లగ్ పెట్టీ, వెడెక్కే లోపు మంచి నీళ్లు తాగి వద్దామని పక్కనే ఉన్న వంట గదిలోకి వెళ్ళాను. నీళ్ళు తాగి వచ్చి ఇస్త్రీ చేస్తుంటే చొక్కాయి ఇస్త్రీ అవ్వడం లేదు, ఎంటా అని చూస్తే ఇస్త్రీ పెట్టీ వెడెక్క లేదు. అయ్యో ఇస్త్రీ పెట్టీ పోయింది అని బాధపడుతూ, స్విచ్ వెయ్యలేదేమో అని అనుమానం వచ్చి స్విచ్ చూస్తే బాగానే ఉంది. చాలా సేపు బాధపడ్డాను, ఇస్త్రీ పెట్టీ పాడైపొయ్యింది, ఇప్పుడు బట్టలు ఇస్త్రీ ఎలా అని. ఎందుకో అసలు ప్లగ్ సరిగా పెట్టానో లేదో అని చూసాను అప్పుడు అర్ధం అయ్యింది. ప్లగ్ సరిగానే పెట్టాను, స్విచ్ వేసాను కానీ నిన్ను పెట్టిన ప్లగ్ ఇస్త్రీ పెట్టిధి కాదు ప్రక్కన ఉన్న వేరే వస్తువుది అని. మరి ఇలా అయితే ఇస్త్రీ పెట్టీ ఎందుకు, ఎలా పని చేస్తుంది?
క్రైస్తవుడు కూడా తన జీవితాన్ని లోకానికి, లోక నటనకు, లోక సంప్రదాయాలు, అలవాట్లకు అప్పగించి, దేవునికి దూరంగా ఉంటూ, దగ్గరగా ఉన్నాము అనే బ్రమలో ఉంటూ, నా జీవితం మారడం లేదు, దేవుడు నన్ను దీవించడం లేదు అని బాధ పడితే ప్రయోజనం ఏమిటి?. నీ జీవితం దేవునితో లేదు! నీ అలవాట్లు దేవునికి ఇష్ట మయినవి కాదు! నీ జీవితాన్ని దేవునికి అనుసంధానం చెయ్యి అప్పుడు నిజ దీవెన నీలో ఫలిస్తుంది.
ప్లగ్ ఒక దానిది పెట్టీ వేరొకటి పనిచేయలనీ కొరువడం ఎంత మూర్ఖత్వమే, నీ జీవితం దేవునికి ఇవ్వకుండా దేవుడు దీవించడం లేదని అనడం కూడా అంతే…
మత్తయి 15:6-10
ప్రభువు మిమ్మును మీ విశ్వాస జీవితాన్ని బట్టి దీవించి ఆశీర్వదించును గాక!
అపొస్తులలు నాని బాబు నెల్లి
9908823196
ఈరోజు ఉదయాన్నే ప్రార్థనలో మన తండ్రి నాకు నా డిగ్రీ కాలేజ్ లో పరీక్ష వ్రాస్తున్న సమయాన్ని గుర్తు చేశారు. నాకు కొంచెం ఆలోచనలో పడ్డాను. తండ్రి ఎప్పుడు అనవసరంగా గుర్తు చెయ్యరు దిని వెనుక
ఎదో ఒక విషయం ఉంది, దానిని చెప్పాలి అనుకుంటున్నారు
అని ధ్యానించడం మొదలు పెట్టాను.
కొంచెం సేపు ఆలోచనల
తరువాత నా మధి మా పరీక్ష గదిలో ఉన్న ఇన్విజిలేటర్ వైపు వెళ్ళింది. ఆయన చాలా కట్టినంగ వ్యవహరించే వారు. అసలు అతు ఇటు కధలనిచ్చే వారు కాదు. ఇంకొంచెం అలోసిస్తే ఆ ఇన్విజిలేటర్ మాకు తెలియని వారు కాదు, గడచిన సంవత్సరం అంతా మాకు బోధించిన సారే…
ఆయన సంవత్సరం అంతా
బోధించి, మమ్ములను ఎంతగానో ప్రేమించి, బరించి, అర్ధం కాకపోతే మరల
మరల అర్ధం అయ్యేవరకు వరకు చెప్పిన అధ్యాపకుడు. కానీ ఇప్పుడు ఆయన వేరే స్థానం లో ఉన్నారు. మేము పరీక్షలు వ్రాసేటప్పుడు ఆయన చెప్పినవన్నీ మేమే
వ్రాయాలి. ఆయన ఇప్పుడు ఒక్క మాట కూడా
చెప్పలేదు.
అలాగే దేవుడు బోధించినప్పడు, నేర్పించినప్పుడు మనం నేర్చుకోవాలి, శ్రమలలో ఆ బోధలు మనకు సహాయంగా ఉంటాయి. ఆయన మనలను చూస్తూ ఉంటారు. మనం ఏవిధంగా నడుస్తున్నాము, ఏవిధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నామో, ఆయన చెప్పిన మార్గం లో నడుస్తున్నాము లేనిది పరీక్షిస్తారు. ఇవన్నీ ముందుగానే మనకు బోధించారు కదా….
