భూత,వర్తమాన,భవిష్యత్ కాలములలో ఉన్న ఎల్ - రోయి, ఎల్ - షద్ధయీ దేవునికే మహిమ,
ప్రభువు నామమున మీకు శుభాలు,
ప్రతి ఒక్కరికీ తెలుసు ప్రార్ధన శక్తి వంతమయింది అని, కొంత మందికి తెలుసు గొలుసు ప్రార్ధన మరింత శక్తివంతమైనది అని. గొలుసు ప్రార్ధన వలన జరగని కార్యం అంటూ లేదు. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసిన విధానం. ఇధి కొంతమంది తెలియక పోవచ్చు. ఎలా అంటారా? యెషయా 6:1-3, ప్రకటన 4:8;5:9-14; 8: 1 లోని వాక్యాల ఆధారంగా, పరలోకం లో దేవుని సింహాసనం ఎదుట నిలచున్న దేవుని దూతలు, సెరాపులు, కేరాపులు నిత్యం ప్రభువుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉంటారు. అంటే పరలోకంలో నిత్య స్తుతి జరుగుతుంది.
అదే నిత్య స్తుతి భూమి మీద రాజైన దావీదు సీయోను పర్వతం మీద, దేవుని ప్రత్యక్ష గుడారం నందు ఏర్పాటు చేశాడు.( 1దిన 16 ). అందుకోసమే దేవుడు అప్పటివరకు ఏ ప్రాంతాన్ని కూడా నా నివసస్థలం అని చెప్పలేదు, గానీ సీయోను తన నివాసముగా, అయన సీయోను వాసిగా చెప్పుకున్నారు. యెషయా 8:18, కీర్తనలు 74:2. అందుకోసమే దావీదును నా హృదయ అనుసారుడు అని సాక్ష్యం, బిరుదు ఇచ్చారు. అప్పుడు మొదలైనది నిత్య ఆరాధన, ప్రార్ధన భూమిమీద. అది కాస్త మార్పు చెందుతూ ఇప్పుడు గొలుసు ప్రార్ధన గా పిలువబడుతుంది.
అంటే భూమి మీద ఎక్కడైతే నిత్య స్తుతి ఆరాధన ఉంటుందో అక్కడ ఆయన నివాసముంటారు. దానిని తన నివాస స్థలము గా చేసుకుంటారు. ఆ స్థలం నుండి తన పరిపాలన చేస్తారు.
వాక్యం లో ఆయన నివాసం ఉన్న చోట స్తుతులు ఆయన సింహాసనం ( కీర్తనలు 22:3 ) అయితే ఆయన పాద పీఠం తన శత్రువులు ( కీర్తనలు 110:1 ) అని ఉంది. తన బిడ్డలం అయిన మన శత్రువు తన శత్రువు ( రోమా 12:19 ) ఇప్పుడు మనను బాధించు వారు, మనను శ్రమ పెట్టువారు, నిందించు వారు, మనలను బాధించు రోగములు, శాపములు, తెగులు దేవుని పాదముల క్రింద ఉంటే మనకు విడుదల, విజయం, సమాధానం, రక్షణ.
అయితే ఆయనకు మనం సింహాసనం వెయ్యాలి కదా.... అలా ఆయనకు మన దేశం లో సింహాసనం వెయ్యడానికి దీర్ఘకాల, నిత్య గొలుసు ప్రార్థన చెయ్యాలని దర్శనం తో మా పరిచర్య జరుగుతుంది.
ఇప్పటికే 70+ సేవకులు, మరికొంత మంది విశ్వాసులు కలసి ప్రతి నెల 1 వ తారీకు నుండి 5 వ తారీకు వరకు గొలుసు ప్రార్ధన జరుగుతుంది. మా ప్రాణాలిక దర్శనం ప్రాకారం ఈ ప్రార్ధన 30 రోజులు ఆగకుండా జరగాలి.
అయితే మిమ్ములను కూడా ఇందులో పాలి బాగాస్తులు గా ఉండుటకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. సంఘ, సిద్ధాంతం, ప్రాంతం, మిషన్ బేధం లేదు, పెంతుకొస్తు నుండి రోమన్ కేథలిక్, బిషప్ లనుండి సువార్తికుని వరకు అందరు రండి మనం అందరం కలసి మన సర్వలోక నిర్మానకుడు, ఆదిసంబుతుడు, సర్వశక్తుడు అయిన దేవునికి ఒక బలమైన సింహాసనం మన దేశం లో వెద్ధం.....
ఈ సహవాసం లో నెలకు ఒకరు ఒక గంట, సంఘ ముగా ఒక రోజు గొలుసు ప్రార్ధన లో ఏకీభవించ గలిగితే చాలు...
మరిన్ని సహవాస వివరాలు, కోసం
మీ వివరాలు, ఇష్టత మాతో పంచుకోండి.....
𝐈𝐍𝐃𝐈𝐀 𝐏𝐑𝐀𝐘𝐄𝐑 𝐋𝐄𝐀𝐆𝐔𝐄,
9908823196
మన గ్రూప్ లి జాయిన్ అవ్వండి. వాటిపై క్లిక్ చెయ్యండి.