లోక మాటలు క్రైస్తవునికి పట్టవు
చాల పర్యాయాలు స్నేహితులు, బంధువులు ఇచ్చిన సలహాలను మనం పాటించాము,
వాటిని అనుసరించి నడవలేము. వారు కోపపడి మేము చెప్పేది అర్ధం కావడం లేదా?
అని మనకు విసుకు పుట్టిస్తూ ఉంటారు. వాళ్లకు బయపడి క్రైస్తవులు లోక రీతిలో
జీవిస్తుంటారు. అయితే దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చారు. ఒకసారి నేను కార్యక్రమమును
నడిపిస్తుండగా కరెంటు పోయింది. మందిరం లో నేను కార్యక్రమమును నడిపిస్తుండగా బయట
నుండి చీకటిలో యోవనస్తులు జెనరేటర్ ను సిద్ధం చేస్తూ సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్న యోవనస్తునికి
ఏదో సంజ్ఞలు చేస్తున్నారు. కాని తనకు కనపడటం లేదు అందువలన అర్ధం కావడం లేదు. అప్పుడే
దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చారు. దేవుడు మనలను వెలుగు సంబందులుగా చేసాడు. చీకటి లో
ఉన్న వారి ఆలోచనలు, మాటలు, విషయాలు మనకు అర్ధం కావు. ఒకవేళ మనకు అర్ధం
కావాలంటే వారు వెలుగు లోనికి రావలసి ఉంటుంది. దేవునిలోకి వచ్చిన మనలను లోక తలంపులు,
లోక విధానాలు అర్ధం కావు, మనలను మార్చలేవు. మనం చికటి లోనికి
పడిపోకుండా జాగ్రత్త పడుధము.
వెలుగై ఉన్న మన దేవుని కృప మీకు తోడై ఉండును
గాక!
మీ సహోదరుడు
అపోస్తులు నెల్లి నాని బాబు