మనకు సూర్యుని గురుంచి
చాలా విషయాలు తెలుసు కానీ ఇంకా తెలియాల్సిన వి కూడా చాలా ఉన్నాయి.
రెండు, అధి దేవుడు పెట్టిన క్రమం. ఎలా అంటే మనకు చీకటి కలగడం అంటే శ్రమలు, వేదనలు కలగడం వలన మనం నిరీక్షణ ను, విశ్వాసాన్ని అల్వరచుకుంటాము. సూర్యుడు ఉదయించక పోతాడా అని.
దేవుడు మిమ్మును దీవించును
గాక!
అపోస్తులు నెల్లి
నాని బాబు
9908823196
ఒక వేసవి కాలములో పిల్లలకు సెలవు రోజుల్లో, మేము మా పిల్లలతో అంతర్వేది బీచ్ కు వెళ్ళాము. అక్కడ ఒక లైట్ హౌస్ ఉంది. దానిని చూడటానికి వెళ్ళాము, పిల్లలు దాని గురించి చెప్పండి నాన్న అని అడిగారు. అప్పుడు దాని గురించి చెప్పడం మొదలు పెట్టాను. సముద్రం లో ప్రయాణం చేసే ఓడలుకి, చేపల వేటకు వెళ్లే మత్యకారులకు ఒడ్డుకు చేరడానికి ఒక దిక్షుచి అని చెప్పాను. ఎందుకలా వాళ్లకు తెలియదా? అన్నారు. సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు సముద్ర తీరం కణపడదు, అలాంటప్పుడు ఈ దీపం వెలుగు వారికి తీరం ఎటువైపు ఉందో చూపిస్తుంది అని చెప్పాను. నిజమే కదా, సువిశాలమైన సముద్రం లో ఓడలు, పడవలు, నావలు ఒడ్డుకు నడిపించే దీపం, వెలుగు తీరాన్ని ఉండాలి. అప్పుడే తీరానికి చెరగలరు.
అలాగే యేసు వారు మనకు దీపం, వెలుగై ఉండి, మనకంటే ముందుగా లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించి, తీరానికి చేరి మనకు మార్గాన్ని చూపిస్తున్నారు. ఈ జీవన సముద్రం లో మన జీవిత పడవ ప్రయాణం వెలుగై, దీప స్తంభం అయ్యి ఉన్న యేసు వైపు చూస్తూ నడిస్తే మనం కూడా యేసు వారి వలె పాపం, మరణం, లోకం జయించ గలము. నిత్య తీరమయిన పరముకు చెరగలం. మరణమును, నరకనును తప్పించు కొగలము.
ప్రభువు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక!
ఒకసారి ఒక వృద్ధుడు
దేవుడు తనకు ఇచ్చిన పిలుపు, బారాన్ని బట్టి రైలు లో సువార్త ప్రకటిస్తున్నారు. ప్రతి కంపార్ట్మెంట్ లోకి వెళ్లి నిలువబడి “ యేసు రక్షకుడు, మన పాపముల కొరకు చనిపోయి, తిరిగి లేచారు, ఆయన మరల వస్తున్నారు, మారుమనస్సు పొందండి” అంటూ గట్టిగ అరుస్తూ చెపుతున్నాడు. ఇంతలో అక్కడ ఉన ఒకావిడ అతని మీద కేకలు వేస్తూ, నోరుమూయి, నీ చెప్పే యేసు అసలు లేరు అని గట్టిగ అరిచింది. ఆ ముసలాయన ఏమి చెయ్యలేని పరిస్థితిలో, భయపడి కూర్చుండి పోయాడు.
గానీ దేవుడు తనను
బలవంతం చేస్తున్నారు, సువార్త ప్రకటించడం
అపవద్దు అని. దేవునికి భయపడి, లోబడి మరల నిలువబడి వాక్యం ప్రకటించడం మొదలు పెట్టాడు. మరల ఆ స్త్రీ తనమీద కోపం తో విరుచుకు పడి, దాడి చెయ్యడం మొదలు పెట్టింది. ఇంతలో తనకుడ కూడా వచ్చిన తన కుమారుడు గట్టిగా “ అమ్మ, తనను ఏమీ చెయ్యొద్దు, అతను దేవుని చేత పంపబడిన వాడు” అని చెప్పాడు అంట.
వెంటనే ఆ స్త్రీ మోకాళ్ళ
మీద పడి ఏడ్వడం మొదలు పెట్టింది. రొమ్ము కొట్టుకుంటూ
ఏడుస్తూ, తన పాపాలను ఒప్పుకుంటూ, యేసు ను అంగీకరించడం మొదలు పెట్టింది.
ఆ వృద్ధుడు ఏమైదీ
అని అడిగితే, “ నా కుమారుడు పుట్టి మూగవాడు” అని ఏడ్చింది.
ప్రభువు మిమ్మును
దీవించి, అంగీకరించును గాక!